Home Videos VIDEO: భారతీయ మహిళకు భరోసా…

VIDEO: భారతీయ మహిళకు భరోసా…

0
SHARE

సమాజం, మతం, కుటుంబం పరస్పర ఆధారితాలు. ఈ మూడింటికి కేంద్రం మహిళలు. స్త్రీలను గౌరవించడం సహజంగా తెలిసిన, అలవాటు ఉన్న సమాజాల్లో ప్రత్యేకంగా వారికి హక్కులు, స్వేచ్ఛ కలిగించాల్సిన అవసరం రాదు. సంప్రదాయ సాంస్కృతిక జీవనం కలిగిన సమాజాల్లో ఇలాంటి సహజ గౌరవం స్త్రీలకు లభిస్తుంది. కానీ ఇవి లేని పాశ్చాత్య సమాజాల్లో గౌరవాన్ని తెచ్చుకునేందుకు ప్రత్యేక ప్రయత్నం అవసరమవుతుంది. దేశ సంస్కృతి, విలువల పరిరక్షణలో స్త్రీలకు తగిన గౌరవం మర్యాద లభించాలని మహాకవి భారతి ఆశించారు. కానీ నేటి స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు పొందిన స్త్రీ సాంస్కృతిక విలువల క్షీణతకి ప్రతీకగా మారుతోంది. మగవారిలా దుస్తులు ధరించడం, వారితో పాటు మద్యం సేవించడం, ధూమపానం చేయడమే స్వేచ్ఛ, సమానత్యాలుగా చెలామణీ అవుతున్నాయి. . సమాజం, మతం, కుటుంబం ఈ మూడు వ్య‌వ‌స్థ‌లే పాశ్చామత్య సాంస్కృతిక దాడి నుంచి మ‌న‌ల్ని కాపాడ‌తాయి. ఈ మూడింటిని నిల‌బెడుతున్నది మ‌హిళ‌లే. నిజానికి అవే మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌.