ఎప్పుడూ ఏదో ఒక విషయంలో హిందూధర్మంపై బురదజల్లడం పాశ్చాత్య మీడియాకు అలవాటుగా మారిపోయింది. తాజాగా నాజీగుర్తుగా పిలవబడే హకెన్ క్రూజ్ ను స్వస్తిక్ గుర్తును ఒకటిగా పోలుస్తూ, స్వస్తిక్ ను బ్యాన్ చేయాలని వెస్ట్ మీడియా బాగా ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారానికి వారు పెట్టిన పేరు కాన్యే వెస్ట్. వారి ప్రచారం ఎలా ఉందంటే స్వస్తిక్ అంటే హకెన్ క్రూజ్ మాత్రమేనని, అసలు స్వస్తిక్ అనేది లేనేలేదని ప్రచారం చేస్తున్నారు. కానీ నిజానికి అసలు ఆ నాజీ గుర్తుకు స్వస్తిక్ కు అసలు పోలికే లేదు.