Home News పాఠ‌శాల‌ల్లో “సూర్య‌న‌మ‌స్కారం” పై ముస్లిం ప‌ర్స‌న‌ల్ లా బోర్డు వ్య‌తిరేక‌త‌

పాఠ‌శాల‌ల్లో “సూర్య‌న‌మ‌స్కారం” పై ముస్లిం ప‌ర్స‌న‌ల్ లా బోర్డు వ్య‌తిరేక‌త‌

0
SHARE

“ఆజాదీ కా అమృత్ మహోత్సవ్”లో భాగంగా పాఠశాలల్లో సూర్యనమస్కారాలను నిర్వహించడాన్ని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకించింది.

జనవరి 1 నుంచి 7 వరకు విద్యార్థులతో ‘సూర్య నమస్కారం’ కార్యక్రమాన్ని నిర్వహించాలని దేశంలోని ప్రభుత్వ పాఠశాలలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.

అయితే, ‘సూర్య నమస్కార్’ కార్యక్రమానికి సంబంధించిన ఉత్తర్వులను ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకించింది. సూర్య నమస్కారం అనేది సూర్యుని ఆరాధనకు సంబంధించినది కాబట్టి, ముస్లిం విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనరాదని సూచించింది. ఈ మేరకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రధాన కార్యదర్శి మౌలానా ఖలీద్ సైఫుల్లా రహ్మానీ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఆరోగ్యానికి సంబంధించిన సూర్య‌న‌మ‌స్కారాల‌ను వ్య‌తిరేకించ‌డం ప‌ట్ల ముస్లిం ప‌ర్స‌న‌ల్ లా బోర్డు ప‌ట్ల విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. 2015లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సూర్య నమస్కారం విషయంలో బోర్డు, ఇతర ముస్లిం సంస్థలు వాగ్వాదానికి దిగాయి.