Home News గల్వాన్​ లోయలో త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన భారత జవాన్లు

గల్వాన్​ లోయలో త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన భారత జవాన్లు

0
SHARE

జ‌మ్మూకశ్మీర్ సరిహద్దుల్లో ఉన్న గాల్వన్ లోయలో… నూతన సంవత్సరం సందర్భంగా భార‌త ఆర్మీకి చెందిన సైనికులు జాతీయ జెండా ఆవిష్కరించారు. గల్వాన్ లోయలో జెండాను ఆవిష్కరించి రెచ్చగొట్టిన చైనాకు అంతే ధీటుగా భారత సైన్యము జవాబిచ్చింది. తాజాగా దానికి సంబంధించిన ఫొటోలు విడుదలయ్యాయి. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు న్యూయర్ రోజున భారత జవాన్లు గల్వాన్ లోయలో జెండా ఎగరేశారంటూ ట్వీట్ చేశారు.

నూత‌న సరిహద్దు చట్టాన్ని అమలు చేయడానికి రెండు రోజుల ముందు చైనా ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్‌లోని 15 స్థలాలను తన మ్యాప్‌లో త‌మ సొంత భాష‌లోకి మార్చ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు ఇటీవ‌ల మీడియా క‌థ‌నాలు నివేదించింది. దీనిపై స్పందించిన భార‌త ప్ర‌భుత్వం…అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల పేర్ల‌ను చైనాభాష‌లోకి మార్చడానికి చైనా ప్రయత్నిస్తోందని నివేదికలను గ‌మ‌నించామ‌ని, కానీ అలా చేయ‌డం వ‌ల్ల వాస్తవం మార‌దు అని స‌రిహ‌ద్దు ప్రాంతం ఎప్ప‌టికీ భార‌త్ లో అంతర్భాగంగా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది.