Home News ఢిల్లీ: ఇస్లామియా యూనివర్సిటీ ఆందోళనల వెనుక కుట్ర

ఢిల్లీ: ఇస్లామియా యూనివర్సిటీ ఆందోళనల వెనుక కుట్ర

0
SHARE
  • వాట్సాప్ గ్రూపుల ద్వారా కుట్రకు ప్రణాళిక
  • పెట్రోల్ బాంబులు తీసుకురావాల్సిందిగా కుట్రదారుల వాట్సాప్ సందేశాలు
  • ఢిల్లీ పోలీస్ వర్గాల ద్వారా బయటపడ్డ వివరాలు

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధానిలో రెండు రోజుల పాటు సాగిన హింసాత్మక ఘటనల్లో ప్రమేయం ఉన్న ప్రధాన నిందితులపై ఢిల్లీ పోలీసులు దృష్టి సారించినట్టు తెలిసింది.

న్యూస్ నేషన్ కధనం ప్రకారం.. హింసాత్మక ఘటనలకు పాల్పడినవారు వాట్సాప్ గ్రూపుల ద్వారా వీటికి పధక రచన చేశారు. ఢిల్లీ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం ఆదివారం నాటి హింసాత్మక ఘటనలు ఒక ప్రణాళికాబద్ధమైన కుట్ర ద్వారా జరిపినవి. ఆందోళనకారులు తమ బృందాలకు పెట్రోల్ బాంబులు తీసుకుని ఘటనా స్థలాలకు రావాల్సిందిగా వాట్సాప్ గ్రూపులలో సూచించారు. అంతేకాకుండా ఒకవేళ ఘర్షణలు తలెత్తే పక్షంలో భాష్పవాయువు ప్రయోగించినట్లయితే సులభంగా తప్పించుకునేందుకు వీలుగా తడిపిన దుప్పట్లు తీసుకురావాల్సిందిగా ఆందోళనకారులు తమ బృందాలకు సూచించారు. కట్టుదిట్టమైన పోలీస్ పహారా ఛేదించి ఈ ఘటనలకు పాల్పడే విధంగా ప్రణాళిక రూపొందించారు. ఈ కుట్ర తీరుతెన్నులు జమ్మూ కాశ్మీర్ అల్లర్ల సమయంలో అమలు చేసిన కుట్రను పోలిఉన్నాయని పోలీసు వర్గాల సమాచారం.

మరింత సమాచారం కోసం సమాచార భారతి యాప్ డౌన్లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి

పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక ప్రదర్శనల పేరిట ఢిల్లీ జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం వద్ద జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ద్వారా ప్రేరేపితమైన ఆందోళన దేశంలోని మరికొన్ని యూనివర్సిటీ కాంపస్ లకు పాకింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, పోలీసు అరాచకత్వంపై విచారణ జరపాలంటూ కాంగ్రెస్ సహా మరి కొన్ని రాజకీయ పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్న సమయంలో.. ఢిల్లీ అల్లర్లలో ప్రమేయంతో అదుపులోకి తీసుకున్న 10 మంది  అసలు విద్యార్థులే కాదన్న విషయం పోలీసులు బయటపెట్టారు. ఈ పదిమంది కరుడుగట్టిన నేరచరిత్ర కలిగిన వారని పోలీసులు స్పష్టం చేయగా, అందులో ముగ్గురు మరింత క్రూర స్వభావం కలిగిన వ్యక్తులుగా న్యూస్ నేషన్ గమనించింది. ఈ ఘటనలో తాము విద్యార్థులెవరినీ అరెస్ట్ చేయలేదన్న విషయాన్నీ పోలీసులు స్పష్టం చేశారు. సిసిటివి ఫుటేజీల ఆధారంగా ఆ పదిమంది నేరస్థులను గుర్తించి అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అంతేకాకుండా మరికొందరిని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉన్నట్టు కూడా తెలియజేసారు.  

సమాచార భారతి యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి