Home News దేవాలయాల్లో లైబ్రరీ ఏర్పాటు చేయండి : ISRO చైర్మన్ సోమనాథ్

దేవాలయాల్లో లైబ్రరీ ఏర్పాటు చేయండి : ISRO చైర్మన్ సోమనాథ్

0
SHARE

దేశంలోని యువత ఆలయాలకు రావడం లేదని ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. యువత దేవాలయాల వైపు రావాలంటే దేవాలయాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఈ విధంగా గ్రంథాలయాల ఏర్పాటుతో యువతను ఆకర్షించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. తిరువనంతపురంలోని శ్రీ ఉడియన్నూర్‌ దేవి ఆలయం ట్రస్టీ సోమనాథ్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు జి. మాధవన్‌ నాయర్‌ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సోమనాథ్‌ మాట్లాడారు.

 

ఈ అవార్డును తనకు ప్రదానం చేసే సమయంలో యువకులు అధిక సంఖ్యలో హాజరవుతారని తాను బలంగా నమ్మానని, కానీ… తక్కువ సంఖ్యలోనే వచ్చారన్నారు. ఈ నేపథ్యంలోనే దేవాలయాల్లో లైబ్రరీలను ఏర్పాటు చేస్తే, యువత వస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ఆలయాలు కేవలం వృద్ధులు మాత్రమే వచ్చి దేవుడ్ని తలుచుకునేవిగానే వుండొద్దని, సమాజాన్ని మార్చే ప్రభావంతమైన ప్రదేశాలుగా మారాలన్నారు. సాయంత్రం వేళల్లో వివిధ అంశాలపై దేవాలయాల్లో చర్చలు ఏర్పాటు చేస్తే యువకులు తమ అభివృద్ధి కోసం వస్తారని, ఇది వారి అభివృద్ధికి దోహదపడుతుందని సోమనాథ్‌ అన్నారు.