Home News పాల్ దిన‌క‌ర‌న్ క్రైస్త‌వ మిష‌న‌రీ సంస్థ‌ల‌పై ఐటీ దాడులు

పాల్ దిన‌క‌ర‌న్ క్రైస్త‌వ మిష‌న‌రీ సంస్థ‌ల‌పై ఐటీ దాడులు

0
SHARE

పన్నుఎగవేత, విదేశీ నిధుల దుర్వినియోగం చేస్తున్న‌ట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నత‌మిళ‌నాడులోని పాస్ట‌ర్ పాల్ దినకరన్ కు చెందిన సంస్థ‌ల‌పై ఆదాయపు పన్ను శాఖ బుధవారం దాడులు నిర్వహించింది. పాల్ దిన‌క‌ర‌న్‌కు చెందిన కొయంబత్తూరులోని కారుణ్యా ఇంజ‌నీరింగ్ కాలేజీ, చెన్నైలోని జీసస్ కాల్స్ అనే క్రిస్టియన్ మిషనరీ సంస్థతో పాటు మొత్తం 28చోట్ల దాడులు నిర్వ‌హించింది.

పాల్ దిన‌క‌ర‌న్‌ చేస్తున్న అవినీతి కార్యక‌లాపాల‌పై , విదేశీ నిధుల దుర్వినియోగంపై లీగ‌ల్ రైట్స్ ఆబ్జ‌ర్వేట‌రీ (ఎల్‌.ఆర్‌.వో) అనే ఒక సంస్థ గ‌తంలో చేసిన ఫిర్యాదు మేర‌కు ఐటీ శాఖ దాడులు నిర్వ‌హించిన‌ట్టు స‌మాచారం. ఫారెన్ కాంట్రిబ్యూష‌న్ రెగ్యూలెష‌న్ యాక్ట్ (FCRA) నిబంధ‌ల‌న‌ల‌ను ఉల్లంఘిస్తూ పాల్ దిన‌క‌ర‌న్‌‌కు చెందిన కోగ్వీల్ ట్రస్ట్, పెనియల్ అనాథాశ్రమం, బక్లీ అనాథాశ్రమం, YMCA వంటి ఎన్జీవోలు విదేశాల నుంచి వ‌చ్చిన నిధుల‌ను దుర్వినియోగానికి పాల్ప‌డుతున్నాయ‌‌ని, అలాగే మ‌త మార్పిళ్ల‌ను కూడా ప్రొత్స‌హిస్తున్నాయ‌‌ని, వెంట‌నే ఆ సంస్థ‌ల‌పై విచార‌ణ చేప‌ట్టి, వాటిని ర‌ద్దు చేయాల‌ని హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాసిన‌ట్టు ఎల్‌.ఆర్‌.వో త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో పెర్కొంది. ఈ మేర‌కు ఐటీ శాఖ పాల్ దిన‌క‌ర‌న్ ఆస్తుల‌పై దాడులు నిర్వ‌హించిన‌ట్టు తెలుస్తోంది.

పాల్ ధినకరన్ తండ్రి డి.జి.ఎస్ దినకరన్ జీసస్ కాల్స్ అనే ఒక క్రైస్త‌వ మిష‌న‌రీ సంస్థ‌ వ్యవస్థాపకుడు. ఈ సంస్థకు సంబంధించిన వెబ్‌సైట్ ప్రకారం, జీస‌స్ కాల్స్ టీవీలో ప్రపంచవ్యాప్తంగా క్రైస్త‌వ మ‌త ప్ర‌చారానికి సంబంధించి 10 వేర్వేరు భాషల్లో నెలకు 400 కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. అలాగే 1986లో స్థాపించబడిన కారుణ్య ఇంజ‌నీరింగ్ కాలెజీకి పాల్ దిన‌క‌ర‌న్ వైస్ చాన్స్‌ల‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఈ కాలేజీలో సుమారు 8000 మంది విద్యార్థులు చ‌దువుకుంటున్నారు.

పన్ను ఎగవేతే కాకుండా, జీస‌స్ కాల్స్ మిష‌న‌రీ సంస్థ విదేశాల నుంచి అందుకున్న నిధులను దుర్వినియోగం చేస్తున్న‌ట్టు ఆదాయపు పన్ను శాఖ అనుమానం వ్య‌క్తం చేసింది. విచార‌ణ త‌ర్వాత పూర్తి వివ‌రాలు వెల్ల‌డించ‌నున్న‌ట్టు ఐటీ అధికారు తెలిపారు.

Source : Organiser