Home Telugu Articles జాతి భద్రతకు తృణమూల్‌ తూట్లు !

జాతి భద్రతకు తృణమూల్‌ తూట్లు !

0
SHARE

బంగ్లాదేశ్‌కు దగ్గరగా ఉన్న భారత ప్రాంతాలను భారతదేశం నుండి విడదీసి బంగ్లాదేశ్‌లో కలిపివేయడానికి వేర్పాటువాద ముస్లింల వద్ద ఒక ఖచ్చితమైన ప్రణాళిక ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆశయాన్ని మనసులో పెట్టుకొని వేర్పాటు వాద ముఠాలు హిందువుల రోజువారీ జీవనాన్ని భంగపరుస్తున్నాయి. అందువల్లనే శాంతి భద్రతలు కాపాడవలసిన బాధ్యత గల అధికారులకు ఎటువంటి ఫిర్యాదులూ స్వీకరించ రాదని ప్రభుత్వం సూచిస్తోంది. అందుకే అక్కడ తీవ్రమైన, జాతి వ్యతిరేక, సంఘ విద్రోహ చర్యలు జరుగుతున్నాయి.

పశ్చిమ బంగలో మా-మాటి-మనుష్‌ (తల్లి-భూమి-ప్రజ) నినాదంతో అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ ప్రభుత్వం ‘దేశ కాషాయీ కరణం’ మాత్రమే దోషి అని భావించే లౌకికవాదం వంటి ఆదర్శధామ ఆలోచనలో మునిగి ఉంది. కాకుంటే, వరుసగా వచ్చిన కాంగ్రెస్‌, బంగ్లా కాంగ్రెస్‌, దాని మిశ్రమాలు, వామపక్ష పార్టీలన్నీ కలసిన లెప్ట్‌ఫ్రంట్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అన్నీ ఒకే గూటి పక్షులు, అడవిలో నక్కలు. ‘హిందుత్వం వద్దు, కాషాయికరణం వద్దు’ అనేదే వీరందరు కలిసి పాడేపాట, కలసి నడిచే బాట. అందుకే అది వారికి అతి నీచమైన నేరంగా కనిపిస్తుంది. అందుకే వారు పరిపాలన జరిపే టప్పుడు ప్రజాస్వామిక విలువలను పట్టించుకోరు.

‘మనం ఇప్పుడు రాష్ట్రంలో 27 శాతం ఉన్నాము. కాబట్టి మనం చెప్పేదానికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలి. తృణమూల్‌ ప్రభుత్వం ఉన్నదే మనకోసం. అందుకే మనలను పట్టించుకోకుండా ఉండే ధైర్యం వాళ్ళకు లేదు’ అంటూ కోల్‌కతా ఇమాం బుఖారి 2007లో ఫత్వా ప్రకటించినప్పుడే ఈ విషయం ప్రముఖంగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రకటనపై ఎలక్ట్రానిక్‌, ముద్రిత ప్రసార సాధనాలు రెండూ స్పష్టమైన నిశ్శబ్దం పాటించాయి. ఎందుకు? అనే ప్రశ్నకు సమాధానమే లేదు. వెర్రి చూపులే కాని ఒక మాటా లేదు.

ఫిబ్రవరి రెండో వారంలో తృణమూల్‌ అగ్రనేతల సమావేశం జరిగింది. నాయకురాలైన మమత గదిలోకి వచ్చి తన స్థానంలో ఆసీనులయ్యారు. సాధారణంగా, ఆమె అభిమానించే వంధిమాగధులు బాబి (ఫిర్వాద్‌) హకీం, అరూప్‌ బిశ్వాస్‌లు ఆమెకు ఇరువైపుల కూర్చొంటూ ఉంటారు. కాని ఆరోజు ఒక అసాధారణమైన రోజు. ఆమెకు ఇరువైపుల బాబి హకీం, సిద్ధిఖుల్లా ఛౌదరి ఆసీనులయ్యారు. సమావేశంలో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్య పోయారు. నిశ్చేష్టులయ్యారు.

‘బహుశ మమ్మల్ని ‘ముందుగా నమాజ్‌ ఆచరించి, ఆ తరువాతే సమావేశానికి రావాలి’ అని చెప్పే రోజు బహుశ ఎంతో దూరంలో లేదు’ అంటూ ఒక సీనియర్‌ సభ్యుడు హీన స్వరంతో చమత్క రించాడు. మనల్ని ఇప్పటికే ‘ఫత్వా-రాజ్‌’ చెత్తకుండీ లోకి విసిరేశారా అనే ఒక ప్రశ్న ఇప్పటికే నోళ్ళలో నానుతోంది. ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చే ముందు అంతర్జాలంలో ఒక మానవ హక్కుల సంస్థ ఉంచిన విషయాన్ని పరిశీలిద్దాం. వీరికి అందిన నివేదికల ప్రకారం మొహర్రం ఊరేగింపు, దుర్గాపూజ నిమజ్జనం సమయాలలో పశ్చిమ బెంగాల్‌లోని క్రింద తెలిపిన 12 స్థానాలలో మత ఘర్షణలు జరిగాయి.

1) తల్టాలి గ్రామం, జలంగి పోలిస్‌ స్టేషన్‌, ముర్షిదాబాద్‌ జిల్లా, 2) అందుల్‌ అర్గోరి గ్రామం, సంక్రైల్‌ పోలీస్‌ స్టేషన్‌, హౌరా జిల్లా, 3) మణిక్‌పూర్‌ బెల్టాల, సంక్రైల్‌ పోలిస్‌ స్టేషన్‌, హౌరా జిల్లా, 4) చంద్రన్‌ నగర్‌, ఉర్దిబజార్‌ మరియు తెలినిపార – హూగ్లి జిల్లా, 5) నైహటి దగ్గర హజినగర్‌, ఉత్తర 24 పరగణా జిల్లా, 6) కాలా బెరియ గ్రామం, భగవాన్‌పుర్‌ పోలిస్‌ స్టేషన్‌, తూర్పు మిడ్నపూర్‌ జిల్లా, 7) వల్లభపార ఘాట్‌, హట్‌ఖాల, కట్వా పోలిస్‌ స్టేషన్‌, వర్దమాన్‌ జిల్లా, 8) ఖరగ్‌పూర్‌-గోల్‌బజార్‌ మార్కెట్‌, పశ్చిమ మిడ్నపూర్‌ జిల్లా, 9) ఖర్బా గ్రామం, చంచల్‌ పోలిస్‌ స్టేషన్‌, మాల్డా జిల్లా, 10) ఋషి పౌర, కాలియచౌక్‌ పోలిస్‌ స్టేషన్‌ వెనుక – మాల్డా జిల్లా, 11) ఆరాపుర్‌ గ్రామం, ఇంగ్లీష్‌ బజార్‌, పోలిస్‌ స్టేషన్‌ పరిధి, మాల్డా జిల్లా, 12) రుజువా గ్రామం, కేతంగ్రాం పోలిస్‌ స్టేషన్‌, వర్దమాన్‌ జిల్లా.

2016 అక్టోబర్‌ 11నాడు కలకత్తాకు కేవలం 25 కి.మీ. దూరంలో హౌరా జిల్లాలో అర్గోరి గ్రామంలో సంక్రైల్‌ బిడివొ కార్యాలయానికి చాలా దగ్గరలో అమ్ర కెజాన్‌ దుర్గా పూజ మంటపం వద్ద మొదటి హెచ్చరిక మ్రోగినట్లు తెలుస్తోంది. కొందరు పోకిరీలు మహిళలను వేధించడంతో ఘర్షణ మొదలయిందని వార్తలు వచ్చాయి. బాధితులు అధికారులకు పదే పదే విజ్ఞప్తులు చేసినప్పటికి ఉపయోగం లేకపోయింది. ముస్లిముల దయవల్లనే తాము అధికారంలో ఉన్నామని రాష్ట్రంలో అధికార పక్షం భావిస్తున్నది. మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ జమాతుల్‌ ముజాహిదీన్‌ నుండి అన్ని రకరాల సహాయాలు పొందడం బహిరంగ రహస్యమే. ఇప్పటికీ సహాయం అందుతూనే ఉందని అంటారు. రాష్ట్రంలోని కొన్ని సరిహద్దు జిల్లాలలో అధిక సంఖ్యాకులుగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో అల్పసంఖ్యాక వర్గంగా చెప్పబడుతున్న వారికి సేవ చేయడం తమ విద్యుక్త ధర్మమని వారు భావిస్తున్నారు.

చరిత్రలోకి వెళితే..

పరిస్థితిని అర్థం చేసుకోవడానికి గత చరిత్ర కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 2011 నాటి రాష్ట్ర అసెంబ్లి ఎన్నికలలో 125 స్థానాలకు గాను 102 స్థానాలలో ప్రబలమైన ముస్లిం ఓట్లే జయాపజయాలను నిర్ణయిస్తామని ఒక అధికారిక దస్తావేజు వెల్లడించింది. 2008 నుండి బెంగాలి మాట్లాడే గ్రామీణ ముస్లిములు వామపక్షాల నుండి తృణమూల్‌ వైపు దారి మార్చుకోవడం ప్రారంభించా రని తెలుసుకోవడం ఇక్కడ సముచితంగా ఉంటుంది. అయితే 125 లోని 102 ముస్లిం ప్రాబల్య స్థానాలలో తమకు మద్దతిస్తారని వామపక్షాలు పగటి కలలు కంటూ వచ్చాయి. అయితే అలా జరుగలేదు. దృశ్యం అంతా పూర్తిగా మారిపోయింది.

బంగ్లాదేశ్‌కు దగ్గరగా ఉన్న భారత ప్రాంతాలను భారతదేశం నుండి విడదీసి బంగ్లాదేశ్‌లో కలిపి వేయడానికి వేర్పాటువాద ముస్లింల వద్ద ఒక ఖచ్చితమైన ప్రణాళిక ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆశయాన్ని మనసులో పెట్టుకొని వేర్పాటు వాద ముఠాలు హిందువుల రోజువారీ జీవనాన్ని భంగపరుస్తున్నాయి. ఈ ప్రాంతాలలోని వివాహిత మహిళలు తమ వైవాహిత స్థితిని తెలిపే మంగళ సూత్రం కాని, బెంగాలి సాంప్రదాయంగా శంఖం గవ్వల గాజులను గాని ధరించడానికి భయపడు తున్నారు. ఇటీవలి దుర్గాపూజ, సరస్వతీ పూజ సందర్భంగా తమ మత సాంప్రదాయం ప్రకారం హిందువులు ముగ్గులు వేయడం, శంఖం ఊదడంపై పరిమితులు విధించారు.

ఇక దేవీ ప్రతిమ ఊరేగింపు, నిమజ్జనం సంగతి చెప్పనక్కరలేదు. ఈ ప్రాంతం బయటి వారు ఈ సంఘటనలను కల్పిత కథలని నమ్మడం లేదు. ఈ సందర్భంలో మనం రెండు విషయాలను గమ నించాలి. మమతా బెనర్జీ నాయకత్వంలోని ప్రభుత్వం వారు అధికారంలో ఉండడానికి కారణం చొరబాటు ముస్లింల మద్దతేనని భావించడం మొదటిది. అందువల్లనే శాంతి భద్రతలు కాపాడవలసిన బాధ్యత గల అధికారులకు ఎటువంటి ఫిర్యాదులూ స్వీకరించ రాదని సూచించారు. అయితే, అదే ఈనాడు నియమం అయిపోయింది.

ఇక రెండవది : పశ్చిమ బెంగాల్‌ సరిహద్దు జిల్లాల్లో ముస్లిం మత జన సాంద్రతను అదే పనిగా, ప్రయత్నపూర్వకంగా మార్చడం. ఈ పని రెండు విధాలుగా జరుగుతున్నది. బంగ్లాదేశ్‌ నుంచి ముస్లిం చొరబాట్లతో బాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల ముస్లిములను పశ్చిమ బెంగాల్‌ సరిహద్దు జిల్లాలకు వలస పంపండం. కాని ఈ అంశాలు నిజం కాదని అధికారిక నివేదికలలో చెప్పారు. రాష్ట్ర ముస్లిం జనాభా 27% అని అధికారికంగా చెప్తున్నప్పటికీ, గణాంకాలు ఆందోళన కరంగా ఉన్నాయి.

దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్న ఈ జిల్లాల హిందువుల మనో వేదనకు పరిష్కారం దొరకడం లేదు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం అల్ప సంఖ్యాకులకు (ముస్లింలకు) ఏ విధమైన అడ్డంకులు కల్పించరాదని హిందువులకు స్పష్టం చేస్తూ అధికారులు జాగ్రత్త పడుతున్నారు. అందుకే అక్కడ తీవ్రమైన, జాతి వ్యతిరేక, సంఘ విద్రోహ చర్యలు జరుగుతున్నాయి. ఇక అధిక సంఖ్యాక సమాజం న్యాయం పొందడానికి న్యాయస్థానాలే దిక్కు.

– అశిమ్‌ కుమార్‌ మిత్ర – ఆర్గనైజర్‌

మహాబంగ్లాదేశ్‌కై ఐఎస్‌ఐ ఆరాటం

మహా బంగ్లాదేశ్‌ను వాస్తవం చేయడానికి ఐ.ఎస్‌.ఐ. జమాత్‌-ఉల్‌- ముజాహిదీన్‌-బంగ్లాదేశ్‌ (JMB) ద్వారా ప్రయత్నిస్తున్నది. ఈశాన్య భారతంలో భారత భద్రతాదళాలనూ, స్థానిక పరిపాలననూ కలవరపరచడానికి స్థానిక చొరబాటు దళాలు వారి (ISI) చేతిలో ఉన్నాయి. ISI వారు బెంగాల్‌లో ఇప్పటికే ప్రణాళికాబద్ధమైన రీతిలో ప్రచారాన్ని ఉధృతం చేశారు. వీరి ఆలోచనలోని మహా బంగ్లాదేశ్‌లో బంగ్లాదేశ్‌, బెంగాల్‌, త్రిపుర, దిగువ అసోంలోని బారక్‌లోయ, హైలకాంతి జిల్లా, దిమాహస్త్‌ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ప్రచారం సందర్భంగా కొత్త దేశ పటానికి రూపకల్పన చేసి, రహదారి పటంతోపాటు చలామణి చేస్తున్నారు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి అందిన నిఘా నివేదిక ద్వారా వెలుగులోకి వచ్చింది. 2014, అక్టోబర్‌ 2 నాటి బెంగాల్‌లోని బర్డ్మాన్‌ జిల్లాలోని ఖాగ్రగర్‌ ప్రేలుడు తర్వాత చాలా కేంద్ర నిఘావర్గాలు ముస్లిం చొరబాటు బృందాలపై నిఘా పెట్టాయి. ఈ సమయంలో కేంద్ర నిఘా సంస్థల అధికారులతో ఏర్పడిన భారత నిఘా బృందాలు ఈశాన్య భారతంలోను, బంగ్లాదేశ్‌లోను JMB కార్యక్రమాల గురించి ప్రామాణికమైన గట్టి సమాచారాన్ని వివరంగా సేకరించాయి. వీరి నివేదిక ప్రకారం అనుబంధ తిరుగుబాటు బృందాలు JMB సహాయంతో ఈశాన్య భారతంలో అల్లకల్లోలం సృష్టించడానికి లోతైన కుట్రలో నిమగ్నమై ఉన్నట్లు తెలిసింది. భారతదేశ భద్రత, రక్షణలకు ఈశాన్య భారతదేశం ఒక ముఖ్యమైన భౌగోళిక స్థానంలో ఉన్నది. ఈ విషయంలో భారత-బంగ్లాదేశ్‌ సరిహద్దు చాలా ముఖ్యమైనది. ISI, JMBల ద్వారా జరుగుతున్న మహా బంగ్లాదేశ్‌ ప్రచారం వెనుక చైనా హస్తం ఉన్నదని భారత నిఘా అధికారులు అనుమానిస్తున్నారు. ఒక ఉన్నత స్థాయి ఐఎస్‌ఐ అధికారి ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నట్లు భారత సీనియర్‌ నిఘా అధికారులు అంటున్నారు. కొత్త మహా బంగ్లాదేశ్‌ కోసం JMB ఒక పెద్ద ప్రచారాన్ని ప్రారంభించిందని అభిజ్ఞవర్గాలు తెలిపాయి. ఈ విషయంలో ఇటీవలే బారక్‌ లోయలోని కరింగంజ్‌ వద్ద JMB ఒక ఉన్నతస్థాయి రహస్య సమావేశం జరిపింది. ప్రచారం నిమిత్తం ఒక ప్రత్యేక మార్గదర్శక సూచీని రూపొందించారు. మహా బంగ్లాదేశ్‌ సృష్టించడానికి బారక్‌లోయ (అసోం), నాడియా, ఉత్తర 24 పరగణాలు, మాల్డా, ముర్షీదాబాద్‌, ఉత్తర బెంగాల్‌లోని భారత- బంగ్లాదేశ్‌ సరిహద్దు ప్రాంతాల వ్యాప్తంగా ప్రచారాన్ని నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. మహాబంగ్లాదేశ్‌కు సంబంధించిన కొన్ని కరపత్రాలు నిఘావర్గాలకు అందాయని అభిజ్ఞ వర్గాలు తెలిపాయి. ఈ కరపత్రాలపై ”జమాత్‌- ఉల్‌-ముజాహిదీన్‌ బెంగాల్‌” అని వ్రాశారు. బంగ్లాదేశ్‌ అని వ్రాయలేదు, ఉర్దూభాషలో ముద్రించిన కొన్ని కరపత్రాలలో ఖిలాఫత్‌ పాలనను పునస్థాపించాలని విజ్ఞప్తి చేశారు.

– బసుదేబ్‌ పాల్‌

(జాగృతి సౌజన్యం తో)