Home News జమ్మూ కాశ్మీర్: ఆర్టికల్‌ 370 రద్దు

జమ్మూ కాశ్మీర్: ఆర్టికల్‌ 370 రద్దు

0
SHARE

దిల్లీ: జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక స్వయంప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్‌ 370 రద్దు బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాజ్యసభ్యలో ప్రతిపాదించన ఆర్టికల్ 370 రద్దు ప్రతిపాదన బిల్లు
భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ వెనువెంటనే ఆమోదిస్తూ జమ్ముకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తూ ఆదేశాలు జారీ చేశారు.

జమ్ము కశ్మీర్‌ను దేశంతో అనుసంధానించాంకేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

జమ్ము కశ్మీర్‌ను భారతదేశంతో సంపూర్ణంగా అనుసంధానించామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. ఇకపై భారత  రాజ్యాంగం మొత్తం జమ్ము కశ్మీర్‌లో అమలవుతుందన్నారు. మూడు కుటుంబాలు కలిసి జమ్ముకశ్మీర్‌ను దోచుకున్నాయన్నారు. 370 కారణంగా కశ్మీర్‌కు చెందిన అనేకమంది  దరిద్రంలో జీవిస్తున్నారని, దీనిని అడ్డం పెట్టుకొని కొన్ని కుటుంబాలు అక్కడి ప్రజలను దోచుకొన్నాయని అమిత్ షా తెలిపారు. “మహారాజ హరిసింగ్‌ చేత భారత్‌లో కలుపుతూ అంగీకార పత్రంపై సంతకం చేశారు. అప్పట్లో ఆర్టికల్‌ 370 లేదు. ఆ తర్వాత వచ్చింది. ఆర్టికల్‌ 370 జమ్ము కశ్మీర్‌ను భారత్‌తో కలవనివ్వలేదు. కశ్మీర్‌ను అడ్డం పెట్టుకొని కొన్ని పార్టీలు ఓటు బ్యాంక్‌ రాజకీయాలు చేశాయి. మోదీ ప్రభుత్వానికి ఆ అవసరం లేదు. సభ్యులు అందరూ చర్చించాలి.  ఆర్టికల్‌ 370 వచ్చాకే కశ్మీర్‌లో అరాచకాలు మొదలయ్యాయి. కశ్మీర్‌లో దళితులకు రిజర్వేషన్లు దక్కలేదనే విషయం దేశానికి తెలియాలి. కశ్మీర్‌లోకి వెళ్ళే అత్యధిక నిధులు ఎక్కడి పోతున్నాయో చర్చించాలి. నేను ప్రతి  దానికి సమాధానం ఇస్తాను. ఆర్టికల్‌ 370 తొలగించడంలో ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకూడదు.’’ అని అమిత్‌ షా రాజ్యసభలో పేర్కొన్నారు.

కేంద్రపాలిత ప్రాంతాలుగాజమ్ము కాశ్మీర్లఢక్

కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కలిగించే అధికరణం 370 రద్దుతో జమ్మూకాశ్మీర్, లఢక్ లను కేంద్రపాలిత ప్రాంతాలుగా గుర్తిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు ఉన్న కాశ్మీర్ అసెంబ్లీ ఇప్పుడు కొత్తగా ఏర్పడే జమ్ము కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతపు అసెంబ్లీగా ఉంటుంది. లఢక్ మాత్రం అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటుంది.