Home Views కార్గిల్ విజ‌యం.. దేశానికే స్ఫూర్తిదాయ‌కం

కార్గిల్ విజ‌యం.. దేశానికే స్ఫూర్తిదాయ‌కం

0
SHARE

–ఆకారపు కేశవ రాజు

1999వ సంవత్సరం మే 5వ తేదీన భారత భూభాగం పై అక్రమంగా చొరబడి గస్తీ తిరుగుతున్న ఐదుగురు జవాన్లను బందీలుగా చేసుకుని సవాలు విసిరిన పాకిస్తాన్ కు ధీటుగా జవాబు చెప్పారు భారతీయ జవానులు.

చొరబాటుదారులై వచ్చిన ప్రతి ఒక్కరిడినీ అంతమొందించారు. పిరికితనంతో యుద్ధరంగం నుండి పారిపోయిన వాడే ప్రాణాలు దక్కించుకో గలిగాడు. పాకిస్తాన్ ను కోలుకోకుండా, ఇలా మరొకసారి భారత్ వైపు కన్నెత్తి చూడకుండా చేశారు. భారత్ కు విజయం సాధించి పెట్టారు.

ఈ క్రమంలో ఈ దేశరక్షణ కోసమై తమ జీవిత కుసుమాలను తల్లి భారతమాత పాదాల చెంతనర్పించిన ‘527’ మంది వీర సైనికులకు వందనాలు. వారి పరాక్రమానికి పాదాభివందనాలు.

1999 ఫిబ్రవరిలో భారత్ పాకిస్తాన్ దేశాలమధ్య ఒప్పందం కుదిరింది. కానీ, కాశ్మీర్ ను ఆక్రమించుకోవాలన్న కుట్రతో పాకిస్తాన్ సైన్యం ‘ఆపరేషన్ బదర్’ అనే పేరిట ఉగ్రవాదులను భారత సరిహద్దుల్లోకి పంపించింది. వారి వెనుకనే పాకిస్తాన్ సైన్యం కూడా బయలుదేరి ఆక్రమణ కోసమే వచ్చింది.

అప్పటి అటల్ బిహారీ వాజ్‌పాయ్‌ గారి నేతృత్వంలోని భారత ప్రభుత్వం యుద్ధం చేయకుండా ఉండేందుకు అనేక విధాలు ప్రయత్నించింది. అయినా, పాకిస్తాన్ తాను ఆక్రమించిన భూభాగం వదిలిపెట్టక, వెనకకు వెళ్లిపోవాలని అని కోరిన భారత్ ను లక్ష్యపెట్టక తన నిర్ణయం మార్చుకోకపోవడంతో యుద్ధానికి వెళ్ళక తప్పలేదు.

1999, మే 3న కార్గిల్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైనికులు కవ్వింపు చర్యలకు పాల్పడి  భారత్, పాకిస్థాన్ మధ్య కార్గిల్ యుద్దానికి తెరలేపారు.  ఈ యుఢ్ధానికి భారత సైన్యం ‘ఆపరేషన్ విజయ్’ అనే కోడ్ నేమ్ ను పెట్టింది. -10 డిగ్రీలకు పైగా ఉండే చలిలో, మంచు పర్వతాల్లో రెండు నెలల మూడు వారాల రెండు రోజులపాటు జరిగిన యుద్ధంలో వీరులైన భారత సైనికులు…, వేలాది పాకిస్తాన్ చొరబాటుదారులను వాడి వెనుక ఉన్న పాకిస్తాన్ సైనికులను సైనికులను,  మట్టుబెట్టారు.

చివరికి జూలై 26న భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొట్టి, భారతదేశ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా భారత్ విజయం సాధించింది. అందువల్ల ప్రతిఏటా జూలై 26 కార్గిల్ విజయ దినోత్సవం జరుపుకుంటాము.

(కార్గిల్ వీరుల పరాక్రమానికి గుర్తుగా నిర్మించిన స్మారకం.)

“పాకిస్తాన్ చె ఆక్రమించబడిన భూభాగాలను భారత్ కు స్వాధీనం చేసి భారతమాతకు అచంచల కీర్తిని సంపాదించి పెట్టడంలో తమ జీవితాలను అర్పించిన యుద్ధవీరులకు వందనాలు.”

–పాట్నా క్షేత్ర సంఘటనా మంత్రి, విశ్వహిందూ పరిషత్