Home News కర్ణాటక: ప్రాచీన హిందూ సాంస్కృతిక కళాఖండాలను ధ్వంసం చేసిన దుండగులు

కర్ణాటక: ప్రాచీన హిందూ సాంస్కృతిక కళాఖండాలను ధ్వంసం చేసిన దుండగులు

0
SHARE

కర్ణాటకలోని జగత్ప్రసిద్ధ హంపి క్షేత్రంలో గల శ్రీకృష్ణదేవరాయల వారి రాజగురువు శ్రీ వ్యాసతీర్థుల వారి నవబృందావన క్షేత్రంలో దుండగులు బుధవారం అర్ధరాత్రి దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ప్రాచీన పాల్పడి ప్రాచీన కళాఖండాలు ధ్వంసం అయ్యాయి. 

ఈ నవబృందావన క్షేత్రం తుంగభద్రా నది ప్రాంతంలో ఉన్న ఒక ద్వీపంలో ఉంది. ఇది ఉత్తరాది మఠం, శ్రీ రాఘవేంద్ర మఠం, శ్రీ వ్యాసరాజ మఠం, శ్రీ శ్రీ పదరాజ మఠం, ఇతర ప్రముఖ మధ్వ సాంప్రదాయ మఠాలకు చెందిన తొమ్మిది మంది హిందూ ఆచార్యులకు చెందినది. శ్రీ మధ్వాచార్యుల స్వీయ శిష్యులైన శ్రీ పద్మనాభ తీర్థుల వారు, శ్రీ కవీంద్ర తీర్థ, శ్రీ వాగీశ తీర్థ, శ్రీ రఘువర్య తీర్థ, శ్రీ వ్యాస తీర్థ లేదా వ్యాసరాజవారు, శ్రీ సుధీంద్ర తీర్థ (మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర తీర్థ గురువులు), శ్రీ శ్రీనివాస తీర్థ, శ్రీ రామతీర్థ, శ్రీ గోవింద ఒడయారు. 

గతంలో కూడా హంపి క్షేత్రంలో కొందరు పర్యాటకుల ముసుగులో ప్రాచీన కళాఖండాలు కొన్నిటిని ధ్వంసం చేసారు.