Home News కుష్టు వ్యాధి గ్రస్థుల మహాత్ముడు కాత్రే గురూజీ

కుష్టు వ్యాధి గ్రస్థుల మహాత్ముడు కాత్రే గురూజీ

0
SHARE

కుష్టు రోగం జ్ఞాపకం వస్తేనే మనస్సు భయ కంపిత అవుతుంది. అరిగి పోయిన చేతి వేళ్ళు, కాలివేళ్లుగాయాల నుండి కారుతున్న  రసిముసురుతున్న ఈగలుసమాజం నుండి దూరంగా బహిష్కరించబడిన జీవితాన్ని గడిపే రోగులు.  నేటికి 50సం|| క్రితం మధ్యప్రదేశ్ లోకుష్టు రోగుల స్వజనులు వారిని శాపగ్రస్తులు బహిష్కరించిన వేళ వారికి స్నేహ హస్తం అందించి ఒకరు వారి హృదయ వేదనను అర్థం చేసుకుని వారిని సవరించారు. వారి గాయాలకు ఆత్మీయతా లేపనం పూసి వారిని స్వయం సమృద్ధులు గాను సమర్ధులుగాను తయారు చేసి స్వాభిమానంతో బతికే మార్గాన్ని చూపించారు. ఆయనేతాను కుష్టు వ్యాధిగ్రస్తులు అయ్యి కూడా మధ్యప్రదేశ్ చాపాలో అతిపెద్ద కుష్టు నివారణ కేంద్రానికి పునాది వేసిన సదాశివ గోవిందరావు కాత్రే గారు. అక్కడి స్వయం సేవకులు ఆయన్ని కాత్రే గురూజీ గా పిలుస్తారు. తన వంకరటింకర చేతులు కాళ్లతో గంటల తరబడి సైకిల్ తొక్కి గ్రామం -గ్రామం తిరిగి కుష్టు రోగుల కోసం పిడికెడు ధాన్యాన్ని సేకరిస్తూ ఆయన తన సేవా కార్యాన్ని ప్రారంభించారు. గోల్వాల్కర్ గురూజీ ప్రేరణతో ఒక శాపగ్రస్త జీవితం నుండి ఎంతటి సేవా దీపం గా మారారు అంటే ఆ దీపం ఛాయలో అనేక తరాలు వెలిగాయి. ఆయన తన నొప్పినే తనకు ప్రేరణ శక్తిగా మార్చుకున్నారు. 

నేడు ఛాపా కుష్టు వ్యాధి నివారణ సంఘం కుష్టు వ్యాధి గ్రస్తుల పాలిట స్వర్గంగా భావించబడుతుంది. ఇక్కడ రోగులకు వైద్య చికిత్సతో పాటు స్నేహ హస్తంతో చక్కటి సంస్కారం లభిస్తుంది. కొవ్వొత్తుల తయారీ నూలు దారం తయారీతాళ్లు అల్లడంచాక్ పీస్ తయారీ ఇలాంటి పనులు చేసి స్వాభిమానంతో జీవిస్తున్నారు. ఇక్కడ 300 మంది రోగుల పిల్లల కోసం ఒక చక్కటి విద్యాలయం కూడా ఉంది. మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లా లో వుండే గోవింద్ కాత్రే జీవితమంతా సంఘర్షణ లతోనే నిండిపోయింది. ఏడవ తరగతి పూర్తి చేయగానే రైల్వే లో పని చేయడం మొదలుపెట్టారు .ఆ ఈ సమయంలో ఆర్ ఎస్ ఎస్ పరిచయమయ్యింది. 1948లో సంఘం నిషేధించబడిన అప్పుడు కాత్రే ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాడు. జీవితం అతనికి ఎన్నో కఠిన పరీక్షలు పెట్టింది. చిన్న వయసులోనే భార్య చనిపోయింది. తాకట్టు కింద ఉంచుకున్న ఆభరణాలు వాళ్ళ అక్క తనకు తిరిగి ఇవ్వలేదు. ఆత్మీయులు లేరు.

మతం మారను అన్నందుకు ఈయనకు చికిత్స చేసి ఆశ్రయమిచ్చిన మిషనరీ వైద్యశాల ఈయన్ని వైద్యశాల నుండి వెళ్ళ గొట్టింది. అన్ని దారులూ మూసుకుపోయాయిఅప్పుడు గురూజీ కలిశారు వారి ప్రేరణతో తనే తనలాంటి సమాజం నుండి బహిష్కృతులైబ్రతికి ఉండి నరకాన్ని అనుభవిస్తున్న వారికి సేవ చేయాలని సంకల్పించి సేవా కేంద్రం ప్రారంభించారు. సొంటీ దగ్గర ఘోఘరానాల వద్ద కుష్టు బస్తీలో ఒక చిన్న గుడిసెలో ఇద్దరు రోగుల గాయాలకు కట్టుకట్టడంవారికి భోజనం కల్పించడంతో సేవా కేంద్రం ప్రారంభించారు. కాళ్లకు గాయాలయి నడిచే శక్తి పోయిందిదాంతో ఆయన 60 ఏళ్ల వయసులో సైకిల్ తొక్కడం నేర్చుకున్నారు. ఇంటి ముందున్న అరుగు సహాయంతో సైకిల్ ఎక్కి ఛాపా కి దగ్గరలో ఇరవై కిలోమీటర్ల పరిధిలోని సాహఆఫీరీలఖురిబిర్రా లాంటి గ్రామాలకు ప్రయాణించి దాతల నుండి ధాన్యాన్ని సేకరించేవారు. దాన్ని తిరిగి తీసుకు వచ్చి తానే స్వయంగా వండి రోగులకు తినిపించే వాడు దాంతోపాటు వాళ్ల గాయాలకు కట్లు కూడా కట్టేవాడు. ఆయన వెళ్లిన చోట్ల చాలాసార్లు అవమానాలూ ఎదుర్కుంటూ ఉండేవారు. ఎవరూ ఆయనకు గ్లాసుడు నీళ్ళు కూడా ఇచ్చేవారు కాదు. అయినా ఆయన ఓడిపోయినట్లు భావించలేదు. క్రమంగా రోగుల సంఖ్య పెరిగింది. తీవ్రమైన నా కృషి వల్ల సేవచేసే సహచరులు కొందరు జోడింపబడ్డారు. ఛాపా లో ఆశ్రమం కోసం కొంత భూమి దానంగా దొరికినప్పుడు తను రైల్వేలో రిటైర్డ్ అయినప్పుడు వచ్చిన డబ్బు సర్వస్వాన్ని ఖర్చు చేసి నాలుగు గదులు కట్టించాడు. మెల్లమెల్లగా రోగుల కోసం ఆవాసం ఏర్పడింది ఒక గోశాల ఏర్పడింది ఎనభై ఐదు ఎకరాల్లో విస్తరించిన ఛాపా భారతీయ కుష్టు నివారణ సంఘంలో 300 కన్నా ఎక్కువ మంది రోగులు ఉన్నారు. సేంద్రియ వ్యవసాయం చేస్తూ 150 గోబర్ గ్యాస్ ప్లాంట్ లతో 1000 సంచుల పప్పుబియ్యంఅనేక నిత్య అవసరాల వస్తువుల ఉత్పత్తి చేస్తున్నారు. పక్కనేఉన్న మాధవ సాగర్ నుండి నీటిని తమ పొలాలకు వాడుతున్నారు.

అక్కడ ఏర్పాటు చెయ్యబడ్డ కాత్రే జి విగ్రహానికి నివాళులు అర్పిస్తూ నేడున్న సేవా కేంద్రం సంచాలకులు దామోదర్ చాపట్ అన్న మాటలు “ఏ తండ్రిని అయితే అతని ఏకైక పుత్రిక అత్తగారింటి వారు అవమానకరంగా బహిష్కరించారో అతను వందల మంది రోగుల ఆత్మాభిమానాన్ని కాపాడి తమ కాళ్ళమీద తాము నిలబడే విధంగా వారిని తీర్చిదిద్దారునేడు కాత్రేజి మన మధ్య లేకపోవచ్చు కానీ ఆయన వెలిగించిన సేవా కాగడలు ఎన్నో అంధకారమైన జీవితాలలో వెలుగు నింపింది.

Source : Sewagatha