ఖిలాఫత్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చార్మినార్ భాగ్ గౌలిపురాలోని మాధవ నిలయం జరిగింది.
డాక్టర్ శ్రీ రంగ గోద్బోలే గారు “ఖిలాఫత్” పేరిట మరాఠీలో రచించిన ఈ పుస్తకాన్ని సంవిత్ ప్రకాశన్ ట్రస్ట్ తెలుగులోకి అనువదించి తెలుగు పాఠకులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. శ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు దీనికి ముందుమాట రాశారు.
కార్యక్రమంలో చార్మినార్ జిల్లా సంఘచాలక్ శ్రీ కొత్తకోటి పృత్విరాజు గారు, పత్తర్ గట్టి, మైలార్ దేవ్ పల్లి నగర సంఘచాలకులతో పాటు సుమారు 50 మంది సాహితీ ప్రియులు పాల్గొన్నారు.
విశ్వ సంవాద కేంద్ర తెలంగాణ ప్రాంత టోలి సభ్యులు శ్రీ కళ్యాణ చక్రవర్తి గారు, తెలంగాణ ప్రాంత ప్రచార ప్రముఖ్ శ్రీ ఆయుష్ గారు పుస్తకాని పరిచయం చేశారు. శ్రీ కళ్యాణ చక్రవర్తి గారు మాట్లాడుతూ.. భారతదేశంలోని ముస్లింలకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ ఉద్యమంలో వారిని పాల్గొనేటట్లు స్థానిక ముస్లిం ప్రోత్సహించడం, గాంధీ సైతం దానికి మద్దతు తెలపడం వలన భారతదేశాన్ని ముస్లిం రాజ్యాంగ మార్చాలి అనే ఉద్దేశం బలపడింది అన్నారు. ఈ ఉద్యమాన్ని ఆసరాగా చేసుకుని కేరళలోని మలబార్ ప్రాంతంలో హిందువులే లక్షంగా హత్యలు, మతమార్పిడులు, మహిళలపై అత్యాచారాలు చేశారు అని తెలిపారు.
తెలంగాణ ప్రాంత ప్రచార ప్రముఖ్ శ్రీ ఆయుష్ నడింపల్లి మాట్లాడుతూ.. బ్రిటిష్ వారి బెంగాల్ విభజన సమయంలో యావత్ దేశం ఏకమై పోరాడింది కానీ ఖిలాఫత్ ఉద్యమం కారణంగా ముస్లిం మత కేంద్రంగా రాజకీయాలు జరగడం, అదే కారణంగా దేశ విభజన కూడా జరిగిందన్నారు. ముస్లింలు భూమిపై హక్కు ను ఆధారంగా చేసుకొని ముస్లిమేతరులు నివసిస్తున్న దారుల్ హర్బ్ నుంచి కేవలం ముస్లిం నివసించే స్థలం “దారుల్ ఇస్లాం”గా మార్చే ప్రయత్నం చేస్తారు అని అంబేద్కర్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీంతో పాటు పాకిస్తాన్ హిందువుల పట్ల చేసిన వాగ్దానాలు నమ్మిన పాకిస్తాన్ న్యాయ మంత్రి గా పని చేసినా జోగేంద్ర నాథ్ మండల్ అక్కడ దేశ విభజన తరువాత హిందువుల పట్ల కొనసాగించిన మరణ హోమాన్ని ప్రత్యక్షంగా చేసిన తరువాత , తిరిగి భారత్ రావడం ముస్లిం వేర్పాటు దొరణి ని పట్ల విపులంగా వివరించడం జరిగింది.
ఈ క్రింద పేర్కొన్న ముఖ్యమైన అంశాలు ఈ పుస్తకంలో ప్రముఖంగా ప్రస్తావించబడ్డాయి.
1. ఖిలాఫత్ ఉద్యమం – ఇప్పుడు మనం తెలుసుకోవలసినది ఏమిటి?,
2. చారిత్రక సంఘటనలు
3. బ్రిటిష్ అండతో పెరిగిన ముస్లిం వేర్పాటు వాదం
4. బెదిరింపులు, మారణకాండ, మోప్లా జిహాద్,
ఈ పుస్తకం బర్కత్ పురా ప్రాంతంలోని ‘సాహిత్య నికేతన్’ పుస్తక విక్రయశాలలో అందుబాటులో ఉంటుంది. సాహిత్య నికేతన్ పుస్తక విక్రయశాల వారి ఫోన్ నెంబర్: 040 2756 3236
ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయదలచిన వారు ఈ క్రింది లింక్ ద్వారా పుస్తకాన్ని ఖరీదు చేయవచ్చు.
https://www.hindueshop.com/product/khilafat-desh-vibhajana-tel/