కిత్తూరు చెన్నమ్మ కన్నడ దేశానికి చెందిన కిత్తూరు అనే చిన్నరాజ్యానికి రాణి. అప్పటికి భారతదేశం బ్రిటిషు ఈస్టు ఇండియా కంపెని వారి అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్‌లోని ఝాన్సికి చెందిన లక్ష్మీబాయి కన్నా 56 సంవత్సరాల ముందే చెన్నమ్మ తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం ఆంగ్లేయులతో సమరం సాగించింది. ఆ విధంగా ఆగ్లేయులను ఎదిరించిన మొట్టమొదటి భారతీయ వీర వనిత చెన్నమ్మ. కిత్తూరు రాణి చెన్నమ్మ గౌరవార్థం 2007 లో భారత ప్రభుత్వం పార్లమెంట్ ఆవరణలో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.