Home News క్రైస్తవ మిషనరీ వసతి గృహం బాలికల అదృశ్యం.. సిబ్బంది పాత్రపై దర్యాప్తు

క్రైస్తవ మిషనరీ వసతి గృహం బాలికల అదృశ్యం.. సిబ్బంది పాత్రపై దర్యాప్తు

0
SHARE
ఒక క్రైస్తవ ఎన్జీవో ఆధ్వర్యంలో నడుస్తున్న బాలికల వసతిగృహం నుండి నలుగురు మైనర్ బాలికలు తప్పించుకున్న ఘటన పాట్నాలో చోటుచేసుకుంది.
పాట్నాలోని పాటలీపుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆశా కిరణ్ బాలికల వసతి గృహం నుండి నలుగురు బాలికలు శనివారం అర్ధరాత్రి తప్పించుకుని వెళ్లిపోయారు. వారిలో ముగ్గురి వయసు 16 ఏళ్ళు కాగా మరొక బాలిక వయసు 12 సంవత్సరాలు. వసతి గృహం భవంతి నుండి చీరల సహాయంతో కిందకి చేరుకున్న బాలికలు సెక్యూరిటీ కంట పడకుండా తప్పించుకోవడం గమనార్హం.
ది టెలిగ్రాఫ్ కధనం ప్రకారం ఆశాకిరణ్ బాలికల వసతి గృహాన్ని మాషల్ అనే క్రైస్తవ ఎన్జీవో నిర్వహిస్తోంది. అధికారిక సమాచారం ప్రకారం డిసెంబర్ 2000వ సంవత్సరంలో సొసైటీగా రిజిస్టర్ అయిన మాషల్ సంస్థ బాలికల వసతి గృహాన్ని ఏర్పాటు చేసింది. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద లైసెన్స్ పొందిన ఇది నిజానికి పాట్నాలోని ‘సిస్టర్స్ ఆఫ్ నోట్రే డేమ్’ అనబడే క్రైస్తవ మిషనరీ సంస్థకు అనుబంధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆశాకిరణ్ బాలికల వసతి గృహాన్ని మే 2018లో తొమ్మిది మంది బాలికలతో ఆర్చిబిషొప్ రెవ్ విలియం డిసౌజా ప్రారంభించినట్టు ‘సిస్టర్స్ ఆఫ్ నోట్రే డేమ్’ అధికారిక వెబ్సైటు ద్వారా తెలుస్తోంది.
‘సిస్టర్స్ ఆఫ్ నోట్రే డేమ్’ అధికారిక వెబ్సైటు నుండి సేకరించిన ఫోటో
ఘటనలో తప్పించుకున్న బాలికల్లో ముగ్గురు బీహార్ రాష్ట్రానికే చెందినవారు కాగా మరొకరు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన బాలిక. ఈ నలుగురిని గత నెలలోనే ఇక్కడికి తీసుకువచ్చినట్టు సమాచారం. ఘటనలో ఆశాకిరణ్ సిబ్బంది పాత్రపై దర్యాప్తు జరుపుతున్నట్టు పాటలీపుత్ర పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ తివారి తెలిపారు.
గత మార్చిలో ముజఫర్-పూర్లోని మరొక స్వచ్ఛంద సంస్థ నడిపే బాలికల వసతిగృహంలో 30 మంది బాలికలపై లైంగిక వేధిపుల ఘటన చోటుచేసుకుంది. ఆశాకిరణ్ సంస్థకు ప్రభుత్వ నిధులు అందుతున్నప్పటికీ ముజఫర్పూర్ ఘటనలో అత్యాచారానికి గురైన బాలికలకు తమ వసతుగృహంలో ఆశ్రయం ఇవ్వలేమంటూ అప్పట్లో ఆశాకిరణ్ ఆఫీస్ ఇంచార్జి ఆల్కా సాంఘిక సంక్షేమ శాఖకు ఉత్తరం రాయడం తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా 2016-17 ఆర్ధిక సంవత్సరానికి విదేశాల నుండి కోటి ముప్పై లక్షల రూపాయలకు పైగానే ఆర్ధిక సహాయం పొందినట్లు ఆ సంస్థ దాఖలు చేసిన రిపోర్టులు తెలియజేస్తున్నాయి.