వివాహానికి నిరాకరించిందని మైనారిటీ తీరని హిందూ బాలికను హత్యచేసిన ఘటన శుక్రవారం ఢిల్లీలో జరిగింది. వాయువ్య ఢిల్లీకి చెందిన 17 ఏళ్ల నీతూ అనే బాలిక ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. వీరి కుటుంబం కొంత కాలం క్రితం ఢిల్లీలోని బనావా ప్రాంతంలో నివాసం ఉండేది. ఆ సమయంలో వీరి ఇంటి పక్కన ముస్లిం కుటుంబానికి చెందిన లైకాఖాన్ అనే యువకుడు నీతూతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజు లకు నీతూ కుటుంబం బనావా నుంచి వాయువ్య ఢిల్లీకి మకాం మార్చడంతో నుంచి లైకాఖాన్ తరచూ నీతూ వాళ్ల ఇంటికి వచ్చి తనను వివాహం చేసుకోవాలని వేధించేవాడు. వివాహానికి నీతూ నిరాకరించేది. ఈ విషయం నీతూ తల్లికి తెలియడంతో ఆమె కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.
రక్తపు మడుగులో ఉన్న నీతూను ఆస్పత్రిలో చేర్చగా తీవ్ర గాయాలు కావడంతో నీతూ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకోవడానికి 6 బృందాలను ఏర్పాటు చేసినట్టు స్థానిక డీసీపీ మిశ్రా తెలిపారు.