కోవిడ్ మహమ్మారి మరోసారి మన దేశానికి సవాలు విసిరింది. ఈసారి వ్యాధి సంక్రమణం, తీవ్రత ఎక్కువగా ఉంది. ఈనాడు దేశంలో చాలా ప్రాంతాలు దీనిని ఎదుర్కొంటున్నాయి. ఎక్కువ సంఖ్యలో ప్రజలు దీని బారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్నారు. కొన్ని వందల కుటుంబాలు తమ వారిని పోగొట్టుకున్నాయి. ఈ విపత్తు వలన నష్టపోయిన వారందరికీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తన సంతపాన్ని తెలియజేస్తోంది.
పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ సమాజంలో శక్తి అపారంగా ఉంది. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొనడంలో మన సత్తా ప్రపంచానికి ఇదివరకే తెలిసింది. స్వీయ నియంత్రణ , అనుశాసనం, పరస్పర సహకారం, ఓర్పు, నిబ్బరంతో మనం ఈ పరిస్థితుల నుండి బయటపడతామని ప్రగాఢ విశ్వాసం. ఆకస్మికంగా తలెత్తిన పరిస్థితుల వల్ల పడకలు, ఆక్సిజన్, మందుల కొరత ఎదుర్కొంటున్నారు. భారత్ వంటి పెద్ద సమాజాలలో ఇబ్బందులు కూడా పెద్దవిగా కనబడతాయి. వీటిని పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, స్థానిక వ్యవస్థలు నిరంతరం పని చేస్తున్నాయి. వారి ప్రాణాలకు తెగించి వైద్య సిబ్బంది, భద్రతా బలగాలు, పారిశుద్ధ్య కార్మికులు తమ విధులు ఇదివరకు మాదిరిగానే నిర్వహిస్తున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయంసేవకులు కూడా, సహజంగానే వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు.
సమాజంలో వివిధ సామాజిక, ధార్మిక సంస్థలు కూడా తమ వంతు ప్రయత్నాన్ని చేస్తున్నాయి. ఈ పరిస్థితులను అదనుగా చేసుకుని దేశ వ్యతిరేక శక్తులు అవిశ్వాసాన్ని, ప్రతికూలతలను సృష్టించే ప్రయత్నం చేయవచ్చు. దేశ ప్రజలు వీరి పట్ల జాగురుకతతో వ్యవహరించాలి.
ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్దేందుకు ముందు రావాలని సామాజిక, ధార్మిక,సేవ సంస్థలను , ఆర్థిక , పారిశ్రామిక రంగాల పెద్దలను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విజ్ఞప్తి చేస్తోంది.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మనందరం కొన్ని విషయాల పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంది. ఆరోగ్యానికి, అనుశాసనానికి సంబంధించి నియమపాలన చేయడం . సేవ కార్యక్రమాలలో పాల్గొనేవారు మరీ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి.
– మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, సామాజిక కార్యక్రమాలలో పరిమిత సంఖ్యలోనే పాల్గొనడం, కర్ఫ్యూ వంటి నియమాలు పాటించడంతోపాటు ఆరోగ్యానికి సంబంధించి ఆయుర్వేద కషాయం, ఆవిరి , టీకా వంటి వాటి గురించి అవగాహన చేపట్టాలి.
– అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళండి. దైనందిన కార్యక్రమాలను తగ్గించుకోవాలని సమాజాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము.
– వైద్యలకు, ఆరోగ్య కార్యకర్తలకు, భద్రతా సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు అన్నీ స్థాయిల్లో సహకారం అందింఛాలి.
– సమాజంలో అన్నీ వర్గాలకి, ప్రచార మధ్యమాలకు, ఆశాజనక అనుకూల వాతావరణాన్ని , నమ్మకాన్ని నిలిపి ఉంచడంలో తమ వంతు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము
– సామాజిక మాధ్యమాలలో ఉన్నవారు జాగురుకులై ఉండడం , నిగ్రహం పాటించడం ద్వారా తమ పాత్ర పోషించాలి.
Statement by RSS Sarkaryavah Dattatreya Hosabale Ji :
“Although the situation is critical, yet the strength of the society is also enormous. Our capability to meet the most trying crisis is well known across the world.”https://t.co/hYxbF5rUR1
— RSS (@RSSorg) April 24, 2021
–స్వేచ్చానువాదం