మహిళా సాధికారత అంశంలో ఆరెస్సెస్ దృష్టి కోణం గురించిసర్ సంఘచాలక్ మోహన్ జీ భగవత్ మాటల్లో..
“మహిళల పట్ల పురుషుల దృష్టి సరిగా లేనప్పుడే వారి భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. ఈ సరైన దృష్టి మన పరంపరలో ఉంది. మాతృవత్ పర దారేషు ..భార్యను తప్పించి మిగిలిన అందరూ స్త్రీలను తల్లిలా భావించాలి. ఇది మన దేశంలో ఆదర్శం. ఈ సంస్కారాలను మగపిల్లలకు కలిగించాలి. అందుకనే యుక్తవయస్సు మగ, ఆడపిల్లలకు వికాస కార్యక్రమంతోపాటు మహిళలకు స్వీయరక్షణలో శిక్షణ కూడా నిర్వహించాలి. వీటిలో కూడా స్వయంసేవకులు పని ప్రారంభించారు.”