Home News సెప్టెంబర్ 25: మలబార్ హిందూ సామూహిక హత్యాకాండ నిరసన దినం

సెప్టెంబర్ 25: మలబార్ హిందూ సామూహిక హత్యాకాండ నిరసన దినం

0
SHARE

వందలాది సంవత్సరాల క్రితం, ISIS గురించి కానీ తాలిబాన్ గురించి కానీ ఎవరికీ తెలియని కాలంలోనే 1921 లోనే మలబార్ లో కొంత మంది మోప్లా ముస్లింలు ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. యాభై వేల మందికి పైగా మోప్లా ముస్లిం మత మౌఢ్యవాదులు ఈ ఇస్లామిక్ తీవ్రవాద సైన్యంలో సభ్యులయ్యారు. పోలీసులతో, సైన్యంతో నేరుగా కొన్ని ఘర్షణలు అయ్యాక మోప్లా ముస్లిం తీవ్రవాదులు పొంచి ఉండి గెరిల్లా పోరాటం ప్రారంభించారు. ఆరు నెలల పాటు, ఈ ఇస్లామిక్ ఉగ్ర సైన్యానికి చెందిన సాయుధ దళాలు మలబార్ జిల్లాలోని ఆరు తాలూకాల్లో స్వైరవిహారం చేస్తూ, హిందూ జనాభాని భయకంపితులను చేశాయి, హిందువులపై అమానుషమైన దాడులు, అత్యాచారాలకు ఈ సైనికులు ఒడిగట్టారు. మూకుమ్మడి హత్యలు, సామూహిక అత్యాచారాలు, ఆస్తులు దగ్ధం చేయడం, దోపిడీ, ఆలయాల విధ్వంసం, హిందువులను బలవంతంగా మత మార్పిడులు చేయించడం ఈ కాలంలో విపరీతంగా జరిగాయి, ఈ సమయంలో దాదాపు రెండు లక్షల మంది మలబార్ లో నిర్వాసితులు కావడం లేదా ఇళ్ళు విడిచి పారిపోవడం జరిగింది. వారిలో చాలా మంది సహాయ శిబిరాల్లో శరణార్ధులు కాగా, కొంత మంది గృహాల్లో తలదాచుకున్నారు. బాధితుల్లో చాలా మంది తమ జీవితకాలం సంపాదన, తమ జీవనోపాధి శాశ్వతంగా కోల్పోయారు.

ఇదే కాలంలో కేవలం హిందువులైన కారణంగా వేలాదిమంది తమ ప్రాణాలు కోల్పోయారు. వేలాదిమంది హిందువులను బలవంతంగా ఇస్లాంకి మత మార్పిడి చేయించారు. వందలు, వేలాదిమంది మహిళలపైన అత్యాచారాలు జరిగాయి. ఇస్లాం మతంలో మారేందుకు నిరాకరించిన కారణంగా హిందువులను ముస్లిం మౌఢ్యవాదులు వర్ణించనలవికాని విధంగా హింసలు పెట్టారు. మరుగుతున్న నీళ్ళు మనుషులపై పోసి, వారు విలవిలలాడుతుండగా చర్మం ఒలవడం, హిందువులచేత గుంటలు తవ్వించి, వారు తవ్విన వాటిలోనే వారిని సజీవంగా ఖననం చేయడం, గర్భవతులైన స్త్రీల పొట్ట కోసి, గర్భాశయాల నుంచి భ్రూణాలను పెరికించివేయడం, హిందువులను ముక్కలుగా నరికి బతికున్నా కూడా బావులు, చెరువుల్లో పారేయడం, ఇలాంటి ఎన్నో ఘోరమైన చిత్రవధలకు హిందువులను గురిచేశారు, ఆ రోజుల్లో మలబార్ నదుల్లో చెరువుల్లో హిందువుల కళేబరాలు అసంఖ్యాకంగా నీటిపైన తెలియాడుతూ కనిపించేవి. ఇస్లాంకి మారేందుకు నిరాకరించిన హిందువులను తలనరికి వారి శరీరాలను పారేసిన బావులు ఎన్నో.

సెప్టెంబర్ 25 మలబార్ హిందూ సామూహిక హత్యాకాండ నిరసన దినంగా పాటిస్తున్నాం. మలబార్ లో జిహాద్ పేరిట జరిగిన ఉగ్రకాండ బాధితులను తలచుకునేందుకు ఈ రోజు పాటిస్తుండగా ఈ యేడాది మలబార్ హిందూ సామూహిక ఊచకోత జరిగి వందేళ్లు పూర్తి కావడం గమనార్హం. మలబార్ జిల్లాలోని తూవూర్ గ్రామంలో దాదాపు 50 మంది హిందువుల తలనరికి వారి మృతదేహాలను బావిలో పడవేసిన రోజు సెప్టెంబర్ 25. 1921 సంవత్సరంలో మలబార్ లో జరిగిన ఘటనలు మానవాళిపై జరిగిన దారుణమైన నేరాలు. ఇటువంటి ఘట్టాలు, ఘోరాలు పునరావృతం కాకుండా ఉండేలా నివారించేందుకే ఈ రోజు జరుపుకోవడం.