Home News “మణిపూర్ చరిత్ర ఈనాటిది కాదు”

“మణిపూర్ చరిత్ర ఈనాటిది కాదు”

0
SHARE
  • విశ్రాంత ఐఎఎస్ అధికారి ఐ.వై.ఆర్. కృష్ణారావు (మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి)

మణిపూర్ చరిత్ర ఈనాటిది కాదని విశ్రాంత ఐఎఎస్ అధికారి ఐవిఎఆర్ కృష్ణారావు అన్నారు. సోమవారం సాయంత్రం భాగ్యనగరం, ఖైరతాబాద్ లో గల సరస్వతీ శిశుమందిర్ లో విశ్వ సంవాద కేంద్రం, సమాచార భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా జర్నలిస్టుల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మణిపూర్ చరిత్ర గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తాను 1979 ప్రాంతంలో ఈశాన్య ప్రాంతంలో ఐఎఎస్ అధికారిగా పని చేశానని తెలిపారు. వివిధ పత్రికలు మీడియాతో పాటు సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని కథనాలు చూసి తాను కలత చెందానని అన్నారు. అక్కడ పని చేసిన అనుభవానికి మీడియా లో విలీనం వస్తున్న కథనాలకు పొంతన లేదన్నారు.

అనాదిగా మణిపూర్ ఒక స్వతంత్ర రాజ్యమే గాక ప్రత్యేక సాంస్కృతిక చరిత్ర ను అపాదించుకున్న చరిత్ర మణిపూర్ ది అన్నారు. మణిపూర్ ప్రత్యేకంగా మహిళాదికారిక ప్రాంతమని తెలిపారు. మన ప్రాంతంలో మగవారి ప్రాధాన్యత ఉంటె ఈశాన్య ప్రాంతంలో మహిళా ప్రాధాన్యత అదికమని తెలియజేశారు. అంతేకాకుండా వారు హిందువులమని భావించరని కాని హిందూ సాంప్రదాయాలను పోలే వైష్ణ‌వ ఆచారాలు మత సిద్ధాంతాలను పాటిస్తారని తెలిపారు. కొండల్లో నివసించే వారిని నాగాలుగా , కుకీ తెగలుగా వర్ణిస్తారని అలాగే పల్లపు ప్రాంతాల్లో నివసించే వారిని మైతేయిలుగా వ్యవహరిస్తారు. వీరేగాక అనేక తెగలు గా వీరక్కడ జీవనం సాగిస్తున్నారన్నారు. అక్కడ ప్రతీ మైతేయి గృహంలో చిన్నపాటి దేవాలయం తప్పకుండా ఉంటుదన్నారు.

భారతదేశం స్వాతంత్య్రానికి ముందు ఒక ప్రత్యేక రాజ్యంగా ఉండేదని తెలిపారు. బ్రిటీష్ వారు స్వాతంత్య్రం రాకముందు వీరిని అప్పటి బర్మాలో కలపాలని ఎంత ప్రయత్నించినా వారి ఫలితం నెరవేరలేదన్నారు. భారతదేశంలో కూడా అన్ని రాజ్యాలు వీలీనాలు జరుగుతుంటే మణిపూర్ మాత్రం కలువలేదని తెలిపారు. అంతేకాకుండా భారత్ లో కలవడానికి సహజంగా రాజులు వ్యతిరేకిస్తే ఇక్కడ మణిపూర్ లో ప్రజలు కూడా వ్యతిరేకించిన చరిత్ర మణిపూర్ ప్రజలదని మరువరాదన్నారు. వారు భారత దేశంలో విలీనం ఐనప్పటికీ ఏనాడూ భారతీయులమనే భావన ఏనాడూ వారికి కలుగు లేదన్నారు.

1980 ప్రాంతంలో కేంద్రం ఆ ప్రాంతాన్ని అత్యంత సమస్యాత్మక మైన ప్రాంతంగా గుర్తించి అనేక రకమైన రక్షణాపరమైన చర్యలు తీసుకుందన్నారు. కానీ ఈ సమయంలో మిలటరీ అనేక ఆకృత్యాలకు పాల్పడుతోందనే విమర్శలు ఎక్కువయ్యాన్నారు. మిలటరీ జరిపిన ఆపరేషన్ లలో దాదాపుగా 2000 మంది మణిపూర్ లో ఎన్ కౌంటర్ జరిగిందన్నారు.

అటువంటి పరిస్థితుల్లో  కేవలం అక్కడ రామకృష్ణ మిషన్, ఆర్.ఎస్.ఎస్ లు మాత్రమే మైతేయిలను భారతీయీకరణ చేయడంలో చాలా కృషి చేసాయని తెలిపారు. అయితే ఇదే సమయంలో 1990 ప్రాంతంలో వారిని ప్రభుత్వ వ్యతిరేకత నుండి తప్పించడానికి ఇందిరాగాంధీ ప్రభుత్వం చర్చీ ని ప్రయోగించిందని తెలిపారు. అయితే అది మార్పిడి చేయగలిగింది గానీ భారతీకరణ చేయలేదని తెలిపారు. దాని ఫలితమే అక్కడ అనేక రకాలైన తిరుగుబాటు సంస్థల ఏర్పాటు కు పునాది అని తెలిపారు.

అంతే కాకుండా అక్కడ కేంద్రం గత నాలుగు సంవత్సరాలుగా నిషేదిత వ్యవసాయ పంటలపై ఉక్కు పాదం మోపుతోందని తెలిపారు. కొండ ప్రాంతాల్లో ఎక్కువగా వీరు గంజాయి,పాపి,నల్లమందు పంటలు పండించడానికి అలవాటు పడ్డారని తెలిపారు. ఈ రకమైన నిషేదిత పంటల సాగు ఒక రకంగా ప్రపంచంలోనే ఈశాన్య ప్రాంతం రెండవ స్థానంలో ఉంది అని తెలిపారు. ఇటువంటి సమయంలో   గత నాలుగు సంవత్సరాలుగా కేంద్రం నిషేదిత పంటల సాగు పై ఉక్కు పాదం మోపుతోంది. ఇటువంటి నిషేదిత పంటల సాగు కేవలం కుకీలు, నాగాలు మాత్రమే సాగు చేయడం లేదన్నారు. ఇందులో మైతేయిలేమి సుద్దపూసలు కాదని అభివర్ణించారు.

ఇక కోర్టు ద్వారా ఏదైతే మైతేయిలకు కూడా షెడ్యూల్ కులాల జాబితా లో చేర్చే అంశాన్ని చూడాలని కోర్టు తీర్పు వెలువడిందో గొడవలకు అది ఆజ్యం పోసినన‌ట్ట‌యింద‌ని అన్నారు. దీంతో మూడు నెలలుగా అక్కడ జరుగుతున్న హింస కు తెగల మద్య కొట్లాటలే కారణం అయినప్పటికీ వీరి మద్యలో హింసాత్మక వాదులు విభజన వాదులు చేరి హింసను తీవ్ర స్థాయికి తీసుకెళ్ళారని తెలిపారు. 1995 లో నాగాలు కుకీల మద్య గొడవలు జరగడంతో దాదాపు గా 600 మంది వరకు ఇరువైపులా మరణాలు సంభవించాయి అని తెలిపారు.

మామూలు తెగల కొట్లాటలకు విపరీతార్దాలను తీసి ఈ విషయాన్ని పక్కదారి పట్టిస్తూ విభజన రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు.

ఇక్కడి సమస్యను ఒకే మాటతోనో లేక తూటా తోనో పరిష్కరించలేమన్నారు. విపత్కర సమయాల్లో ప్రభుత్వమైనా ప్రతి పక్షాలైన సంయమనంతో సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నించాలని తెలిపారు. కాని మరింత ఆజ్యం పోసేలా వ్యవహరించొద్దని హితవు పలికారు. మణిపూర్ ఘటనపై ఫ్రాన్స్ స్పందన ను తాను ఆక్షేపిస్తున్నానని అన్నారు. సెక్యులర్ దేశంగా చెప్పుకునే ఫ్రాన్స్ ఇది మత గొడవగా మాట్లాడడం మంచిది కాదన్నారు.

జాగృతి పత్రిక సంపాదకులు గోపరాజు నారాయణరావు గారు మాట్లాడుతూ మైతేయిలు, కుకీలు రిజర్వేషన్ పొందడానికి ఒకే స్థితిలో ఉన్నారని వారికి రిజర్వేషన్లు వర్తింప చేయడంలో ఎలాంటి భిన్నభిప్రాయాలు అక్కర్లేదన్నారు. సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యం మణిపూర్ సమస్యలో మాదకద్రవ్యాల వ్యాపారం కీలకపాత్ర పోషిస్తుందని తెలియజేస్తే ఈ సమస్య కుకీల‌కు ఎక్కడ ఇబ్బందిగా మారుతుందో అని అనిపించే బిల్లును పక్కన పెట్టడం జరిగింద‌న్నారు. మైతేయిల‌కు ఈ రిజర్వేషన్ వర్తింపచేయటం  కుకీల‌కు ఇష్టం లేని అంశం ప్రధాన కారణ‌మై ఉండ‌వ‌చ్చ‌న్నారు. తప్పుడు సమాచారం ఇందులో ప్రధాన పాత్ర పోషించిందని కుకీల పాత్ర ఉగ్రవాదంలో ప్రధానంగా కనిపిస్తుందని మణిపూర్ లో ఉన్న MLA లు 40 శాతం మైతీలు, 20 శాతం కుకీలు ఉన్న, ముఖ్య‌మంత్రి బిరేన్ సింగ్ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని 80వేల ఎకరాల్లో సాగుతున్న గసగసాల సాగును నియంత్రించడం, నిర్మూలించ‌డం మాఫియాకు నచ్చని వ్యవహారంగా మారిందన్నారు. హిల్ ఏరియా కమిటీ పాత్ర కూడా ఒక ప్రధాన కారణ‌మ‌ని, ఇందులో ప్రధానంగా రిజర్వేషన్లు ఉన్న కుకీలు ముఖ్యపాత్ర పోషిస్తారని ఈ కమిటీ అనుమతి పొందని నిధులు కూడా స్టేట్ బడ్జెట్లో నోచుకోదని దీనివల్ల మైతేయిలు ఎక్కువగా సమస్యలు ఆర్థిక ఇబ్బందులకు రాష్ట్ర ప్రయోజనాలకు దూరం కావడం జరిగిందని ఇది మైతేయిలో ఒక నిస్పృహకు ఆగ్రహానికి కారణమైందన్నారు.

1947కు ముందు ఎస్సీ రిజర్వేష‌న్ ఉన్న మేతేయిలకు 1947 త‌ర్వాత ఎందుకు కనుమరుగైందని ఇది కూడా ఆలోచించాల్సిన విషయ‌మ‌న్నారు. భారతదేశ ప్రభుత్వాలు చేసిన పొరపాటు కానీ 2014 తర్వాత భాజాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత సమదృష్టి తోటి ఈ విషయాన్ని పట్ల వ్యవహరించడం స్పష్టంగా కనిపిస్తుంద‌న్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 3,000 మిలిటెంట్లు ఆయుధాలు వదిలి జీవన స్ర‌వంతిలో కలిసిపోవడం మంచి పరిణామ‌మ‌న్నారు.

ప్రచారం మాధ్యమాలు కూడా మణిపూర్ సమస్యను సంక్లిష్టంగా మార్చాడం స‌మ‌స్య పెద్ద‌ద‌వ‌డానికి కార‌ణ‌మ‌వుతున్నాయ‌న్నారు. సిపిఐ నేత‌ సుభాషిని అలీ మ‌ణ‌పూర్ ఘ‌ట‌లో ఆర్ఎస్ఎస్ పాత్ర ఉంద‌ని ప్రచారం చేసిన గంటల‌ వ్యవధిలోనే  ట్విట్టర్ ద్వారా క్షమాపణలు కోరడం జరిగిందని, ఇది సిపిఐ కి దేశవ్యాప్తంగా ముఖం చెల్లని పరిస్థితి తీసుకొచ్చింద‌న్నారు.

అనంత‌రం ప‌లువురు మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు IYR గారు స‌మాధాన‌చ్చారు.

ప్ర‌శ్న : మణిపూర్ సమస్య మోడీ ప్రభుత్వం ఉక్కు పాదం మోపకపోవడం ఎలా అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్ వెళ్లి మరి సర్జికల్ స్ట్రైక్ చేయగలిగిన ప్రభుత్వం.. 70 రోజులుగా కొన‌సాగుతున్న ఈ ఉగ్ర కుట్రకు పరిష్కారం ఎందుకు చూపలేక పోతుంది? స్పెషల్ ఫోర్స్ యాక్ట్ అక్కడ ఉండడం 2000 పైగా ఎన్కౌంటర్లో అక్కడివారు హతమవడం ఆర్మీ సివిల్ స‌మ‌స్య‌ల‌ను కొంతవరకు చూపగలుగుతుందని కానీ పూర్తిగా పరిష్కరించలేదని దీనిలో ఈ విషయంలో అన్ని మతాల నుంచి దేశ సమగ్రత భావ‌న‌తో వ్యవహరించగలిగిన వారు ఈ సమస్య పరిష్కారం కోసం కమిటీలను ఏర్పాటు చేయడం వారి ద్వారా సమాజంలో ఈ పరిస్థితిని మార్పున‌కు కృషి చేసి సాధారణ పరిస్థితిలో నెలకొనే దిశగా ప్రయత్నం చేయవచ్చు. వెల్ఫేర్ స్టేట్ స్కీముల ద్వారా తెలియని ఎక్కువగా ఆకర్షిస్తూ మతం ఆధారంగా కొన్ని రాష్ట్రాలను నాశనం చేశారు. బెంగాల్ అందుకు ఉదాహరణ. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వలసలు అందుకు ప్రధాన కారణం. కుకీలు కూడా ఇలా వలస వచ్చిన వారిని మైండ్ మార్క్ వలసలు ఈ సమస్యకు కారణామా ?

జ‌వాబు : ఇలాంటి చర్యలు ఒక ఘర్షణ వాతావరణంలోకి తెరతీస్తున్నాయని ఇది మూల కారణం కూడా అవుతుందని త్వరలో ఉత్తర పాకిస్తాన్ కన్నా దక్షిణ పాకిస్థాన్ లో నెలకొన్న సమస్యల వల్ల ఎక్కువ వలసలు అటు నుంచి కూడా ఉండవచ్చేమో అని వారు చలోక్తులు విసిరారు!

ప్ర‌శ్న : ఈ సమస్య మతపరమైనది కాదని, లాయర్ సమస్యగా చూడాలని ఇందులో మోడీ ప్రభుత్వం ఆలస్యంగా స్పందించిందా లేదా ఓటు బ్యాంకు రాజకీయాలకు తలగ్గిందా ఎలక్షన్లు దగ్గరలో ఉండడం ఈ సమస్యల పట్ల స్పందనకు కారణంగా చూడవచ్చా?

జ‌వాబు : ఈ సమస్య అంతా సులువైనది కాదు. ఇందులో ప్ర‌ధాని మోడీ ఎందుకు వెంటనే స్పందించలేదని వారు మణిపూర్ కి ఎందుకు  వెళ్లలేదని ప్రశ్నించేవారు ఎక్కువయ్యారు. కానీ ఒక వేళ వారు వెళ్లి వచ్చిన తర్వాత సమస్య మరింత కఠిన తరం చేసి ప్ర‌ధాని కూడా స‌మ‌స్య‌ను పరిష్కారించ‌లేద‌ని, ప్ర‌భుత్వ‌ వైఫల్యం కింద ఆపాదించే ప్రయత్నము అంతర్గతంగా ఉండి ఉండవచ్చు. ఈ సమస్యలో కుకీలు మీదే నెపం పెట్టాల్సిన పనిలేదు. ఇది చాలా కాలంగా రగులుతున్న సమస్య దీనికి దీర్ఘకాలిక పరిష్కారం అవసరమని సీఎం ఇంతకాలం మునగడ కొనసాగించడానికి కూడా ఆ వర్గం వారు సీఎంకు సహకరించడం చూడవచ్చు అని అన్నారు

ప్ర‌శ్న : 1960 లో చేసిన చట్టాలు ఆర్మీ ప్రత్యేక చట్టాలు ఇందుకు మూలకారణమా?

జ‌వాబు : మణిపూర్ లో ఏ చట్టాలైతే  ఆదివాసీలకు వర్తిస్తాయో అవే చట్టాలు ఖమ్మం జిల్లాలోని కోయవారికి కూడా వర్తిస్తాయి. కానీ ఆ చట్ట ప్ర‌యోజ‌నాలు వారు పొందలేకపోతున్నారు. వారి భూములు ఇక్కడ చాలావరకు అన్యాక్రాంతం అయ్యాయి. కేవలం చట్టాలు ఒకటే పరిష్కారం చూప‌వ‌ని తెలియ‌జేసే ఉదాహ‌ర‌ణ. ప్రజలకున్న ప్రాంతం నుంచి మైదాన ప్రాంతాలకు వలస వెళ్లడానికి ఇష్టపడతారని ఇక్కడ కుకీలు నాగాలు పక్షం వ్యవహరించే ఇది కాదు.

ప్ర‌శ్న  : ఈ డబ్ల్యూ ఎస్ వర్తింప చేసినప్పుడు మణిపూర్ లో మైతేయిల‌కు అలాంటి రిజర్వేషన్ వర్తింపచేయడ‌మ‌నేది సమస్యకు ఎందుకు దారితీసింది. ఈ స‌మ‌స్య‌లో నార్కోటిక్స్ మాఫియా పాత్ర ఎంత.  2030 సంవత్సరాలలో నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఒక పెద్ద సమస్యగా పరిణమిస్తుందని ఒక ఎడిటర్ మాట్లాడిన వ్యాఖ్యలు వారు గుర్తు చేస్తూ ఇది ఎకోసిస్తాన్ని మొత్తాన్ని అర్థం చేసుకుని పరిష్కారం చూపడం లోపమా అని అడిగారు?

జ‌వాబు :  ఇందులో అనేక సమస్యలు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఇది వాస్తవం.

ప్ర‌శ్న : మణిపూర్ సమస్యలు మతం,  రాజకీయం ఈ రెండేటి పాత్ర ఎంత. మణిపూర్ మాద‌క ద్రవ్యాల వార్షిక ఆదాయం 650 వేల కోట్లుగా ఒక అంచనా తెలియజేస్తుంది. ఇది ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో వార్షిక బడ్జెట్ కన్నా ఎక్కువగా కనిపిస్తుంది. ఇంతటి డ్రగ్ మాఫియా శక్తిని భారత ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కోగలుగుతుంది?

జ‌వాబు : నేను ఖమ్మం జిల్లా క‌లెక్ట‌ర్‌గా పనిచేస్తున్న సందర్భంగా సిపిఐ, సిపిఎం ఇరువర్గాల తగువులు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇందులో గంజాయి, మాదకద్ర‌వ్యాలు విక్రయంలో ఇరుపక్షాలు ఉన్నాయని ఒక వర్గం వారు మరో వర్గం వారి గంజాయి సాగు వివరాలు కూలంకషంగా తెచ్చి ఇచ్చి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అర్జీ పెట్టేవారు. దాని ఆధారంగా వారి చర్యలు తీసుకోవడం జరిగింది. మణిపూర్ లో అంతర్జాతీయ శక్తుల ప్రమేయం స్పష్టంగా ఉంది. ఇందులో వారి ప్రయోజనాలు కూడా వారు ప్రథమంగా మన భూమి మీద ఆజ్యం పోయడానికి కారణం అవుతుంది. మణిపూర్ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇందులో చైనా ప్రయోజనాలు కోసం వారి ప్రయత్నాలు స్పష్టంగా ఉన్నాయి.

స్వ‌తంత్ర ఛానెల్ ఎడిట‌ర్ విశ్వనాథ్ గారి వంద‌న స‌మ‌ర్ఫ‌ణతో కార్య‌క్ర‌మం ముగిసింది. ఈ కార్యక్రమంలో ఆర్‌.ఎస్‌.ఎస్ తెలంగాణ సహ ప్రాంతప్రచార ప్ర‌ముఖ్‌ కట్టా రాజగోపాల్,  తదితరులు పాల్గొన్నారు.