Home Telugu Articles మత విభజనే కమ్యూనిస్టుల అభిమతం!

మత విభజనే కమ్యూనిస్టుల అభిమతం!

0
SHARE

గత నెల 21న ‘ప్రపంచ యోగ దినోత్సవం’ అట్టహాసంగా జరిగింది. సాక్షాత్తూ మన ప్రధాని నరేంద్ర మోదీ అమితోత్సాహంతో ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. అనేక ముస్లిం దేశాలు సహా విశ్వవ్యాప్తంగా ఎంతోమంది యోగ దినం ప్రాముఖ్యతను గుర్తించారు. కానీ- మన కమ్యూనిస్టు సోదరులకు అది కేవలం ‘హిందూ మత’ కార్యక్రమంగా కనపడింది. సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ కేంద్రంపై విరుచుకుపడుతూ- యోగకు మతాన్ని అంటగట్టేందుకు బిజెపి కుట్ర చేస్తున్నదని, యోగ చేయడం చాలా మంచిదనీ, అయితే బిజెపి వర్గాలు దాన్ని హిందుత్వానికి సంబంధింనదిగా చూపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. ఇలా ‘మతం’ కోణంలో మాట్లాడితే మనం ఏమంటాం?

విచిత్రమేమిటంటే ఏ ముస్లిం దేశమూ ఇలాంటి విమర్శ చేయలేదు. ఒక ఆంగ్ల దినపత్రిక ఇచ్చిన సమాచారం ప్రకారం, ముస్లిం మెజారిటీ దేశాలైన ఈజిప్టు వగైరాలు యోగ దినోత్సవంలో పాల్గొన్నాయి. ఈజిప్టులో అనేకమంది శిక్షకులతో పాటు బరాన్ సౌధం ముందు సమావేశమై యోగా చేసారట. అంతేకాదు స్విట్జర్లాండ్‌లోని ఆల్ప్స్ పర్వతాలపై కూడా యోగ చేసారట. బిజెపి ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ పాల్గొన్న ఈ కార్యక్రమానికి వేదికగా 13,371 అడుగల ఎత్తున 3000 చదరపు అడుగుల స్థలాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేశారు. ప్రతి పది నిముషాలకు ఒక బృందం చొప్పున కొన్ని గంటలపాటు సూర్యనమస్కారాలు చేసారు. ఈ వార్తను ప్రముఖ పత్రికలు ఫొటోలతో పాటు ప్రచురించాయి.

సరే… మన కేరళ కమ్యూనిస్టు ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ‘సెక్యులర్ మైండ్‌సెట్’తో యోగ చేయాలన్నారు. ఆ ‘మైండ్‌సెట్’ ఏమిటో వారికే తెలియాలి. కర్నాటకలోని ఉడుపి మఠం చరిత్రలోనే మొదటి సారిగా ముస్లింలను ఆదరించింది. ఎనిమిది దశాబ్దాల చరిత్ర కలిగిన ఆ మఠంలో, పెజాతర్ మఠాధిపతి విశే్వశ్వర తీర్థ వినూత్న పద్ధతిలో బ్రహ్మ సత్రంలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఇది మొదటిసారి జరిగింది. స్వామీజీయే స్వయంగా పర్యవేక్షించి ముస్లిం సోదరులకు తానే ఖర్జూరాలు అందచేసి వారితో ముచ్చటించారు. ఈ వార్తను కూడా అనేక పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. మరి దీనిని ఏమంటాం? ఇలాంటి ఉదంతాల గురించి వింటే మనకు సహజంగానే ప్రశ్నలొస్తాయి గదా! మనకు దేశంలో విశేషంగా వినపడే పదం ‘ప్రస్థాన త్రయం’..అంటే బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత. ఒక్క విషయం మట్టుకు నిజం. ఇవి వ్రాయబడే నాటికి లేదా చెప్పబడేనాటికి- ప్రపంచంలో ఇస్లాం లేదు, క్రైస్తవం లేదు

‘జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’..

మొదటిది త్రేతాయుగం నాటి శ్రీరాముల వారు చెప్పింది. లంకను జయించిన తరువాత, లక్ష్మణుడంటాడు ఇప్పుడు తిరిగి అయోధ్యకెందుకు? ఈ స్వర్ణమయమైన లంకను పాలించుకుంటే సరిపోదా అని. దానికి శ్రీరాములవారి సమాధానం-

అపీ స్వర్ణమరుూ లంకా, నమేలక్షణాయతే

జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ

ఎంత బంగారపు లంకైనా మనకనవసరం, తల్లి, మాతృభూమి స్వర్గం అని.

రెండవది ద్వాపర యుగంనాటి కృష్ణ్భగవానుని కాలం నాటిది. జూదంలో ఓడిపోయి పాండవులు అరణ్య వాసంలో ఉన్నారు. దుర్యోధనుడు గంధ్వర్వుల మీదకి ఏదో కారణంతో యుద్ధానికి వెడతాడు. వారు దుర్యోధనుని ఓడించి నిర్బంధించారు. దానితో దుర్యోధనుని పరివారం దిక్కు తోచక, అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజు శరణుజొచ్చారు. అది చూసిన భీమసేనుడు- ‘మంచి శాస్తి జరిగింది.. కాగల కార్యం గంధర్వులే తీర్చారు’ అంటాడు. కానీ దానిని పెద్దమనసుతో ధర్మరాజు ఖండిస్తాడు. అప్పుడు చెబుతాడు- భీమసేనా.. మనలో మనం భేదించినప్పుడు, వారు 100 మంది.. మనం అయిదుగురమే కానీ ఇతరులు మనమీదకి వచ్చినపుడు మనం 100+5-105 సుమా’ అని గంధర్వుల నుంచి దుర్యోధనునికి విముక్తి కలిగించమని ఆదేశిస్తాడు. ఈ రెండు సూక్తులు ఈ జాతికి, ఈ దేశానికి యుగాల తరబడి ఆదర్శాలుగా నిలిచాయి సుమా!

ఇప్పుడు ఏమనాలి? ఇక తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధోరణి మరీ విచిత్రం. జడ్చర్ల పట్టణంలోని సమావేశంలో మతతత్వ పార్టీ బిజెపి నిలబెట్టిన రాష్టప్రతి అభ్యర్థిని కెసిఆర్ బలపరచడం విడ్డూరమన్నారు. ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చేందుకు మతతత్వ పార్టీ కుట్రలు చేస్తుందన్నారు. ఏమందాం? కొన్ని ప్రశ్నలు.. నేడు ప్రపంచంలో ఎన్ని క్రైస్తవ దేశాలు, ఎన్ని ముస్లింల దేశాలు? ప్రపంచంలో మీరు అవునన్నా కాదన్నా క్రీ.పూ వేల సంవత్సరాల బట్టి ఉన్న ఈ హిందువులకు ఒక్క దేశమన్నా ఉండకూడదా? అది ఈ హిందూ దేశం కాక వేరేదైనా ఉంటుందా?

పైన చెప్పిన వారంతా-ఎప్పుడో వేల సంవత్సరాల తరువాత రాబోయే క్రైస్తవులను, మహమ్మదీయులను, అప్పుడే నాశనం చేయాలనే ఉద్దేశంతో తమరచనలు సాగించారా? ఏమనాలి? చివరగా- ఒక్క సందేహం.. కాంగ్రెస్, తన రాష్టప్రతి అభ్యర్థిగా మీరా కుమార్‌ను ముందే ఎందుకు ప్రకటించలేదు? బిజెపి తన అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్‌ను ప్రకటించిన తరువాతనే కాంగ్రెస్ వారికి మీరాకుమార్ గుర్తుకొచ్చిందా?

ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీ ఫ్రపంచంలోని ఎన్ని క్రైస్తవ, ముస్లిం దేశాలలో ఉంది? రష్యా, చైనాలలో నేడున్నది కమ్యూనిజమే అనుకుంటే, మిగతా ఎక్కడా దాదాపుగా కనపడడం లేదే. హిందువులు ఇంకా మెజారిటీగా ఉన్నది హిందూదేశంలోనే ఉంది సుమా! నేటి పాకిస్తాన్‌లో హిందువులు అంతగా లేనే లేరు. కమ్యూనిజం పుట్టి 100 సంవత్సరాలు, భారతదేశంలో నక్సలిజం పుట్టి 50 సంవత్సరాలు అయిన సందర్భంలో ఒక దినపత్రికలో వరసగా కొంతమంది రచయితలు, ఆ నక్సలైట్లకు పుంఖానుపుంఖాలుగా సలహాలిచ్చారు. ఏమందాం? మార్క్స్ ద్వితీయ శతజయంతి సందర్భంగా ఆచార్య హరగోపాల్, మార్క్స్ రాసిన ‘కాపిటల్ గ్రంథం’ అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇప్పుడు ముస్లిం దేశాలలో జరిగే హింసాత్మక ఘటనలు, ప్రాణనష్టం.. వీటన్నింటికీ ముస్లిం తీవ్రవాదులే కారకులు. ఇక మన కమ్యూనిస్టులు, ప్రపంచ ముస్లిం దేశాల పర్యటనను ప్రారంభించాలి. వాస్తావాలను ప్రచారం చేయాలి కదా!

– చాణక్య 94925 28970

(ఆంధ్రభూమి సౌజన్యం తో)

For latest updates download Samachara Bharati app http://www.swalp.in/SBApp