- 25ఏండ్లలో చేసిన దానికంటే లాక్‌డౌన్‌లో చేసింది ఎక్కువే..
- అన్‌ఫోల్డిండ్ మిషనరీ సీఈవో డేవిడ్ వెల్లడి
కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్ వల్ల సామాన్యులు, పేద ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఒక వైపు వైరస్, మరో వైపు ఉపాధి లేక అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే ఇదే అదునుగా భావించిన కొన్ని క్రైస్తవ మిషనరీలు కరోనా కట్టడికి ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్‌ను ఉపయోగించుకుని మతమార్పిళ్లకు ఎగబడ్డాయి. ఏకంగా లక్షమందికి పైగా మతం మార్చినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇది గత 25 సంవత్సరాలలో చేసిన దానికంటే ఎక్కువే అని మినషరీల ప్రతినిధులు వెల్లడిస్తున్నారు.
అన్‌ఫోల్డింగ్ వర్డ్ అనే క్రైస్తవ సంస్థ సీఈవో డేవిడ్ రీవ్స్ మిషనరీ నెట్‌వర్క్ న్యూస్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. అన్‌ఫోల్డింగ్ వర్డ్ అనే క్రైస్తవ సంస్థ మత బోధనలు చేయడానికి ఏర్పడిన ఒక సంస్థ. బైబిల్‌ను అన్ని వర్గాల ప్రజలకు అర్థమయ్యేలా బోధించి, అక్కడ చర్చిలు నిర్మించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం.
లాక్డౌన్ సమయంలో బయటకు వెళ్లలేని కారణంగా ఒక ప్రత్యేకమైన చోట ప్రార్థనలు ప్రారంభించి, ఆ ప్రార్థనలను లాక్‌డౌన్ వల్ల ఆర్థికంగా, ఆరోగ్యంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఫోన్, వాట్సాప్ ద్వారా పంపి ప్రార్థనలను అనుసరించేలా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విధంగా లాక్డౌన్ సమయంలో సుమారు లక్ష మందికిపైగా మత మార్చినట్టు వారు అంచనా వేశారు. అదేవిధంగా కొన్నిగ్రామాల్లో చర్చిలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఆ పరిసర గ్రామాల ప్రజల కోసం ప్రార్థనలు చేయడానికి వారిని ప్రోత్సహించారు. లాక్‌డౌన్ ఆంక్షలు కొద్దిగా సడలించడంతో క్రైస్తవ మిషనరీలు ఈ ప్రాంతాలలోకి ప్రవేశించగలిగాయి. ఈ లాక్డౌన్ సమయంలో సుమారు 50వేల గ్రామాల్లో చర్చి నిర్మాణానికి ప్రయత్నాలు చేసినట్టు వారు అంచనా వేశారు.
25 సంవత్సరాలల్లో మిషనరీ నిర్మించిన చర్చిల కంటే ఈ కరోనా లాక్‌డౌన్ సమయంలో నిర్మించిన చర్చిల సంఖ్య ఎక్కువగా ఉందని రీవ్స్ చెప్పారు. మత మార్పిడి వ్యాపారంలో క్రైస్తవ మిషరీలకు ఈ కరోనా లాక్‌డౌన్ ఈ రకంగా ఉపయోగపడింది.
– డేవిడ్ రీవ్స్ బైబిల్ అనువాదానికి బాధ్యత వహించే JAARS (జంగిల్ ఏవియేషన్ అండ్ రేడియో సర్వీస్) అనే సంస్థకు అధ్యక్షుడు. క్రైస్తవ మత ప్రచారం, నూతన చర్చిల విస్తరణకు అనేక భాషలలో బైబిల్ అనువాదం అవసరమనే ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేసి మత మార్పిళ్లకు పాల్పడుతున్నాడు. ఈ సంస్థ బైబిల్ శిక్షణ కోసం వనరులను కూడా అందిస్తుంది.
OM (ఆపరేషన్ మొబిలైజేషన్) అనే ఒక మిషనరీ సంస్థ తక్కువ జనాభా ఉన్న ప్రదేశాలను ఎంచుకుని అక్కడ కొత్తగా చర్చిలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. జాతీయ స్థాయిలో ఉన్న క్రైస్తవ మిషనరీలు వీరికి సహకారం అందిస్తాయి. క్రైస్తవ మత పుస్తకాలు పంపిణీ చేయడం, బహిరంగ సమావేశాలు ఏర్పాటు చేసి తద్వారా నేరుగా క్రైస్తవ మత మార్పిడి చేయడం వీరి ప్రధాన పని.
రీచ్ ఆల్ నేషనల్(RAN) గ్రూప్ అనే మిషనరీ సంస్థ ప్రకారం, “ భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కొంత మంది వ్యక్తులకు క్రైస్తవ మత ప్రచారం గురించి, మతమార్పిళ్ల గురించి నూతనంగా చర్చిలు ఏర్పాటు చేయడానికి తీసుకోవాల్సిన అంశాలపై శిక్షణను అందిస్తోంది. శిక్షణ పొందిన వారు తమ తమ ప్రాంతాలకు వెళ్లి స్థానిక చర్చి అధికారుల సహకారంతో, కొత్త చర్చిలు ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలు పెడతారు. ఈ సమయంలో వారికి RAN తరుఫున ఆర్థిక సాయంతో పాటు, చర్చి నిర్మించడానికి కావల్సిన ఏర్పాట్లను అందిస్తారు. నెలలో ఒక సారి పెద్ద ఎత్తున ఒక సభ ఏర్పాటు ప్రార్థనలు చేస్తూ మత ప్రచారం చేస్తారు. చర్చి నిర్మించే వరకు ఇలా ప్రతీ నెల ఒక సభను నిర్వహిస్తారు.
భారతదేశంలో కొత్తగా చర్చిలు నిర్మించడానికి 110 కి పైగా ఎవాంజెలికల్ సంస్థలు ఉన్నాయి. ప్రతి సంస్థకు మతమార్పిళ్లకు, చర్చిలు నిర్మించడానికి వారికి నిర్థిష్టమైన లక్ష్యాలు కూడా ఉన్నాయి.
జాషువా ప్రాజెక్ట్ అనే ఒక సంస్థ భారతదేశంలోని ఉన్న అన్ని వర్గాల ప్రజల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని లక్ష్యంగా చేసుకుని సాయం పేరుతో వారిని మతం మార్చడానికి దారులు వెతుకుతూనే ఉన్నాయి. ఇలా దేశ వ్యాప్తంగా చాలా క్రైస్తవ మిషనరీ సంస్థలు మత మార్పిడి వ్యాపారాలను కొనసాగిస్తూనే ఉన్నాయి. క్రైస్తవ మత ప్రచారానికి కరోనా లాక్‌డౌన్ ను వారు మరింత ఉపయోగించుకున్నారు.
Source : OPINDIA