
వ్యవస్థను మార్చడానికి ముందుగా మనసు మారాలి. భేద భావం మనసులో ఉంటుంది. మనసు నుంచి వాక్కు ద్వారా, చేసే పని ద్వారా అది బైటపడుతుంది. ఆలోచనల్లో బైటపడుతుంది. వ్యవస్థలో బైటపడుతుంది. అందుకనే వ్యవస్థతో పాటుగా మనసును మార్చడానికి కృషి చేయాలి. సంఘ్‌కు చెందిన స్వయం సేవకులు అన్నిరకాలుగా కృషి చేస్తున్నారు. సామాజిక సమరసతా మంచ్ ద్వారా, ఈ గతివిధి ద్వారా స్వయంసేవకులు ఈ పని చేస్తున్నారు. వ్యవస్థాగత మార్పు కోసం దేవాలయం, నీటి వనరు, శ్మశానం అందరికీ ఒకటే ఉండే విధంగా చూసేందుకు అనేక సంవత్సరాలుగా స్వయంసేవకులు ప్రయత్నిస్తున్నారు. కొద్దికొద్దిగా ముందుకు వెళుతున్నారు. అన్ని ప్రాంతాల్లో ఈ ప్రయత్నం జరుగుతోంది.