ఒక వైపు హిందువులపై దాడులు చేస్తూనే.. మరో వైపు హిందువులపై విషం చిమ్ముతున్నాయి ముస్లిం వర్గాలు. ఇటీవల ఇగ్లాండ్‌లో కొంత మంది హిందువులు జై శ్రీరాం అంటూ నినాదాలు చేస్తూ శాంతియుతంగా ర్యాలీ చేసినందుకు, హిందువులను మతోన్మాదులుగా చిత్రిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనలు చేపడుతున్నారు. ఈ మేరకు హిందువులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ముస్లిం కౌన్సిల్ ఆఫ్ బ్రిటన్ (MCB) ఒక ప్రకటన విడుదల చేసింది. స్కాటిష్ కు చెందిన పాకిస్తాన్ జాతీయుడు, కౌన్సిల్ సెక్రటరీ జనరల్ జరా మొహమ్మద్ సంతకం చేసిన ఈ లేఖలో జై శ్రీరాం నినాదం చేయడాన్ని తప్పుబడుతూ వారిపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
హిందువులు, వారి ఇళ్లు, వ్యాపారాలపై పదే పదే దాడులు జరుగుతున్నాయనే వాస్తవాన్ని పూర్తిగా విస్మరిస్తూనే, స్థానిక ప్రాంతంలో హింసాత్మక మితవాద హిందుత్వ ప్రభావం పెరుగుతుందని అసత్య ప్రచారాలు చేస్తూ ముస్లిం కౌన్సిల్ ఆఫ్ బ్రిటన్ (MCB) ఆందోళన వ్యక్తం చేస్తోంది.
సెప్టెంబర్ 17, శనివారం రోజున కొంతమంది హిందువులు గ్రీన్ లేన్ రోడ్డు ప్రాంతంలో జై శ్రీరాం అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. ఈ ర్యాలీ ఒక మసీదును దాటుతూ వెళ్లింది. అయితే మసీదుల బయట ర్యాలీలు చేయడం ద్వారా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని వారిని రెచ్చగొట్టడం, గృహాలు, వ్యాపారాలను విధ్వంసం చేయడం వంటి అనేక రెచ్చగొట్టే చర్యలకు హిందువులు పాల్పడుతున్నారని ముస్లిం కౌన్సిల్ ఆఫ్ బ్రిటన్ (MCB) ఆరోపిస్తూ ప్రపంచ వ్యాప్తంగా హిందువులను భయకరంగా చూపించాలని కుట్రలు చేస్తోంది. ముస్లింలపైనే కాకుండా సిక్కులపై కూడా దాడి చేస్తున్నారని సిక్కులను కూడా రెచ్చగొట్టే విధంగా అసత్య ప్రచారాలకు పాల్పడుతోంది.
హిందువులు ఆరాధ్యంగా కొలిచే శ్రీరామ నామాన్ని “జై శ్రీరాం” అని శాంతియుతంగా నినాదాలు చేయడం… ముస్లింలను రెచ్చగొట్టడం గా భావించిన కౌన్సిల్ ఆఫ్ బ్రిటన్ (MCB) హిందువులపై చర్యలు తీసుకోవాలని కోరుతుంది. హిందువులు చేసిన ర్యాలీ మసీదును దాటి వెళ్లడమే ఇందుకు ప్రధాన కారణం.. కానీ ముస్లిం సమాజం అల్లాహు అక్బర్ అంటూ తీవ్రవాద దాడుల సమయంలో తరచుగా ఉపయోగించడం సర్వ సాధారణమవడం గమనార్హం.
హిందువులుగా నమ్మించి… హిందుత్వం పేరుతో హిందువులపై దాడులకు కుట్ర
ఇటీవలి కాలంలో కొంత మంది హిందూ వ్యతిరేకులు వారు తమని తాము హిందువుల నమ్మించి హిందుత్వాన్ని ఉపయోగించి హిందువులపై దాడికి పాల్పడుతున్న ఘటనలు ఎక్కువయ్యాయి. హిందువులను, హిందుత్వాన్ని ప్రపంచ వ్యాప్తంగా భయకరంగానే చూపించాలనే లక్ష్యంతో అనేక కుట్రలకు పాల్పడుతున్నారు. భారతదేశంలోనే కాకుండా అనేక దేశాలలో హిందూ ఫోబిక్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో లీసెస్టర్ సంఘటన అత్యుత్తమ ఉదాహరణ.
లీసెస్టర్‌లో హిందువులపై లక్ష్యంగా దాడులు, తప్పుడు ప్రచారాలు
ఇంగ్లండ్‌లోని ఈస్ట్ మిడ్‌లాండ్స్ ప్రాంతంలోని లీసెస్టర్ సిటీలో హిందూ సమాజంపై దాడులు బాగా పెరిగాయి. ఆగస్టు 28న జరిగిన ఆసియా కప్‌లో గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించిన వెంటనే ఇస్లామిస్టుల హింసాకాండ మొదలైంది. భారత పతాకాన్ని అవహేళన చేస్తున్న ఒక ఒక సిక్కు వ్యక్తి ని ముస్లింగా భావించడంతో భారత అభిమానులు, పాకిస్తానీ మద్దతుదారుల మధ్య ఒక సాధారణ పరిహాసం తీవ్ర రూపం దాల్చింది. కానీ చివరికి హిందీలో మతపరమైన దూషణలు చేశారని ఇస్లాంవాదులు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారు.
ఆసియా కప్‌లో సూపర్ 4 దశలో భారత్, పాకిస్థాన్ మరోసారి తలపడ్డాయి. పాకిస్తాన్ విజయం సాధించిన తర్వాత, దాని మద్దతుదారులు గణేష్ చతుర్థిని జరుపుకుంటున్న హిందూ ఇంటిపై దాడి చేశారు. నిందితులకు సోషల్ మీడియాలో వారి సహచరుల నుండి మద్దతు లభించింది. ఆ తర్వాత హిందూ చిహ్నలతో ఉన్న హిందువుల ఇళ్లు, కార్లు, ఆస్తులపై దాడులు కూడా ప్రారంభమయ్యాయి.
ఇటీవల, లీసెస్టర్‌లోని ఒక హిందూ దేవాలయంపై ఇస్లామిస్టుల దాడి జరిగింది. దానికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అయింది. ఒక తీవ్రవాది ఆలయ నిర్మాణానికి అతికించిన కాషాయ జెండాను నిర్మూలించడం అందులో కనిపిస్తుంది.
హిందువులపై లక్ష్యంగా చేసుకున్న దాడులను పక్క దారి పట్టించేందుకు ఇస్లాంవాదులు విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. రీసెర్చ్ స్కాలర్ సారా ఎల్ గేట్స్ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ “ఇది ఒక ప్రణాళికాబద్ధమైన మత ప్రక్షాళన చర్య. వారు హిందువులను ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు. అని తెలిపారు.
Source : OPINDIA