- ఇండ్లకు నిప్పంటించిన దుండగులు
- మూడేండ్ల చిన్నారి అపహరణ… జిల్లా ఎస్పీని నివేదిక కోరిన ఎన్.సి.పి.సి.ఆర్
- నేరస్తులను కఠినంగా శిక్షించాలి : వి.హెచ్.పి డిమాండ్
బీహార్‌లోని పుర్నియా జిల్లా మార్జ్వా గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారి ఇండ్లపై కొంత మంది ముస్లింలు విచక్షణ రహితంగా దాడులకు పాల్పడి విధ్వంసాన్ని సృష్టించారు. ముస్లింల గుంపు ఎస్సీల ఇండ్లపై పెట్రోల్ పోసి తగల పెట్టడమే కాకుండా మేవాలాల్ అనే వృద్ధుడి పై మూక దాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో మూడు సంవత్సరాల శిశువు కూడా అపహరణకు గురయ్యాడు.
మే 19న బీహార్‌లోని పుర్నియా జిల్లా బైసి పోలీస్ స్టేషన్ పరిధిలో 60 కుటుంబాలు నివసించే మార్జ్వా గ్రామంపై 200 మంది ముస్లింల గుంపు అల్లాహు అక్బర్ అంటూ నినాదాలు చేస్తూ రకరకాల మారణాయుధాలతో గ్రామాన్ని చుట్టుముట్టి పదుల సంఖ్యలో ఎస్సీల ఇండ్లకు నిప్పింటించి బూడిద చేశారు.ముస్లింలు చేస్తున్న ఆగడాలను అడ్డుకున్న ఎస్సీలపై ఆ ముస్లిం గుంపు తమ దగ్గర ఉన్న పదునైన ఆయుధాలతో అతి కిరాతకంగా దాడి చేశారు. ఈ దాడిలో మేవాలాల్(70) అనే విశ్రాంత వాచ్ మెన్ మృతి చెందాడు. అంతటితో ఆగని ఆ ముస్లిం గుంపు లక్ష్మీదేవి అనే గర్భవతి తలపై విచాక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
మూడు సంవత్సరాల శిశువు అదృశ్యం
స్థానికుల కథనం ప్రకారం ఈ దాడి జరిగిన తర్వాత స్థానికంగా ఉండే ప్రతాప్ రాయ్ అనే వ్యక్తి మూడేండ్ల కొడుకు దివానా రాయ్ కనిపించడం లేదని, ఆ విధ్వంసక గుంపు ఆ బాబు ని కూడా చంపి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు.ఇతంటి భయంకర బీభత్సం సృష్టించబడిన ఈ గ్రామం బైసి నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ప్రస్తుత బైసి ఎమ్మెల్యే ఆల్ ఇండియా-మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏ.ఐ.ఎం.ఐ.ఎం) పార్టీకి చెందిన వాడు. గత సంవత్సరం జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీమాంచల్ ప్రాంతం నుంచి నుండి ఎం.ఐ.ఎం ఐదు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది.
ఆ విధ్వంసక సంఘటనకు ఆ గ్రామంలో నివసిస్తున్న ఎస్సీలకు, ముస్లింలకు మధ్య స్థల వివాదాలే కారణం అని తెలుస్తుంది. గత కొన్ని నెలలుగా ముస్లింలు ఎస్సీలను తమ ఇళ్లను, స్థలాలను, ఆస్తులను వదులుకొని ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారు. వారి ఆస్తులు తమవిగా ముస్లింలు ప్రకటించుకుంటున్నారు. కానీ తమ ఇంటి స్థలం పిడబ్ల్యుడి అనే ప్రభుత్వ శాఖకు సంబంధించిందని ఎస్సీలు చెబుతున్నారు.
నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని : విశ్వహిందూ పరిషత్ డిమాండ్
ఎస్సీలపై జరిగిన దాడిని విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది. దాడులు జరిగిన వెంటనే వి.హెచ్.పి నాయకులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితులను పరిశీలించారు. స్థానిక పోలీసులు అడ్మినిస్ట్రేషన్ సరైన విధంగా స్పందించలేదని ఆరోపించారు. ఎస్సీల పట్ల ముస్లింల దాడులు ఇటీవల కాలంలో తరచుగా జరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వి.హెచ్.పి జాతీయ ప్రధాన కార్యదర్శి మిలింద్ పారాండె స్పదింస్తూ స్థానిక ప్రభుత్వ అధికారులు, పోలీసుల అండదండలతో ఇస్లామిక్ జిహాదీలు బీహార్‌లో పూర్ణియా జిల్లాలోని ఎస్సీలపై తరుచూ దాడులకు పాల్పడుతూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడుతున్న వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే బాధిత ఎస్సీ కుంటుంబాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
“మీమ్ – భీమ్” వట్టి నినాదం గానే మిగిలిపోయిందనడానికి ఈ సంఘటనలతో స్పష్టమవుతోందని ఆయన పేర్కొన్నారు. కేవలం స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికే ఈ నినాదాలను ఉపయోగిస్తున్నారని వీటివల్ల శక్తివంతమైన హిందూ మహాదళిత సమూహం ముస్లింల దాడులకు గురవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
బాధిత ఎస్సీ కుటుంబాలకు వెంటనే రక్షణ కల్పించి, నష్ట పరిహారం చెల్లించి పునరావాసం కోసం సరైన చర్యలు తీసుకోవాలని అలాగే దాడి చేసిన విద్రోహ శక్తులను కఠినంగా శిక్షించాలని వి.హెచ్.పి డిమాండ్ చేసింది.
పుర్నియా జిల్లా వి.హెచ్.పి ప్రచార ప్రముఖ్ వివేక లాత్ ఆర్గనైజర్ పత్రికతో మాట్లాడుతూ ఉన్మాద ముస్లిం గుంపు గ్రామాన్ని అన్ని వైపుల నుండి చుట్టుముట్టి ఇళ్లను కాలుస్తూ ఎస్సీలపై దాడి చేశారని, చిన్న, పెద్ద, ఆడ, మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిపై దాడి చేశారని తెలిపారు. గర్భవతి అయిన లక్ష్మీదేవి పై కూడా దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయాలయ్యాయని, ఎస్సీలు నిత్యం పూజలు చేసే దేవాలయాన్నికూడా ధ్వంసం చేశారని పేర్కొన్నారు.
ఘటన జరిగిన రెండున్నర గంటల తర్వాత పోలీసులు సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకున్నారని, అలాగే అగ్నిమాపక దళాలు మూడు గంటల తర్వాత గానీ చేరుకోలేదని, అప్పటికే నిప్పంటించిన ఇళ్లన్నీ బూడిదగా మారాయని ఆయన పేర్కొన్నారు.
మేవాలాల్ రాయ్, ముస్లింలకి మధ్య జరిగిన స్థల వివాదమే ఈ విధ్వంసానికి కారణమని వివేక్ చెప్పారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఘటనా స్థలానికి వచ్చిన ఇద్దరు పోలీసులపై కూడా ముస్లిం గుంపు దాడికి పాల్పిడింది. విధి నిర్వహణలో ఉన్న భారత్ రాయ్, దినేష్ రాయ్ అనే ఇద్దరు పోలీసులపై రాళ్లు రువ్వుతూ, వారికి సంబంధించిన మోటార్ సైకిళ్లకు నిప్పంటించారు. ఇద్దరిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు, మరోకరు అక్కడినుంచి తప్పించుకోగలిగారు.
“మధ్యాహ్నం ఇరువర్గాల మధ్యలో చిన్న గొడవ మొదలైంది. ఆ తర్వాత స్థానిక ప్రభుత్వ అధికారులు ఆ విషయంలో మధ్యవర్తిత్వం వహించి శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేశారు. కానీ రాత్రి 200 మంది ముస్లింలు స్థానిక చుట్టుపక్కల గ్రామాల నుండి అక్కడికి చేరుకున్నారు. వాళ్లు తమతో పెద్ద మొత్తంలో పెట్రోలు తీసుకొని వచ్చి ఎస్సీల ఇళ్లపై చల్లి నిప్పంటించారు. ఇళ్లలో ఉన్న ప్రజలు ఒక్క సారిగా బయటకి వచ్చి పరుగులు తీశారు. ఏమి జరుగుతుందో తెలియక అటు ఇటు పరుగెత్తుతున్న ఎస్సీలపై ముస్లింలు తమ వెంట తెచ్చుకున్న పొడుగాటి కత్తులు, కర్రలు, మోటార్ సైకిల్ చైన్లతో దాడి చేసారు. ఈ దాడిలో అనేక మంది గాయాల పాలయ్యారు. అందులో 25 మందికి తీవ్రంగా గాయపడ్డారు. ” అని పోలీసు భారత్ రాయ్ తెలిపారు.
ఆ సంఘటన జరిగిన తర్వాత బైసి పోలీస్ స్టేషన్‌లో ఇప్పటివరకు గుర్తించబడిన ఏడుగురితో పాటు మరో 100 మంది ముస్లింలపై 3 ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేశారు. తీవ్ర విమర్శలకు గురైన పోలీసులు ఇప్పటి వరకు మహమ్మద్ సకీర్, మహమ్మద్ ఇబ్రహీం అనే ఇద్దరిని మాత్రమే అరెస్టు చేయగలిగారు.
నేరస్తులకు రూ.50 లక్షల ఆర్థిక సహాయం
బైసి లోని మొబయా అనే గ్రామంలోని ఆ గుర్తించబడిన ముస్లిం నేరస్తులు దాక్కుని ఉన్నారని గ్రామస్తులు అంటున్నారు. ముస్లిం మైనా ఆ గ్రామ సర్పంచ్ అతని సోదరుడు జకీర్ కలిసి నేరస్తులకు తమ ఇంట్లో ఆశ్రయం కలిగించారని తెలుస్తోంది.
ఇలాంటి దాడులు చేయడానికి వారికి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందుతోందని, దాడులు ప్రారంభమైనప్పటి నుండి ఆ నేరస్తులకు రూ.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.ముస్లిం మూకకు ఏ.ఐ.ఎం.ఐ.ఎం ఎమ్మెల్యే సయ్యద్ రుక్నుద్దీన్ అహ్మద్ సాయం
ఎస్సీలపై ఇలాంటి దాడులకు పాల్పడడానికి ఏ.ఐ.ఎం.ఐ.ఎం ఎమ్మెల్యే సయ్యద్ రుక్నుద్దీన్ అహ్మద్ ముస్లింలకు పూర్తి సహకారం అందిస్తున్నారని, ఎమ్మెల్యే బెదిరింపులతోనే స్థానిక అధికారులు పోలీసులు ఎలాంటి కఠిన చర్యలు నేరస్తులకు వ్యతిరేకంగా తీసుకోలేకపోతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎస్సీలపై దాడులు జరగటం ఇదేమీ మొదటిది కాదని, ఇలాంటి సంఘటనే ఏప్రిల్ 24న జరిగిందని స్థానిక వి.హెచ్.పి నాయకులు చెబుతున్నారు. అప్పుడు కూడా ఒక ముస్లిం గుంపు అదే గ్రామానికి సంబంధించిన ఎస్సీ కుటుంబాల మీద దాడి చేసింది. రెండు ఇండ్లకు నిప్పంటించారు. అప్పుడు ఒక ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్ లో నమోదు అయింది. కానీ ఎమ్మెల్యే సయ్యద్ రుక్నుద్దీన్ అహ్మద్ సహకారంతో నిందితులు చట్టం నుండి తప్పించుకోగలిగారు. నిజానికి అహ్మద్ సహకారంతో కేసును పక్కదారి పట్టించి ఎస్సీలు కావాలనే ముస్లింలపై కేసు పెట్టారని తప్పుడు ఆధారాలతో కేసును కొట్టేశారు.
పుర్నియా జిల్లా ఎస్పీకి జాతీయ బాలల హక్కుల కమిషన్ నోటీసులు:
సంఘటన జరిగినప్పటి నుండి మూడు సంవత్సరాల బాబు దివానా రాయ్ కనిపించకపోవడంపై జాతీయ బాలల హక్కుల సంరక్షణ కమిషన్ స్పందించింది. ఈ విషయంపై పుర్నియా జిల్లా సూపరింటెండెంట్ కు నోటీసులు జారీ చేసింది. మే 19న జరిగిన సంఘటన సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన రిపోర్టును 48 గంటల్లో జిల్లా శిశు సంక్షేమ అధికారి రిపోర్టు ను అందజేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు ఎన్.సి.పి.సి.ఆర్ కమిషన్ చైర్మన్ ప్రియాంక కనూంగో ఆర్గనైజర్ పత్రికతో మాట్లాడుతూ చెప్పారు. జిల్లా శిశు సంక్షేమ అధికారి జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 ప్రకారం హింసకి గురైన పిల్లల నుంచి వివరాలు సేకరించాలని కోరింది.
ఎస్సీలపై తరచుగా జరుగుతున్న ముస్లింల దాడులు…
2015లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. ఆ సమయంలో పోలీసు బృందం అక్కడ ఉన్నప్పటికిని ముస్లింలు దాడులను ఆపే ప్రయత్నం చేయలేదు.
గతేడాది ఏప్రిల్ 18న బీహార్‌లోని వార్సలిగంజ్ లో కూడా ముస్లింల చేత ఎస్సీలు దాడికి గురయ్యారు. ఈ ఘటనలో ముర్షిద్ ఖాన్, టిపు ఖాన్, సొనా ఖాన్, నదీం కురేషి, గోలు ఖాన్, ఆరిఫ్ ఖాన్, అజార్ ఖాన్ లను పోలీసులు అరెస్టు చేశారు.
Source : ORGANISER