Home News దళితుల వివాహ వేడుకపై ముస్లిం వర్గీయుల దాడి; ఒకరి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం

దళితుల వివాహ వేడుకపై ముస్లిం వర్గీయుల దాడి; ఒకరి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం

0
SHARE

మధ్యప్రదేశ్: దేవాస్ జిల్లా పిపాలార్వ గ్రామంలో ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతంలో జరుగుతున్న దళితుల వివాహ వేడుకపై రాళ్ళ దాడి జరిగిన ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. 

స్థానిక జనసత్తా పత్రిక కధనం ప్రకారం.. దళితుల వివాహ వేడుకలో భాగంగా పెళ్లి ఊరేగింపు సొంకాచ్ ప్రాంతం గుండా వెళ్తూ మసీదు వద్దకు చేరిన సమయంలో బ్యాండ్ విషయమై స్థానిక ముస్లిములు అభ్యంతరం వ్యక్తం చేసారు. దీంతో ఇరుపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అధిక సంఖ్యలో ముస్లిములు అక్కడికి చేరుకోవడంతో పాటు రాళ్లు రువ్వడం ప్రారంభించారు. ఈ ఘటనలో ధర్మేంద్ర షిండే అనే వ్యక్తి తలపై సున్నిత ప్రాంతంలో రాయి తగలడంతో తీవ్రగాయమై మరణించాడు. ఆ సమయంలో ధర్మేంద్ర ఇరువర్గాలకు సర్దిచెప్పి శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఘటనలో గాయపడ్డ మరో ఇద్దరు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉంది. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఘటనకు సంబంధించి 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా ప్రాంతంలో ప్రస్తుతం 144 సెక్షన్ కొనసాగుతోంది. 

Source: Organiser