Home News ముస్లింలకు రిజర్వేషన్ల పెంపుపై 14 నుంచి బహిరంగ విచారణ

ముస్లింలకు రిజర్వేషన్ల పెంపుపై 14 నుంచి బహిరంగ విచారణ

0
SHARE

తెలంగాణలో సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన ముస్లింలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లుపెంచే అంశంపై ఈ నెల 14 నుంచి 17 వరకు రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు బహిరంగ విచారణ, ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ కమిషన్‌ తెలిపింది. బీసీ కమిషన్‌ నూతన కార్యాలయ సమావేశ మందిరంలో ఈ విచారణను నిర్వహిస్తామని ఛైర్మన్‌ బీఎస్‌ రాములు, సభ్యులు కృష్ణమోహన్‌రావు, ఆంజనేయులుగౌడ్‌, గౌరీశంకర్‌లు మంగళవారం వెల్లడించారు. ఆసక్తిగల ప్రజలు, సంస్థలు, కుల సంఘాల వారు విచారణలో పాల్గొన్ని తమ అభిప్రాయాలను మౌఖికంగా లేదా లిఖితపూర్వకంగా వివరించవచ్చని అన్నారు. కమిషన్‌ కల్పించే అన్ని సౌకర్యాల ద్వారా స్వయంగా గానీ, ఆన్‌లైన్‌ ([email protected]) ద్వారా లేదా పోస్టు ద్వారా ఈ నెల 19 సాయంత్రం అయిదు గంటల లోగా తమ అభిప్రాయాలను సమర్పించాలని సూచించారు.

(ఈనాడు సౌజన్యం తో)