Home Telugu నాగాలకు క్రైస్తవాన్నిపరిచయం చేసిన అమెరికన్ మిషనరీలకు ధన్యవాదాలు తెలిపిన నాగాలాండ్ ముఖ్యమంత్రి

నాగాలకు క్రైస్తవాన్నిపరిచయం చేసిన అమెరికన్ మిషనరీలకు ధన్యవాదాలు తెలిపిన నాగాలాండ్ ముఖ్యమంత్రి

0
SHARE

నాగాలాండ్ లో  క్రైస్తవమతాన్ని ప్రచారం చేసినందుకు ముఖ్యమంత్రి  షుర్ హోజలి లీజిత్సు అమెరికన్  మిషనరీలను ప్రశంసించారు.  వర్జీనియా బాప్టిస్ట్ మిషన్స్, బాప్టిస్ట్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో రెవరెండ్ జెఫ్రీ S. బఫ్కిన్ అధ్యక్షతన కోహిమా నుండి వచ్చిన బృందంతో ఆయన మాట్లాడారు. ఒకవేళ అమెరికన్ మిషనరీలు ఇక్కడకురాకపోయి ఉంటే , మతపరిచయం చెయ్యకపోయిఉంటే , నాగాల పరిస్థితి మరోలా ఉండేదని వ్యాఖ్యానించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాగాలాండ్ భూభాగం అన్నివైపులా బలమైన దేశాలు, బలమైన మతసంస్కృతులతో చుట్టుకుని ఉన్నప్పటికీ, వారు ఏ ఇతరమతాలనూ ఆచరింపక కేవలం క్రైస్తవాన్నే ఆచరించి దానినే ఇతరులకు బోధించారని చెప్పారు.  ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వెలువడిన ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేసారు.

కేవలం నాగాల రాజకీయ సమస్య కారణంగా నాగాలాండ్ అనుకున్నంతగా అభివృద్ధిని సాధించలేకపోయిందని ఆయన విచారం వ్యక్తంచేశారు. ఒకసారి ఈ సమస్యకి పరిష్కారం దొరికితే నాగాలాండ్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.

రెవరెండ్ S. బఫ్కిన్ మాట్లాడుతూ నాగా ప్రజలు ఎవరితోనూ వెనుకబడిలేరని, అందుకనే రాష్ట్రం వివిధరంగాల్లో అభివృద్ధిచెందుతోందని అన్నారు. మనుషుల అక్రమరవాణాకి వ్యతిరేకంగా నాగా ప్రజల పోరాటం, పనితీరు తమకు మరింత ప్రోత్సాహాన్నిఇస్తున్నదని ఆయన సంతోషం వ్యక్తంచేశారు.

(న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ సౌజన్యం తో)