ఆర్
ఎస్ ఎస్ తృతీయవర్ష సంఘ శిక్షావర్గ
నాగపూర్ లోని డా.
హెడ్గేవార్
స్మృతి భవన్ మహర్షి వ్యాస
సభాగృహంలో ఈ రోజు ప్రారంభమయింది.
శిక్షావర్గ ఉద్ఘాటన కార్యక్రమంలో మాట్లాడుతూ నిత్య జీవన వ్యవహారంలో సరైన విలువలను అనుసరించడం చాలా ముఖ్యమని సర్ కార్యవాహ శ్రీ భయ్యాజీ జోషి అన్నారు. ఇది చాలా ముఖ్యమైన కార్యమే అయినా అది అలవాటు చేసుకోవడం కష్టమని ఆయన అన్నారు. ఆ విలువలను జీవితాంతం అనుసరించడానికి కావలసిన స్వచ్ఛత, నిష్ట సంఘ శిక్షావర్గలో అలవరచుకోవచ్చని అన్నారు.
దేశం మొత్తం నుంచి 828 మంది శిక్షార్ధులు ఈ సంవత్సరం వర్గలో పాల్గొంటున్నారు. తృతీయ వర్షలో పాల్గొంటున్నవారంతా విద్యార్ధులే కావడం విశేషం. ఇక్కడ వ్యక్తిగతమైన విషయాలను మరచిపోయి మాతృభూమి సంతానమనే విషయాన్నే గుర్తుంచుకుంటామని, ఈ జాతీయ భావనే ఎల్లప్పటికి నిలిచి ఉంటుందని భయ్యాజీ జోషి అన్నారు.