Home News భారత్ ఒక అజేయ శక్తిగా ఎదుగుతుంది – శ్రీ ఉదయ భాస్కర్

భారత్ ఒక అజేయ శక్తిగా ఎదుగుతుంది – శ్రీ ఉదయ భాస్కర్

0
SHARE
ప్రసంగిస్తున్న శ్రీ ఉదయ భాస్కర్

“నేడు భారత దేశం అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞ్యానం తో ప్రపంచ దేశాలకు దీటుగా ఒక అజేయమైన శక్తిగా ఏదుగుతుందని,  వాటికి నిదర్శనమే మన శాస్త్రవేత్తలు ఇటీవలే ప్రయోగించిన మిషన్ శక్తి  ఏ-శాట్ మిస్సైల్, వివిధ మిలిటరీ, కార్టోశాట్ సిరీస్ శాటిలైట్లు అని అన్నారు. అతి తక్కువ పెట్టుబడులతో దేశీయంగా తయారుచేయడం, అందుకు అన్ని విధాల ఇప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించడం ఒక శుభపరిణామం” అని శ్రీ ఉదయ భాస్కర్  గారు, విశ్రాంత చైర్మన్ & మేనేజింగ్  డైరెక్టర్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, తెలిపారు.

ఈ రోజు (24-మే) సాయంత్రం జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అద్వర్యంలో రాష్ట్రీయ విద్య విహార్, అన్నోజీగూడ నిర్వహించబడిన ప్రథమవర్ష ముగింపు సభ కార్యక్రమంలో శ్రీ ఉదయ కిరణ్ గారు ముఖ్య అతిదిగా పాల్గొని ప్రసంగించారు.

తెలంగాణ ప్రాంత సంఘచలాక్ (అద్యక్షులు) శ్రీ బూర్ల దక్షిణామూర్తి గారు ఉపన్యసిస్తూ నేటి దేశ పరిస్థితులలో సంఘ స్వయంసేవకుల పైన ఎంతో గురుతరమైన బాద్యత ఉన్నదని దాన్ని విజయవంతంగా నెరవేర్చేందుకు ఇక్కడ శిక్షణ పొందిన అందరూ తమ సర్వ శక్తులను ఒడ్డి పని చెయ్యాలని ఉద్బోధ చేసారు.

శ్రీ బూర్ల దక్షిణామూర్తి , వేదిక పైన ఉన్న శ్రీ నాగరాజు , శ్రీ ఉదయ భాస్కర్, శ్రీ రాజేందర్ రావు

స్వయంసేవకులు చేసిన శారీరక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. వీరితో పాటు ఈ కార్యక్రమంలో ఆర్.ఎస్.ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర సంఘచలాక్ శ్రీ నాగరాజు , 20 రోజుల వర్గకు వర్గాదికారిగా వ్యవహరించిన ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీ రాజేందర్ రావు కూడా ఉన్నారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గత 94 సం. లు గా హిందూ సమాజం యొక్క ఆత్మ విస్మృతి ని దూరం చేసి , సమాజంలో ఉన్న దోషాలను గుర్తించి వాటిని సరిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తూ ఉన్నది. నేడు సమాజంలో ఎక్కడ చూసిన అవినీతి, దేశభక్తి రాహిత్యము, క్రమశిక్షణా లోపం కనబడుతూ ఉన్నది. ఏ దోషాలను తొలగించి , జాగృత మరియు దేశభక్తి పూరిత సమాజ నిర్మాణం కొరకు, దేశ పరమ వైభవ స్థితిని సాదించడానికి , సుశిక్షిత కార్యకర్తలను నిర్మాణం చేసుకోవడానికి శిక్షవర్గాలను నిర్వహిస్తూ శిక్షణను ఇస్తూ ఉంటుంది.

ఈ కార్యకర్తలు ఆయా గ్రామాలలో , సంఘ మరియు గ్రామ అభివృది కొరకు, తద్వారా దేశ సంక్షేమం కొరకు కృషి చేస్తూ ఉంటారు. అలా శ్రీ విద్య విహార్, అన్నోజీగూడ ప్రథమవర్ష నిర్వహించబడినది. ఈ వర్గలో తెలంగాణ లోని అన్ని జిల్లాల నుండి 285 మంది స్వయంసేవకులు పాల్గొన్నారు. ఇందులో సంఘ అఖిల భారత, క్షేత్ర, ప్రాంత స్తాయి కార్యకర్తల మార్గదర్శనం లభించింది.

శిక్షా వర్గాలో 20 రోజుల పాటు ఇచ్చే శిక్షణ జాతీయ, వ్యక్తిత్వ నిర్మాణానికి దోహదపడే విధంగా ఉంటుంది. శిక్షార్తులు ప్రతి రోజు ఉదయం 4:30 ని నుండి రాత్రి 10 గం వరకు వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. శారీరక్, బౌద్దిక్,మానసిక వికాసమునకు సంబందించిన యోగ , దండ, నియుద్ధ సమత మొదలైన శరీరక్ కార్యక్రమాలు, చర్చ, గోష్టి, కథ , ఉపన్యాసం మొదలైన బౌద్ధిక్ విషయాలలో శిక్షణ పొందారు. పరిసరాల పరిశుబ్రత సంఘ కార్యక్రమంలో ఒక భాగము. వర్గలో పాల్గొన్న అందరు ఈ స్వచ్ఛత కార్యక్రమంలో ప్రతి రోజు పాల్గొన్నారు. అదే విధంగా పత్రిక రంగమునకు సంబంధించన శిక్షణ కూడా ఇవ్వబడింది.


సమయపాలన, పరిసరాల పరిశుబ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోబడింది. దేశ చరిత్ర, సంస్కృత జాతీయ విషయలపై అవగాహన పెంచేందుకు విశేష కృషి జరిగింది. శిక్షా వర్గాలో పాల్గొనేందుకు స్వయంసేవకులు తమ గణవేష్ తామే సమకూర్చుకొని 20 రోజులు భోజన తదితర అవసరాలకు తగిన శుల్క కూడా చెల్లించారు.

శిక్షావర్గలో 15 సం వయస్సు నుండి 40 సం మధ్య వయస్సు ఉన్న వాళ్ళు పాల్గొన్నారు. విద్యార్థులు, ఉద్యోగస్తులు, వివిధ వృత్తుల వారు పాల్గొన్నారు. శిక్షావర్గ ఈ రోజుతో పూర్తి అవుతుంది. శిక్షార్తులు అందరు రేపు తిరిగి తమ గ్రామాలకు వెళ్లి పోతారు.