
సమాజ శ్రేయస్సు కొరకు పాత్రికేయ రంగాన్ని సేవా మార్గంగా ఎంచుకొని తమ రచనలు, వ్యాఖ్యానాల ద్వారా ప్రజల్లో దేశభక్తిని, సమాజంలో చైతన్యం కోసం నిత్యం కృషి చేస్తున్న పాత్రికేయులను సన్మానించడం సముచితమని తెలంగాణ, హర్యాణా రాష్ట్ర ప్రభుత్వాల పోలీసు సలహాదారు శ్రీ వెంకట చంగవల్లి పేర్కొన్నారు. నేటి సమాజంలోని సానుకులతను, యువత లోని ఉత్సాహాన్నిసన్మార్గంలో నడపడంలో పాత్రికేయులది విశిష్టమైన పాత్ర అని ఆయన గుర్తుచేశారు.
సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్ అద్వర్యంలో నగరంలోని శ్రీ త్యాగరాయ గానసభలో 19వ తేదీన దేవర్షి నారద జయంతి సందర్భంగా నిర్వహించిన ప్రపంచ పాత్రికేయ దినోత్సవం సందర్బంగా జరిగిన సన్మాన సభలో శ్రీ వెంకట చంగవల్లి గారు ముఖ్య అతిదిగా పాల్గొన్నారు.
రాష్ట్రంలో తొలిసారిగా 108 అంబులెన్సు సేవలను ప్రారభించిన వెంకట చంగవల్లి ఈ సందర్భంగా మాట్లాడుతూ, విలువలతో కూడిన సమాజాన్ని ఏర్పాటు చేయడానికి పాత్రికేయులు నిరంతరం అద్యయనం చేస్తూ ఉన్నత లక్ష్యం వైపు దృష్టి పెట్టి దేశ అభివృద్దిలో కీలక పాత్ర పోషించాలని కోరారు.

కార్యక్రమంలో ముఖ్య అతిది గా పాల్గొన్న ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యులు శ్రీ ముకేశ్ శా మాట్లాడుతూ, జ్ఞాన భక్తి కలవాడు నారదుడు అని, ఆయనను ఆదర్శంగా తీసుకొని పాత్రికేయులు ఎలాంటి అసత్యాలకు తావులేకాండా తాము పని చేస్తున్న కార్యక్షేత్రాలలో నిజాయితిగా పని చేయాలనీ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యానికి పాత్రికేయ రంగం నాలగవ స్థంబం అని, అటువంటి విశిష్ట ప్రాముఖ్యత ఉన్న ఈ రంగాన్నిరాబోయే కాలానికి అనుగుణంగా బలోపేతం చేయాలనీ కోరారు.
టెక్నాలజి వలన సమాజంపై సోషల్ మీడియా ప్రభావం విస్తృతంగా ఉందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందుకు అనుగుణంగా నేటి పాత్రికేయులు పని చేయాలనీ ఆశించారు.

పాత్రికేయ రంగంలో విశిష్ట సేవలు అందించిన నలుగురు సీనియర్ పాత్రికేయులను ఈ సందర్బంగా సన్మానించడం జరిగింది.
సీనియర్ పాత్రికేయులు శ్రీ కృష్ణ దేవరాయ భాష నిలయం కార్యదర్శి శ్రీ టి. ఉడయవర్లు గారికి, ఆంధ్రజ్యోతి సీనియర్ కరస్పాండట్ కార్టూనిస్ట్ శ్రీ వడ్డీ ఓం ప్రకాష్ గారికి శ్రీ వడ్లముడి రామ్మోహన్ రావు గారు స్మారక పురస్కారం ఇవ్వడం జరిగింది. ఈనాడు రాష్ట్ర డిప్యూటీ న్యూూస్ ఎడిటర్ శ్రీ రావికంటి శ్రీనివాస్ గారికి భండారు సదాశివ గారి స్మారక పురస్కారం, హిందీ మిలాప్ ఉప సంపాదకులు శ్రీ మతి శుబ్రత నిగం గారికి సమాచార భారతి ఉజ్వల మహిళా పురస్కారం తో సన్మా నించడం జరిగింది.


సన్మాన గ్రహీత శ్రీ వడ్డీ ఓంప్రకాష్

సన్మాన గ్రహీత శ్రీ రావికంటి శ్రీనివాస్

సన్మాన గ్రహీత శ్రీమతి శుభ్రత నిగం
ఈ కార్యక్రమం లో సమాచార భారతి అధ్యక్షులు శ్రీ గోపాల్ రెడ్డి, కార్యదర్శి శ్రీ ఆయుష్ నడింపల్లి , సీనియర్ జర్నలిస్ట్ శ్రీ వేదుల నరసింహం, వడ్డీ విజయసారథి, క్రాంతి దేవ్ మిత్ర, తిగుల్ల క్రిష్ణముర్తి, రాంపల్లి మల్లిఖార్జున రావు, కుంతి సురేందర్, అయ్యలసోమయాజుల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.