“ఫిబ్రవరి 28 – నేషనల్ సైన్స్ డే”
పాశ్చాత్యుల నుంచి పురుడు పోసుకున్నదే సైన్సు అనే భ్రమ నుంచి ప్రతి భారతీయుడు బైట పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భరత ఖండంలో వైజ్ఞానిక అధ్యయన పరంపర ప్రాచీన కాలం నుంచి కొనసాగుతూ వచ్చింది. ఆ క్రమంలో అనేక మంది ఋషులు వారి జీవితాలను ధారపోశారు. విమాన విద్య, నక్షత్ర విజ్ఞానం, రసాయన విజ్ఞానం, అస్త్ర – శస్త్ర రచన, ఓడల నిర్మాణంతోపాటు జీవితంలోని అన్ని రంగాల గురించి భారతీయ ఋషులు పరిశ్రమించారు. పాశ్చాత్యుల కన్నా వేలాది సంవత్సరాలకు ముందే మన ఋషులు, శాస్త్రవేత్తలు, పండితులు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో చేసిన ఆవిష్కరణలు భారతీయులందరికీ గర్వకారణం.