Home News ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

0
SHARE
ఐసిస్ తో సంబంధాలున్న బెంగళూరుకు చెందిన ఇద్దరు నిందితులను ఎన్ఐఏ గురువారం అరెస్టు చేసింది. నిందితుల్లో అహ్మద్ అబ్దుల్ చెన్నైలోని ఒక బ్యాంకులో వ్యాపార విశ్లేషకుడు కాగా ఇర్ఫాన్ నాసిర్ బెంగుళూరులోని బియ్యం వ్యాపారి అని ఎన్ఐఏ తెలిపింది. బెంగళూరు కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న నేపథ్యంలో గత నెల సెప్టెంబర్ 19న వీరిపై కేసు ఎన్ఐఏ నమోదు చేసింది.
నిందితులు ఇద్దర్ని స్పెషల్ ఎన్ఐఏ కోర్టులో హాజరు పరిచారు. తదుపరి విచారణ కోసం మరో  10 రోజులను కోర్టు మంజూరు చేసింది. ఈ విచారణలో  ఐసిస్ చేస్తున్న కుట్రలను బయటపెట్టనున్నట్టు ఎన్ఐఏ స్పష్టం చేసింది.
నిందితులిద్దరూ హిజ్బ్-ఉట్-తహ్రీర్ అనే నిషేధిత ఉగ్ర సంస్థ కి చెందిన వారని, ఖురాన్ సర్కిల్ అనే ఒక సమూహాన్ని ఏర్పాటు చేసి యువకులను ఐసిస్ లో చేర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు ఎన్ఐఏ తెలిపింది.
ముంబై నుంచి కొంత మంది యువకులను సిరియా తరలించడానికి నిధులు కూడా సమకూర్చినట్టు తెలిపింది.
 పదిహేను రోజుల క్రితం కేరళ, పశ్చిమ బెంగాల్ కు చెందిన ఆరుగురు తీవ్ర వాదులను ఎన్ఐఏ అరెస్టు చేసింది.  ఆ తర్వాత మరో రెండు రోజుల్లోనే కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో మరో ఇద్దరు తీవ్రవాదులను అరెస్టు చేసింది.
Source : VSK BHARATH