Home Telugu Articles నిజాముద్దీన్ మర్కజ్.. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తికి మూలకేంద్రం

నిజాముద్దీన్ మర్కజ్.. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తికి మూలకేంద్రం

0
SHARE

ప్రపంచ వ్యాప్తంగా చైనా వైరస్ కరోనా కరాళ నృత్యం చేస్తున్న సమయంలో..  భారత ప్రభుత్వం విధించిన దేశవ్యాప్త లాక్-డౌన్ కారణంగా ఈ ముప్పు తొలగే అవకాశం ఉంటుందని ప్రజల్లో ఆశలు  చిగురిస్తున్న వేళ.. దేశ రాజధాని ఢిల్లీలోని మర్కజ్ మసీదు కేంద్రంగా అత్యంత ఆందోళనకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.

మర్కజ్ మసీదు ద్వారా దేశవ్యాప్తంగా ప్రబలిన కరోనా వైరస్ కారణంగా  మార్చి 31, మంగళవారం నాడు ఒక్క రోజే  భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సుమారు 300 నుండి 1000 కి పైగా పెరిగింది. ప్రపంచానికి చైనా బహుమతిగా ఇచ్చిన కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా భారతదేశం సాగిస్తున్న పోరాటంలో ఇది పెద్ద  ఎదురుదెబ్బ.

మార్చి మొదటి వారం నుండి లాక్ డౌన్ ప్రకటన వెలువడిన సమయం వరకు దేశ, విదేశాలకు చెందిన 4000 మందికి పైగా ముస్లింలు నిజాముద్దీన్ మర్కజ్ వద్ద గుమిగూడారు. ఇది భారత చట్టాలను అపహాస్యం చేయడం, వాటిని యథేచ్ఛగా ధిక్కరించడం, పౌరులను రక్షించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలను విస్మరించడం తప్ప మరొకటి కాదు.

నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో ఏం జరిగింది?:
ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ మసీదులో తబ్లిగీ జమాత్ వార్షిక సమావేశాలకు ముందు గత 12 నెలల కాలంలో దేశంలోని బగల్కోట్, భోపాల్, అమరావతి, మేవా  తదితర చోట్ల ఈ సంస్థ ప్రాంతీయ సమావేశాలు జరిగాయి. అంతే కాకుండా ఆసియా వ్యాప్తంగా ఇండోనేషియా, మలేషియా, పాకిస్తాన్ వంటి దేశాల్లో అతిపెద్ద తబ్లిగ్ సభలు జరిగాయి. మలేషియాలో జరిగిన సమావేశాలకు భారతదేశం నుండి భారీ సంఖ్యలో ముస్లిములు హాజరయ్యారు.

ఢిల్లీ మర్కజ్ మసీదులో జరిగిన తబ్లిగీ జమాత్ సభలో ఆంధ్రప్రదేశ్ విభాగానికి సంబంధించిన కార్యక్రమాలు ఈనెల 15 నుండి 17 వరకు జరిగింది. అంతకు ముందు  తెలంగాణ, తమిళనాడు విభాగాలకు సంబంధించిన కార్యక్రమాలు ఇదే మసీదులో పూర్తయ్యాయి. అంటే 15న ఆంధ్రప్రదేశ్ విభాగానికి సంబంధించిన కార్యక్రమాలు మొదలైన నాటికే కరోనా దేశంలో తీవ్రరూపం దాల్చింది. అప్పటికే  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక మార్గదర్శకాలు జారీ చేశాయి. మలేసియాలో జరిగిన తబ్లిగ్ జమాత్ కార్యక్రమానికి హాజరై కరోనా బారినపడి ఒకరు మృతిచెందిన విషయం అప్పటికే మర్కజ్ మసీదు ప్రతినిధుల దృష్టిలోకి వచ్చింది. అయినప్పటికీ ఈ కార్యక్రమాలకు హాజరయ్యే భారీ సమూహాలను నియంత్రించే ముందు జాగ్రత్త చర్యలేవీ వీళ్ళు తీసుకోలేదనే విషయం స్పష్టమవుతోంది.

అంతేకాదు.. తబ్లిగీ జమాత్ కార్యక్రమాలు కరోనా వైరస్  కేంద్రాలుగా మారుతున్న విషయం తెలిసీ కూడా కార్యక్రమాల నిర్వాహకులు ఏ దశలోనూ కేంద్ర,, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించలేదు. భారత ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 21న లాక్ డౌన్ ప్రకటించే నాటికి ఢిల్లీ మర్కజ్ మసీదులో సుమారు 2000 మంది తబ్లీగీలు ఉన్నారు. పరిస్థితి అదుపు తప్పి, కరోనా వైరస్ వాళ్లలో వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసినప్పటికీ  వాళ్ల ధిక్కారణ ధోరణిలో మాత్రం మార్పు రాలేదు.

అనుకున్న ప్రణాళిక ప్రకారం దేశ విదేశాల నుండి వచ్చిన ఇస్లామిక్ మతప్రచారకులతో బయటి ప్రపంచానికి తెలియకుండా సాగుతున్న తబ్లిగీ జమాత్ వార్షిక  కార్యక్రమానికి హఠాత్తుగా ప్రకటించిన 21 రోజుల లాక్-డౌన్ ముగింపు పలికింది.

కరోనాపై పోరులో భాగంగా దేశ ప్రజలంతా ప్రభుత్వం విధించిన 21 రోజుల లాక్-డౌన్ కి సిద్ధమవుతున్న వేళ.. తెలంగాణ, తమిళనాడు, బీహార్, జమ్మూ-కాశ్మీర్, అండమాన్-నికోబార్ ప్రాంతాల్లోని మసీదుల్లో ఇండోనేసియా, ఇతర మధ్య ఆసియా దేశాలకు చెందిన ముస్లిములు అక్రమంగా నివసిస్తున్న విషయం ఉలిక్కిపడేలా చేసింది. మార్చి 5 నాటికి ఢిల్లీ మర్కజ్ మసీదులో తమిళనాడు విభాగానికి చెందిన వారి కార్యక్రమం పూర్తికాగానే దక్షిణాదిలో మొదటి కరోనా పాజిటివ్ కేసు అదే రాష్ట్రంలో నమోదవ్వడం గమనించాల్సిన విషయం.

అందుబాటులో ఉన్న సమాచారం క్షుణ్ణంగా పరిశీలిస్తే.. తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన వారిలో అధిక శాతం, ముస్లిముల ఉనికి ఎక్కువగా లేని, దక్షిణాది రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల వాళ్ళే అని తెలుస్తోంది. వీరు తిరిగి స్వగ్రామం చేరుకొని చేయాల్సిన కార్యకలాపాలు ఏమిటి, అక్కడ వీరు పొందిన మార్గనిర్ధేశకాలు ఏమిటి  అనేవి సిసలైన ప్రశ్నలు.

Source: www.epaper.organiser.org

తరువాయి భాగం..