Home News విద్యుత్ గ్రిడ్ లకు ఎలాంటి ప్రమాదం లేదు – కేంద్ర విద్యుత్ కార్యదర్శి

విద్యుత్ గ్రిడ్ లకు ఎలాంటి ప్రమాదం లేదు – కేంద్ర విద్యుత్ కార్యదర్శి

0
SHARE

కరోన వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో సమిష్టి సంకల్పాన్ని, ఏకత్వభావాన్ని, ధైర్యాన్ని పెంపొందించడం కోసం రేపు (ఆదివారం) రాత్రి 9గం.లకు తొమ్మిది నిముషాలపాటు ఇళ్ళలో కరెంట్ దీపాలన్నీ ఆర్పివేసి నూనె దీపాలు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా ఇలా కరెంట్ వాడకాన్ని తగ్గిస్తే పవర్ గ్రిడ్ లు కుప్పకూలుతాయంటూ కొందరు వ్యక్తంచేస్తున్న అనుమానాలు, భయాలకు ఆదారం ఏది లేదని, అలా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. పవర్ గ్రిడ్ ప్రభావితం కాకుండా తీసుకోవలసిన చర్యలను ఇప్పటికే ప్రాంతీయ, రాష్ట్ర విద్యుత్ పంపిణీ కేంద్రాలకు తెలియజేశామని ఆయన స్పష్టం చేశారు.

రేపు రాత్రి 9 గం. లకు 9 నిముషాలపాటు ఇళ్లలోని కరెంట్ దీపాలను మాత్రమే ఆర్పమని ప్రధాని చెప్పారని, టీవి, రిఫ్రిజిరేటర్ మొదలైన ఇతర విద్యుత్ ఉపకరణాలు యధావిధిగా పనిచేస్తూ ఉంటాయని, వాటిని ఆపవలసిన అవసరం లేదని కేంద్ర విద్యుత్ కార్యదర్శి వివరించారు. అలాగే వీధి దీపాలు, ఆసుపత్రుల్లో దీపాలు, అత్యవసర సేవల విభాగాల్లో దీపాలు కూడా ఆర్పవలసిన అవసరం లేదని తెలిపారు.