Home News ప్రధానికి క్లీన్ చిట్ పై సమర్థన: సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేత

ప్రధానికి క్లీన్ చిట్ పై సమర్థన: సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేత

0
SHARE

గుజరాత్ అల్లర్ల కేసులో నరేంద్రమోదీ, మరికొందరికి సిట్ క్లీన్ చిట్‌ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ జకీయా జాఫ్రీ వేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు ఏఎం ఖాన్విల్కర్, దినేష్ మహేశ్వరి, సీటీ రవికుమార్ గల సుప్రీంకోర్టు బెంచ్ తోసిపుచ్చుతూ, ఘాటైన వ్యాఖ్యలు చేసింది.

వేరే దురుద్దేశాలతో గత 16 సంవత్సరాలుగా ఈ కేసును అలా సజీవంగా ఉంచడానికి సహజంగానే కొందరు చర్యలు కొనసాగిస్తున్నట్లు గమనించామని సుప్రీంకోర్టు పేర్కొంది.

ఇలా న్యాయ ప్రక్రియ దుర్వినియోగానికి పాల్పడిన వారందరి మీద విచారణ సాగాలి, చట్టానికి అనుగుణంగా వారిపై ముందుకు సాగాలి అని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

గుజరాత్ రాష్ట్రంలోని కొందరు అసంతృప్త అధికారులతో పాటు ఇతరులు కూడా కలిసి వారు చెపుతున్నవి అబద్ధం అని తెలిసి కూడా దానికి విరుద్ధంగా బయటకు చెప్పడం ద్వారా సంచలనం సృష్టించడానికి ప్రయత్నించడం మాకు కనిపించింది అని కూడా సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.

సిట్ పూర్తి విచారణ అటువంటి వారి అబద్ధపు వాదనలను బహిర్గతం చేసింది అని సుప్రీంకోర్టు పేర్కొంది.

కోర్టు నియమించిన సిట్ విచారణ ను సవాల్ చేయడం అంటే చాలా ఎక్కువగా చూడడం, సిట్ పడ్డ కష్టాన్ని తప్పుగా తక్కువ చేసి చూపించడంగా మేం భావిస్తున్నాం. ఇది అసలు సుప్రీంకోర్టు వివేకాన్ని ప్రశ్నించే చర్యగా భావిస్తున్నాం అని కోర్టు పేర్కొంది.

“ఆ కాలంలో మైనారిటీ కమ్యూనిటీకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా సామూహిక హింసకు పాల్పడమని ప్రేరేపించినట్లు అత్యున్నత స్థాయిలో నేరపూరిత కుట్ర చేశారు అని చూపించడానికి గుర్తించదగిన లింక్ గురించి ఎటువంటి ఆధారం లేదు” అని కోర్టు పేర్కొంది.