నిర్మల్ జిల్లా భైంసాలో జనవరి 12వ తేదీన జరిగిన అల్లరిమూకల దాడులు, మత ఘర్షణలు తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై జనవరి 27వ తేదీన తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఘర్షణ జరిగిన ప్రాంతాలను నిజనిర్ధారణ కమిటి పర్యటించింది. ఈ కమిటి సంస్థ సభ్యులైన హైకోర్ట్ న్యాయవాదులు శ్రీ గాడి ప్రవీణ్ కుమార్, అరుణ్ కుమార్ దొడ్ల, టి.సుజన్ కుమార్, సంజీవ్ జిల్లెల, మంగులాల్ రాథోడ్ గార్లు అల్లర్లు జరిగిన ప్రాంతాలను సందర్శించి అక్కడ జరిగిన అల్లర్లలో ఒక వర్గం చేతిలో ధ్వంసమయిన నివాస సముదాయాలు, వ్యాపార సముదాయాలను. అక్కడి ఇరువర్గాల ప్రజలను మరియు వారి కుటుంబ సభ్యులను కలవడం జరిగింది.
అస లేంజరిగింది?
నిర్మల్ జిల్లాలో భైంసా ఒక మండల కేంద్రం మరియు చుట్టుప్రక్కల గ్రామాలకు అతి ముఖ్యమైన పట్టణం. మహరాష్ట్ర సరిహద్దులో ఉండడం వలన అక్కడి ప్రభావం ఈ ప్రాంతం పైన ఉంటుంది. 2008లో జరిగిన దాడిలో ముస్లింలకు కొంత మేర ఆస్థి నష్టం సంభవించగా అప్పటి కాంగ్రెస్ నాయకులు వారి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ముస్లిం వర్గానికి సపోర్ట్ చేస్తు కొంత ఋణ సహాయం చేయడం జరిగింది. కాలక్రమేణా అప్పటి నుండి భైంసాలో చెదురు ముదురు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. జనవరి 12వ తేదీన జరిగిన ఘటన అత్యంత హేయమైన ఘటన. ఈ ఘటన క్షణికావేశంలో జరిగినది కాదు. దీని వెనకాల ఒక వర్గం వారు రెచ్చగొట్టిన చర్యలే కారణమని ఈ బృందం దృష్టికి వచ్చింది. నిర్మల్ జిల్లా సరిహద్దులో జనవరి 10, 11, 12వ తేదీలలో “ఇస్తామా” (మత జాగరణ) అని సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సుమారు 5 లక్షల మంది మన పక్క రాష్ట్రాలైన, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ నుండి పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. వచ్చిన వారికి భైంసా, నిర్మల్ బోధన్ చుట్టుప్రక్కల ప్రాంతాలలో ప్రత్యేకించి మసీదులలో నివాసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ “ఇస్తామా‘కు ప్రభుత్వం నుండి గాని, పోలీస్ నుండి గాని, మున్సిపాలిటి నిర్మల్ నుండి గాని ఎటువంటి పర్మిషన్ తీసుకోలేదని బాధితులు నిజనిర్ధారణ బృందం దృష్టికి తీసుకువచ్చారు. మన గౌరవనీయులైన దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు. దగ్గరుండి ‘ఇస్తామా‘ మీటింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించినట్లు కూడా బాధితులు మా దృష్టికి తీసుకొని వచ్చారు.
జనవరి 12వ తేదిన సుమారు 9 గంటల ప్రాంతంలో షిమ్లమ్ అను వ్యక్తి బైక్ సైలెన్సర్ తీసివేసి గట్టిగా హారన్ శబ్దం చేస్తూ అనేక సార్లు హిందువులు నివసిస్తున్న ప్రాంతంలో (కూర్బా గల్లిలో) చక్కర్లు కొడుతూ అక్కడున్న జన సమూహాలను భయబ్రాంతులకు గురిచేయడం జరిగింది. అదే ముస్లిం వ్యక్తి మరల సుమారు 10 గంటల ప్రాంతంలో విపరీతమైన శబ్దం చేస్తూ హారన్ మోగిస్తూ వెళ్తుండగా అక్కడున్న కొంతమంది హిందు అబ్బాయిలు ఇలా ఎందుకు చేస్తున్నావని అడగగా ముస్లిం వ్యక్తి హిందు అబ్బాయిలను అసభ్యంగా తిట్టడం జరిగింది. ఇంతలో ఒకరిపై ఒకరి చేయివేసుకోవడం జరిగింది. కావాలని రెచ్చట్టడం జరిగింది. ఇంతలో ‘ఇస్తామా‘ మీటింగ్ కు వచ్చిన ముస్లింలు మరియు లోకల్ మున్సిపల్ చైర్మన్ జావెద్ అహ్మద్ (ఎంఐఎం పార్టీ) మరియు అతని అనుచరుడు అయిన పైజుల్లా ఖాన్ (ఎంఐఎం కౌన్సిలర్) సుమారు 2 వేల మందితో వచ్చి అక్కడున్న కుర్బాగల్లి, మరియు గుజౌరీ గల్లిలో హిందువుల ఇళ్ళపై దాడి చేయడం జరిగింది. భైంసా పట్టణం ఎం.ఐ.ఎం పార్టీ తమ ఆధిపత్యం చలాయించడానికి మత ఘర్షణలకు ఆజ్యం పోస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. దానికి మన సెక్కులర్స్ రాజకీయ నాయకులు వత్తాసు పలుకుతున్నారు.
ఘటన జరిగిన తీరు:
జనవరి 12వ తేదిన సుమారు 10, 11 గం.ల ప్రాంత సమయములో దహన మరియు దోపిడి కాండ సుమారు ఉదయం 5 గంటల వరకు జరిగింది. బాదితుల ప్రత్యక్ష కథనం ప్రకారం సుమారు 2వేల మంది ఒక్కసారిగా హిందువుల ఇళ్ళపై దాడిచేస్తూ పెట్రోల్ బాంబులతో, కిరోసిన్ బాంబులతో దాడి చేసినారు. పసిపిల్లలు, గర్భిణీలు, ఆడవాళ్ళు అన్న కనీస కనికరం లేకుండా దాడి చేసినారు. ఆడవాళ్ళు అని కూడా చూడకుండా అసభ్య సంభాషణం చేస్తూ అమానవీయంగా దాడి చేసారాని బాధితులు తెలుపడం జరిగింది. అక్కడున్న వారికి మరో జన్మ అని చెప్పాల్సింది అంటే ఎంత కర్కషంగా, ఎంత రాక్షసంగా ముస్లింలు దాడి చేసారో ఊహించుకోవచ్చు.
సుమారు 10 గంటల ప్రాంతంలో పోలీసులు అక్కడికి రావడం జరిగింది. అక్కడున్న ముస్లింలు పోలీసుపై కూడ రాళ్ళు విసరడంతో పోలీసులు కూడ నిశ్చేష్టులైనాడు. వాళ్ళు రాళ్ళ దాడిలో డి.ఎస్.పి.గారు, సి.ఐ, ఎస్.ఐ మిగతా కానిస్టేబుల్స్ కు గాయాలు కావడం జరిగింది. అంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. హిందువుల ఇళ్ళపై రాళ్ళతో, పెట్రోబాంబులతో, కిరోసిన్ బాంబులతో దాడి చేస్తూ పాకిస్థాన్ జిందాబాద్, ఎస్ఆర్ సి & సిఎఎ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ హిందూ దేవుళ్ళను దూషిస్తూ అసభ్య క్రీడకు తెరతీసినారు. రోడ్లపై ఉన్న వాహానాలకు నిప్పుపెట్టడం జరిగింది. సి.సి. కెమెరాలు ద్వంసం చేయడం జరిగింది. ఇంత జరుగుతున్న పోలీసులు నిశ్చేష్టులై చూడడం ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ. అక్కడ జరిగిన దహనకాండను చూస్తే రావణాసుర వద కన్న దారుణంగా ఉంది. ప్రతి ఇంట్లో కనీసం గుక్కెడు బియ్యమైన కూడ లేకుండా మాడి మసైనాయి అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. దహనకాండ జరిగిన 15 రోజులు కావస్తున్నప్పటికి బాదితుల భయబ్రాంతులతోనే జీవిస్తున్నారు. బాదితుల ఇళ్ళలోకి చొరబడి మగవాళ్ళపై దాడి చేస్తూ ఆడవాళ్ళ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను దోపిడి చేయడం జరిగింది.
ఆస్థి నష్టం అంచనా:
జనవరి 12వ తేదీన జరిగిన దహన కాండలో ఎక్కువ మొత్తం ఆస్థి నష్టం జరిగింది. బాధితులందురా రోజువారి కూలీలు మరియు చిన్న వ్యాపారులు. ఆ రోజు జరిగిన అల్లరి మూకల దాడిలో …
1) న్యామతాబాద్ లింగోజి ఇల్లు పూర్తిగా ద్వంసం జరిగింది ఇల్లు పూర్తిగా లూటి చేయబడింది నష్టవిలువ సుమారు 3 లక్షలపై మాటే.
2) న్యామంతాబాద్ సంగీత ఇల్లు కూడ పూర్తిగ దహనం చేయబడింది నష్ట విలువ సుమారు 3 లక్షలపై మాటే.
3) న్యామంతాబాద్ రాజేష్ ఇల్లు కూడ పూర్తిగా దహనం చేయబడింది నష్టం విలువ సుమారు 4 లక్షలపై మాటే.
4) పుష్ప అమంద ఇల్లు పూర్తిగా దహనం చేయబడింది నష్టం విలువ సుమారు 3 లక్షల పై మాటే.
5) బాయోల్ల పెద్ద పోషెట్టి ఇల్లు కూడ పూర్తిగా దహనం చేయబడింది నష్టం విలువ సుమారు 2 లక్షలపై మాటే.
6) బాయోల్ల చిన్న పోషెట్టి ఇల్లు కూడ పూర్తిగా దహనం చేయుడింది నష్టం విలువ సుమారు 2 లక్షలు.
7) ఇంగ్లీకర్ వసంతరావు ఇల్లు కూడ పూర్తిగా దహనం చేయబడింది నష్టం విలువ సుమారు 4 లక్షలపై మాటే.
8) కుమ్మరల్ల జగన్ 3 బైకులు పూర్తిగా దహనం చేయబడింది నష్టం విలువ సుమారు 75 వేలు.
9) దాడి, ప్రతికార దాడిలో అబ్దుల్ అహద్, షేక్ అమీర్, షఫి మోయినొద్దీన్ ఇళ్లు పూర్తిగా దగ్ధం అయింది. నష్టం విలువ సుమారు 4 లక్షలు 50 వేలు.
పైన తెలిపినవి మాత్రమే కాక ఇంకా సుమారు 13 ఇళ్ళ పైన అల్లరి మూకలు దాడి చేయడం జరిగింది. నష్టం పాక్షికం. ఇంకా కొన్ని ద్విచక్ర వాహనాలను మరియు ఒక ఆటో దగ్ధం చేయబడింది. అదే రోజున అనగ జనవరి 13వ తేదిన హిందువులు ప్రతీకారం తీర్చకునే ప్రతికారంతో ముగ్గురు ముస్లింల ఇళ్లు దహనం చేయబడింది.
ప్రజాభిప్రాయ సేకరణ:
1) నాగేశ్వర్ తండ్రి: శంకర్ తెలిపిన వివరాల ప్రకారం ఒక వర్గం తమ ఆధిపత్యం కోసం ‘జమీన్ జిహద్‘ పేరుతోగత 8 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కుర్బాగల్లి చుట్టు ప్రక్కల మూడు మసీదులు ఉన్నవి. ఇక్కడ ఉన్న హిందువులను ఖాళీ చేయిస్తే ఆ స్థలం మొత్తం అక్కడున్న ముస్లింల సొంతమవుతుంది. అందువలన అక్కడున్న చైర్మన్ జావెద్ అహ్మద్ మరియు అతని అనుచరులు అల్లర్లు సృష్టిస్తూ. ఇంటి మీద రాళ్ళు వేయడం చేస్తూ అక్కడున్న హిందు కుటుంబాలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. దాని వలన అక్కడున్న వాళ్ళు ఇళ్ళు ఖాళీ చేసి ఆ స్థలాలను ముస్లింలకు తక్కువ ధరకు అప్ప చెప్పి వెళ్ళిపోతారని వారి అభిప్రాయం. అందుకోసం ఇలాంటి గొడవలు సృష్టిస్తున్నారు.
2) న్యాంతాబాద్ రాజేష్: ఇతడు స్థానికంగా మటన్ షాపు నిర్వహిస్తున్నాడు జనవరి 12వ తేదీన జరిగిన దహన కాండకు ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం. ఆ రోజు రాత్రి జరిగిన దహన కాండ అనేది అప్పటికప్పుడు జరిగిన గొడవ కాదు. ఎన్నో రోజుల ఆలోచనతో ఎంతో ఆలోచనతో పక్కా వ్యూహం ప్రకారం జరిగిన దాడి. ఇక్కడున్న హిందువులను ఎలాగైనా ఇళ్లు ఖాళీ చేయించాలనేది వారి వ్యూహం. అంతే కాకుండా రాజకీయంగా కూడ హిందువులకు మనుగడ లేకుండా చేయాలి అనేది వారి ఆలోచన ఇందు కోసం వారి పక్క ప్రణాళిక ప్రకారం జరిగిన దాడిగా అభివర్ణించారు.
పోలీస్ వైఫల్యం:
జనవరి 12వ తేదీన జరిగిన దహన కాండను అదుపు చేయడంలో ఖచ్చితంగా పోలీసులు వైఫల్యం అయ్యారని చెప్పవచ్చు. భైంసా మొదటి నుండి సున్నితమైన (మతపరమైన) ప్రాంతం. అంతే కాకుండా మున్సిపల్ ఎలక్షన్ సమయం కావున ఇంకా ఎక్కువ గొడవలు జరుగుతాయనే ఆలోచన అధికారపార్టీ వారికి రాకపోవడం శోచనీయం. జనవరి 12వ రాత్రి జరిగిన ఘటనలో పోలీసులు స్పందించిన వైనం శోచనీయం. ఘటన జరిగిన సమయం సుమారు రాత్రి 10-30 గం||ల ప్రాంతంలో సుమారు 10 మంది పోలీసులు మాత్రమే ఘటనా స్థలికి రావడం జరిగింది. అల్లరి మూకలు సుమారు 2000 మంది ఉన్నారు. వారు పోలీసుల పైనా రాళ్ళు రువ్వడం జరిగింది.
ఆ దాడిలో పోలీసులకు కూడ గాయాలవ్వడం శోచనీయం. అంత కర్కషంగా ముస్లింలు హిందువుల ఇళ్ళ మీద దాడి చేస్తున్న వారి ఇళ్ళను లూటీ చేస్తూ పెట్రో బాంబులు విసురుతున్న కూడ ఒక డి.ఎస్.పి. స్థాయి అధికారి కనీసం ఎయిర్ ఫైయరింగ్ చేయాలన్న కనీస విచక్షణను మరచిపోవడం నిజంగానే బాధాకరం. చివరికి పోలీసులు హిందువులను రక్షించడం కాదు వారిని వారి రక్షించుకోలేని పరిస్థితి వారిది. ఒక ఎస్.ఐ. స్థాయి అధికారి దెబ్బలు తాళలేక పడిపోతే హిందువులు ప్రాథమిక చికిత్స చేయడమనేది హృదయ విదారక సంఘటన. అక్కడున్న పోలీసులు, మరియు ఒక వర్గం టి.ఆర్.ఎస్. రాజకీయ నాయకులు కూడ ముస్లింలకు సపోర్ట్ చేసెవారె. ఇంత సంఘటన జరిగిన కూడ హిందు అబ్బాయిల మీద ఎఫ్.ఐ.ఆర్. బుక్ చేసి వారి మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి సుమారు 22 మందిని భైంసా కోర్టులో హాజరుపరచడమైనది కడు శోచనీయం.
ఇంత పెద్ద దహన కాండ జరిగినప్పటికి కూడ జావెద్ అహ్మద్, పైజల్లాఖాన్ (ఎ1), మాజిద్ బోకర్, ఇద్రిక్ బేగ్, రహామల్ మరియు అతని అనుచరులను అరెస్టు చేయకపోవడం పోలీసుల వైఫల్యంగా చెప్పవచ్చు. జనవరి 27వ తేదిన నిజనిర్ధారణ కమిటి భైంసాను. సందర్శించిన రోజు 144 సెక్షన్ అమలులో ఉండగా ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా ఎం.ఐ.ఎం పార్టీ నాయకులు మరియు అతని అనుచరులు యధేచ్చగా ర్యాలీ తీయడం అనేది ఖచ్చితంగా పోలీసుల వైఫల్యంగా చెప్పవచ్చు. అంతే కాకుండా అధికార పార్టీ నాయకుల (టి.ఆర్.ఎస్, ఎం.ఐ.ఎం) అండదండలతో హిందు అబ్బాయిల మీద అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, అక్రమ కేసులు బనాయిస్తూ, వారిని మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెడుతూ వాళ్ళ వ్యాపార సముదాయాల మీద అక్రమంగా దాడి చేస్తూ ఒక వర్గం నాయకులకు కొమ్ము కాయడమనేది నిజంగానే పోలీసుల వైఫల్యంగా చెప్పవచ్చు. అక్కడి మాజీ మున్సిపల్ చైర్మెన్ మరియు ప్రస్థుత మున్సిపల్ వైస్ చైర్మెన్ మీద రౌడిషీట్ ఉన్నా కూడ అతను యధేచ్చగా అక్రమ వసూళ్ళకు పాల్పడుతూ అటువంటి వాటి మీద కంప్లైంట్ చేసిన కేసులు రిజిష్టర్ చేయకపోవడం పోలీసుల వైఫల్యంగా చెప్పవచ్చు. బాదితుల కథనం మేరకు జావేద్ అహ్మద్ అతని అనుచరుడైన ఖాసింబేగ్ ఐఎన్ఏ ప్రేరేపిత ఉగ్రవాది అని చెప్పవచ్చు. సుమారు 8 సంవత్సరాల క్రితం కరీంనగర్ జిల్లా రేకుర్తి దగ్గర పోలీసులు జరిపిన అజం ఘోరి ఎన్కౌంటర్ లో అతని దగ్గర దొరికిన డైరీలో ఖాసీంబేగ్ పేరు ఉండడం ఎన్నో అనుమానాలకు దారితీస్తుంది.
నిఘా వైఫల్యం:
ఆదిలాబాద్ జిల్లా భైంసా సున్నితమైన ప్రాంతం అని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసినప్పటికి మునిసిపల్ ఎన్నికల నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమి పట్టనట్లు వ్యవరించింది. ముందస్తు చర్యలలో బాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిఘాను పెంచినట్లైతే ఈ అల్లర్లు జరిగే అవకాశం ఉండేది కాదు. ఇంత గొడవ జరుగుతున్నా కేవలం హిందువులను ప్రత్యేక దృష్టితో అరెస్టు చేయడం, రాష్ట్ర ప్రభుత్వ ద్వంద నీతికి అద్దంపడుతుంది.
నిజనిర్ధాణ బృందం సూచనలు, సలహాలు:
1. బైంసాలో జనవరి 12న జరిగిన మత ఘర్షణలపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో పూర్తిస్థాయి న్యాయ విచారణ జరిపించాలి.
2. మొత్తం ఘర్షణలను ముందుండి నడిపించిన ఎం.ఐ.ఎం పార్టీ నాయకుడు ఫైజుల్లాఖాన్, జావిద్దెపై ఎస్ఎఆర్.నెం.20/2020 ప్రకారం ఫైజుల్లాఖానను ఎ1 పోలీసులు పేర్కొన్నారు. కాబట్టి అతని మీద వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
3. ఎస్ఎఆర్.నెం.17/2020 ప్రకారం కూడ ఫైజుల్లాఖాన్ మీద 307 క్రింద కేసుబుక్ చేసినప్పటికి ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం శోచనీయం.
4. “జమీన్ జిహాద్” కార్యకలాపాలపై రాష్ట్రప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరిపి భైంసా ప్రజలకు న్యాయం చేయాలి.
5. మత ఘర్షణలకు నిలయాలుగా మారుతున్న అన్ని ప్రార్థనా మందిరాలలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సిసి కెమెరాలు అమర్చాలి.
6. ఆస్తి నష్టం జరిగిన ఇరువర్గాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తక్షణం సహయం అధించాలి.
7. ఎలాంటి అనుమతి లేకుండా (బాధితుల చెప్పినదాన్ని ప్రకారం) ఇస్తామా మీటింగ్ జరపడానికి సహకరించినరాజకీయ పార్టీ నాయకులపై వెంటనే విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలి.
8. సున్నితమైన బైంసాలో ఇకముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా తగు చర్యలు తీసుకోవాలి.
9.నిజనిర్ధారణ బృందం విచారణలో వెలుగులోకి వచ్చిన అక్రమ ప్రవేశాలు తదితర విషయాలను బట్టి భైంసాలో ఆకస్మిక తనిఖీ నిర్వహించి తగు ఆధరాలు లేని వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలి.
భైంసా అల్లర్లకు సంబందించిన వార్తలకు క్రింది లింకులను క్లిక్ చేయండి:
భైంసాలో బీభత్సం: ఇళ్ళు దగ్ధం.. ఉద్రిక్త పరిస్థితులు
http://vsktelangana.org/bhaimsa-in-terror-houses-are-burning-tension-conditions/
భైంసా మతహింస బాధితులకు సేవాభారతి ఆపన్నహస్తం
http://vsktelangana.org/bhaimsa-badhitulaku-sewa-bharati-aapanna-hastham/
Mob attacks Hindu homes in Bhainsa, Telangana
http://vsktelangana.org/mob-attacks-hindu-homes-in-bhainsa/
Whistleblower who blew the lid on Telangana govt attempts to cover up Bhainsa violence targeted with FIRs
http://vsktelangana.org/whistleblower-who-blew-the-lid-on-telangana-govt-attempts-to-cover-up-bhainsa-violence-targeted-with-firs/