Home News ఒరిస్సా రైలు ప్ర‌మాదం: సహాయక చర్యలలో ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ కార్యకర్తలు 

ఒరిస్సా రైలు ప్ర‌మాదం: సహాయక చర్యలలో ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ కార్యకర్తలు 

0
SHARE
ఒడిశాలోని బాలాసోర్‌లో జూన్ 2న జరిగిన సంఘటన ఊహించనంత దారుణమైనది. ఈ ఘటనలో ప్రమాద స్థలం నుంచి మరణాల సంఖ్య పెరుగుతున్నట్లు నివేదికలు అందాయి. ఇప్ప‌టి వరకు బాలాసోర్‌లో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంలో 288 మంది మరణించగా, వెయ్యిమందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఊహించని ఘటన గురించి తెలుసుకున్న వెంటనే  ప్రధాని, రైల్వే మంత్రి తదితరులు ఘటనాస్థలికి చేరుకుని బాధితులను పరామర్శించారు.
ఒక్క ప్రాణం కూడా పోకుండా రక్షించడమే ధ్యేయంగా ఆ సమయంలో రెస్య్కూ సిబ్బంది స‌హ‌య‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మ‌య్యారు. అలాంటి విపత్కర సమయంలో సంఘ కార్యకర్తలు కూడా ప్రమాదస్థలంలో ఉండి, బాధితులకు రక్షణగా నిలిచారు. సంఘటన జరిగినప్పటి నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వహిందూ పరిషత్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కు చెందిన వెయ్యి మందికి పైగా కార్యకర్తలు, స్వయంసేవకులు నిర్విరామంగా రాత్రింబవళ్లు కలిసి పనిచేశారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ సీనియర్ కార్యకర్త లక్ష్మీ చెబుతూ బాలాసోర్ ఆసుపత్రిలో తమ బంధువులు, కుటుంబ సభ్యులను గుర్తించడంలో 600మంది కార్యకర్తలు ప్రజలకు సహాయం చేస్తున్నారనీ, బాధితులు తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసుకునేందుకు వీలుగా వారికి టెలిఫోన్ సౌకర్యం, మొబైల్ అందిస్తున్నారనీ చెప్పారు. బాధిత కుటుంబాల‌కు ఆహారం, నీరు, కనీస అవసరాలను అందిస్తున్నారు. రెస్క్యూ సిబ్బందికి, రైల్వే అధికారులకు, NDRF బృందాలకు సంఘ స్వ‌యంసేవ‌కులు సహాయం చేశారని వారన్నారు.
కొంతమంది కార్యకర్తలు బాలాసోర్ ఆస్ప‌త్రిలో ఉండి, మృతదేహాలను వారి వారి స్వస్థలాలకు పంపించడంలో అంబులెన్స్ డ్రైవర్లకు, ఆస్ప‌త్రి సిబ్బందికి సహాయం చేస్తున్నారు. పట్టణంలోని ఇతర ఆస్ప‌త్రుల్లో మృతదేహాలను మార్చరీకి తరలిస్తున్నారు. ప్రతి బస్టాండ్లలో, చౌక్ లలో, ఆహారం, నీరు, ప్రథమ చికిత్స, ఫోన్ సౌకర్యం కల్పించేలా కార్యకర్తలు ఉన్నారు. ఘటనలో గాయపడిన వారికి, బాధితులందరికీ సహాయాన్ని అందించి వారు తిరిగి కోలుకునేందుకు అన్ని రకరాల చర్యలను చేపట్టారు.
సంఘ , ABVP అధికారిక సోష‌ల్ మీడియా ఖాతాల నుండి హెల్ప్‌లైన్ నంబర్‌లను జారీ చేశారు. వారు బ్లడ్ బ్యాంక్, రక్త సేకరణ కోసం నంబర్లను కూడా జారీ చేశారు. ఘటన జరిగినప్పటి నుంచి వారికి రక్తదానం కోసం 2000 కాల్స్ వచ్చాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో వెయ్యి యూనిట్ల రక్తాన్ని అందించామని, 700 యూనిట్ల రక్తం తదుపరి ఉపయోగం కోసం సురక్షితంగా ఉందని వారు తెలిపారు.
ప్ర‌మాదానికి సంబంధించి పోలీసులు అన్ని ర‌కాలుగా విచార‌ణ ప్రారంభించారు. బహానగా బజార్ రైల్వే స్టేషన్‌లో సైతం అధికారుల తనిఖీలు చేస్తున్నారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ప్ర‌మాదానికి సంబంధిచి పూర్తి వివరాలు  సీబీఐ దర్యాప్తులో తేలాల్సి ఉంది.