ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షల ఎకరాల దేవాదాయ శాఖ భూములు ఆక్రమణకు గురైనట్టు రాష్ట్ర ఎండోమెంట్స్ కమిషనర్ అర్జున్‌రావు తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ఆలయ ఇఓలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు చెందిన దాదాపు నాలుగు లక్షల ఎకరాల భూమిని రక్షించడానికి చర్యలు తీసుసుకోనున్నట్టు తెలిపారు. ఆలయ భూములన్నింటినీ గుర్తించడానికి ఎండోమెంట్స్, రెవెన్యూ అధికారులు డిసెంబర్ 21 నుంచి సంయుక్త సర్వే నిర్వహించనున్నట్టు తెలిపారు.
సింహాచల ఆలయ భూ సమస్యను ప్రస్తావిస్తూ, శ్రీ వరాహ లక్ష్మినరసింహ స్వామి వారి దేవస్థానానికి చెందిన 459 ఎకరాల్లో 10,000 మందికి పైగా ఇళ్ళు నిర్మించుకున్నారని, ఈ భూములను క్రమబద్ధీకరించడానికి 1,000 ఎకరాల ప్రత్యామ్నాయ భూమిని సింహాచలం దేవస్థానానికి అందించాలని ఆయన అన్నారు. రైతుల ఆధీనంలో ఉన్న1,500 ఎకరాల సింహాచలం భూములకు సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కోవిడ్ కారణంగా ఎండోమెంట్స్ ఆదాయం తగ్గడంతో ఆలయ సిబ్బంది పెండింగ్‌లో ఉన్న జీతాలు దశలవారీగా చెల్లిస్తామని అర్జునురావు హామీ ఇచ్చారు.
Source : Indian Express