కాశ్మీర్ విషయంపై పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకోవడం లేదు. కాశ్మీర్ తమ భూభాగంలో ఉన్నట్టు చిత్రీకరిస్తూ ఇటీవల ఆగస్టు నెలలో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒక పొలిటికల్ మ్యాప్‌ను ఆమోదించారు. కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమేనని భారత్ తో పాటు ప్రపంచమంతా అంగీకరిస్తోంది. ఈ విషయంలో పాకిస్తాన్ అక్కడి ప్రజల్ని మభ్యపెట్టి వారిని తప్పుదోవ పట్టించేందుకు కుట్రలకు పాల్పడుతోంది. తాజాగా పాకిస్తాన్ మరో కుట్రకు తెరలేపింది. కాశ్మీర్ తమ దేశ భూభాగమేని పాకిస్తాన్ పొలిటికల్ మ్యాప్‌ను రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే వార్తలకు ముందు ప్రదర్శించాలని పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (PEMRA) అన్ని వార్తా చానెళ్లలను ఆదేశించింది. ఈ మేరకు పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. దీని వల్ల కాశ్మీర్ తమ దేశ భూభాగమే అని ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే విధంగా పాకిస్తాన్ దుశ్చర్యలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఆ దేశ మీడియాపై కూడా ఆంక్షలు విధించింది.
పాకిస్తాన్‌లోని మీడియా అథారిటీ తన వివిధ ఆదేశాల ద్వారా వార్తా ఛానెల్‌లను కట్టడి చేయడానికి ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది మార్చిలో PEMRA దేశ వ్యతిరేక వార్తలపై నిరాధారమైన వ్యాఖ్యలు ప్రసారం చేయకూడదని అన్ని వార్తా చానెళ్ల, శాటిలైట్ ఛానెళ్లను ఆదేశించింది. అటువంటి వార్తలను ప్రసారం చేయడం PEMRA – 2007(సవరణ) చట్టం, PEMRA-2009 చట్ట నిబంధనలను ఉల్లంఘించడం అవుతుందని రెగ్యూలెటర్ ఆథారిటీ పేర్కొంది.
టీవీ ఛానెళ్లలో జరిగే డిబెట్, టాక్ షోలలో యాంకర్లు తమ అభిప్రాయాలను తెలియజేయడాన్ని నిషేదిస్తూ 2019లో PEMRA ఆదేశాలను జారీ చేసింది. ప్రతి పాకిస్తానీ పౌరుడికి వాక్ స్వాతంత్య్ర హక్కును కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 19ని ఈ ఆదేశం ఉల్లంఘించిందని… దీనికి వ్యతిరేకంగా 11 మంది టీవీ యాంకర్లు లాహోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతిమంగా టీవీ యాంకర్లపై ఎలాంటి ప్రతికూల చర్యలు తీసుకోకుండా ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటర్‌ను కోర్టు నిషేధించింది. అయిన్పటికీ పాక్ ప్రభుత్వం తన వైఖరి ని మార్చుకొకుండా తన దేశంలోని మీడియాను నియంత్రిచడంతో పాటు సున్నితమైన కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తి పాకిస్తాన్ వక్రబుద్ధి మరోసారి నిరూపించుకుంది.