Home News చ‌ట్ట‌విరుద్దంగా ఆక్ర‌మించిన భూముల్ని ఖాళీ చేయాలి : పాకిస్తాన్‌కు భార‌త్ హెచ్చ‌రిక‌

చ‌ట్ట‌విరుద్దంగా ఆక్ర‌మించిన భూముల్ని ఖాళీ చేయాలి : పాకిస్తాన్‌కు భార‌త్ హెచ్చ‌రిక‌

0
SHARE

భార‌త్ కు చెందిన భూ భాగాన్ని పాకిస్తాన్ చ‌ట్ట విరుద్ధంగా, బ‌ల‌వంతంగా ఆక్ర‌మించ‌డాన్ని భార‌త్ తిర‌స్క‌రించింది. ఆ భూముల్ని వెంట‌నే ఖాళీ చేయాల‌ని హెచ్చ‌రించింది. జ‌మ్ము కాశ్మీర్‌, ల‌డ‌క్ ప్రాంతంలో గిల్గిత్‌-బాల్టిస్తాన్ అని పిలువ‌బడే ప్రాంతానికి తాత్కాలిక ప్రాంతీయ‌ హోదాను కల్పిస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రాంత పర్యటనలో భాగంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గిల్గిట్, బాల్టిస్తాన్‌ను ఐదో ప్రావిన్స్‌గా ప్రకటించారు. ఈ చ‌ర్య‌ను భార‌త్ తీవ్రంగా ఖండించింది. ఇది భారత భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నమేనంటూ భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీ వాస్తవ పాకిస్తాన్‌పై మండిప‌డ్డారు. జమ్మూకాశ్మీర్‌, లడఖ్‌తో పాటు, గిల్గిత్, బాల్టిస్తాన్ మొత్తం ప్రాంతం కూడా భారత్‌లో అంతర్భాగమేనని అనురాగ్ శ్రీవాస్తవ పునరుద్ఘాటించారు. చట్ట విరుద్దంగా.. బలవంతంగా ఆక్రమించిన భూభాగాలపై పాకిస్తాన్‌కు ఎలాంటి అధికారం లేదని పేర్కొన్నారు. గిల్గిత్‌-బాల్టిస్తాన్‌ ప్రాంతంలో 70ఏండ్లుగా మానవహక్కుల ఉల్లంఘన జరగుతోంద‌ని, దోపిడీ చేసి స్వేచ్ఛను హరిస్తోందని ఆయ‌న మండిప‌డ్డారు. అయితే ఇలాంటి దురాక్రమణల వల్ల ఈ ప్రాంతంలోని నిజాలను ఎవరూ దాచలేరని ఆయన పేర్కొన్నారు. భారత భూభాగాల స్థితిని మార్చే బదులు.. వారి ఆక్రమణలో ఉన్న అన్ని ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయాలని పాకిస్థాన్‌కు భారత్ హెచ్చరించింది.

source : Indus Scrolls