Home News ‘పంచ ప‌రివ‌ర్త‌న్’ తో స‌మాజంలో పరివర్తన

‘పంచ ప‌రివ‌ర్త‌న్’ తో స‌మాజంలో పరివర్తన

0
SHARE

సమాజంలో పరివర్తన తీసుకునిరావడానికి 5 విషయాలను ఆచరించినట్లయితే సమాజంలో పరివర్తన జరుగుతుందని ఆర్.ఎస్.ఎస్ దక్షిణ మధ్య సహ క్షేత్రప్రచారక్ భరత్ కుమార్ జీ అన్నారు.

1. సామాజిక సమరసత

సమాజంలోని వారందరూ భరతమాత బిడ్డలే. కుల, వర్గ, మత ప్రాదిపదికన విడిపోకుండా అందరం కలసి ఒకరినొకరిని గౌరవించుకుంటూ జీవించాలి. సమాజంలోని అందరూ సమానమే అనే భావనతో జీవించాలి. శ్రీరాముడు వనవాస సమయంలో గుహునితో, శబరితో వ్యవహరించిన తీరు ఎప్పటికీ మరువరానిది. ఆచరణ యోగ్యమైనది. శ్రీరామునిలా సమాజంలోని అందరూ సమానమే అనే భావనతో జీవించాలి.

2. కుటుంబ ప్రబోధన్

మన పిల్లలకు విలువైన వస్తువులను ఇస్తున్నాం. కానీ విలువైన జీవన విలువలను ఇవ్వడంలేదు. జీవన విలువలను పాఠశాల, కుటుంబాలద్వారా మన పిల్లలకు అందించడంవలన భావి తరాలకు అందుతాయి.

3. పర్యావరణ పరిరక్షణ

హిందువులు ప్రకృతి ఆధారంగా జీవిస్తున్నారు. మొక్కలు నాటడం ద్వారా ప్రకృతిని కాపాడుకోవాలి. వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. ప్లాస్టిక్ వాడకం ఆపేయాలి. దాని ద్వారా ప్రకృతిని రక్షించుకోగలం.

4. మన భాషను -వేషధారణను

మనదైన సంస్కృతిని కాపాడుకోవాలి. మాతృభాషను, మాతృదేశాన్ని గౌరవించాలి.

5. పౌరనియమాలు

ఒక పౌరుడిగా మన బాధ్యతను మనం నిర్వర్తించాలి. ఒకరు చూస్తున్నారనో లేదా చూడడం లేదనో మనం ప్రవర్తించ కూడదు. శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాస కాలంలో తాను నిర్వర్తించవలసిన కర్తవ్యాన్ని ఎవరు చూసినా, చూడకపోయినా నిర్వర్తించారు. (ఉదా: వనవాస కాలంలో నగరాలకు, గ్రామాలకు శ్రీరాముడు వెళ్ల కూడదు. అలా కిష్కింధకు వెళ్లి నప్పుడుగాని, లంకకు వెళ్లినప్పుడు గాని ఎవ్వరి ఇళ్లకు వెళ్లలేదు. చివరికి ఆ నగరంలో కూడా ప్రవేశించ లేదు) మనం ప్రభుత్వ నియమనిబంధనలను, విధానాలను గౌరవించాలి.

ఆర్ఎస్ఎస్ సమాజాన్ని సంఘటిత పరచి, సమాజంలో చైతన్యాన్ని తీసుకువచ్చి ప్రతి వ్యక్తిలో దేశభక్తి భావనను నింపి తద్వారా ఈ దేశాన్ని ‘విశ్వ గురువు’గా నిలబెట్టడానికి మనమందరం మనవంతు కృషిని సల్పుతూ కలసి పనిచేద్దాం అని భరత్ పిలుపునిచ్చారు.