Home News “పరతంత్రం పై స్వతంత్రపోరాటం” పుస్త‌క ఆవిష్క‌ర‌ణ 

“పరతంత్రం పై స్వతంత్రపోరాటం” పుస్త‌క ఆవిష్క‌ర‌ణ 

0
SHARE
స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా “భారత ఋషి పీఠం” పత్రిక 2021 ఆగస్టు నుండి ధారావాహికగా ప్రచురించిన వివిధ రచయితల వ్యాసాల సంకలనాల‌ను “పరతంత్రం పై స్వతంత్రపోరాటం” అనే పేరుతో పుస్త‌కాన్ని ప్ర‌చురించారు. ఈ పుస్తకావిష్కరణ సభ ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్, భారతీయ ఇతిహాస సంకలన సమితి, చేతనా స్రవంతి సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని కొత్తపేట బాబు జగ్ జీవన్ రామ్ భవన్ లో జరిగింది. ఋషిపీఠం వ్యవస్థాపక సంపాదకులు, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు గారు పుస్త‌కాన్ని ఆవిష్క‌రించి మాట్టాడారు. రాబోయే అమృత కాలంలో మరొక స్వతంత్ర ఉద్యమం జరగాల‌ని అది భారతీయతకు ప్రతీక కావాల‌న్నారు. హిందుత్వం అనేది భారతీయతకు పర్యాయ పదమే అన్నారు. మోక్షం కంటే గొప్పది, భారతీయత కొరకు జీవించడమేని దేశ క్షేమమే మన లక్ష్యం కావాలన్నారు  దేశం స్వాతంత్య్రం పొందిన రోజే, దేశం ముక్కలైంద‌ని, ఇప్పటికి ఈ శక్తులు పాచ్యత్య శక్తుల సహాయంతో ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయ‌న్నారు.

అఖండ భారతమే మన లక్షమే, కానీ ఉన్న దేశాన్ని విచ్చినం చేసే శక్తులు మన మధ్యనే  ఉన్నాయ‌ని వాటితో జాగ్రత్తగా ఉండాల‌ని వారు సూచించారు. ఒక వైపు భగవంతుని ప్రార్థిస్తూనే, దేశ అభివృద్ధిలో మనం దేశహితమే కొరకే మన ప్రయత్న లోపం లేకుండా చిత్త శుద్ధితో పని చేస్తే దైవ శక్తి ఆశీస్సులు కూడా మనకు ఉంటాయ‌న్నారు.

కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా పాల్గొన్న రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్, దక్షిణ మధ్య సహ క్షేత్ర ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ గారు మాట్లాడుతూ భారత్ స్వాతంత్ర్య పోరాటంలో తమ జీవితాలను త్యాగం చేసిన తిలక్, భగత్ సింగ్, రాజగురు, సుఖఃదేవ్, ఆజాద్, ఝాన్సీల‌క్ష్మీ బాయ్ లాంటి వీరోచిత వీరుల బలమైన కాంక్షను మనం చదువుకున్నామ‌న్నారు. దేశ విభజనను ఆస్తి పంపకం గా భావించిన కొంత మంది కుహున మేధావులు, హిందువుల ఊచకోతను మర్చిపోవద్దని అన్నారు. దేశం గురుంచి జీవించడమా, దేశంలో బతకడమా, అనేది మనం ఆలోచిస్తూ సవాళ్ళను, సమస్యలకు పరిష్కారం దిశగా  మన జీవనం ఉండాలని కోరారు.