Home News చంద్రయాన్ -3 విజ‌యంలో మణిపూర్ శాస్త్రవేత్తలు

చంద్రయాన్ -3 విజ‌యంలో మణిపూర్ శాస్త్రవేత్తలు

0
SHARE

చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 అడుగు పెట్టిన సంద‌ర్భంగా దేశం మొత్తం సంబరాలు చేసుకుంటోంది. చంద్ర‌యాన్ మిషన్ విజ‌య‌వంతం కావ‌డంతో శాస్త్ర‌వేత్త‌ల బృందంలో ఉన్న‌ ఇద్దరు మణిపూర్ శాస్త్రవేత్తల కృషికి ఆ రాష్ట్రం ఎంతో గర్వప‌డుతోంది.

మ‌ణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లా తంగాకు చెందిన డాక్టర్ రఘు నింగ్‌థౌజం చంద్రయాన్-3 విజ‌యంలో ఎంత‌గానో కృషిచేసిన ఇస్రో శాస్త్రవేత్తలలో ఒకరు. డాక్టర్ రఘు ఇండియన్ ఇన్‌స్టిట్టూట్ ఆఫ్ సైన్స్‌(IISc) బెంగళూరు, IIT-గౌహతి, ఇంఫాల్ లో DM కాలేజ్ ఆఫ్ సైన్స్ లో విద్యాభ్యాసం పూర్తి చేశాడు.  ఈ మిషన్ వెనుక మణిపూర్ మూలానికి చెందిన మరో శాస్త్రవేత్త, అస్సాంలోని సిల్చార్‌కు చెందిన వై బిషల్ సింఘా కూడా రాష్ట్రం గర్వపడేలా చేశారు. వై బిషల్ సింఘా  IIT గౌహతిలో విద్యాభ్యాసం త‌ర్వాత ISROలో థర్మల్ సిస్టమ్స్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు.

ఈ సంద‌ర్భంగా మ‌ణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ట్విట్ట‌ర్ ద్వారా త‌న అభినంద‌న‌ల‌ను వ్య‌క్తం చేశారు. “మణిపూర్ బిష్ణుపూర్‌కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ రఘు నింగ్‌థౌజం చంద్రయాన్ – 3 ల్యాండింగ్ మిషన్‌లో భాగ‌స్వామ్య‌వ‌డం సంతోషకరమైన విషయం. అప్పుడప్పుడు ఎదురయ్యే స‌మ‌స్య‌లు మన 2వేల  ఏళ్ల చరిత్రను తుడిచివేయలేవు. స‌మ‌స్య‌ల‌తో సంబంధం లేకుండా, మణిపూర్ ప్రజలు ఎల్లప్పుడూ బలంగా పుంజుకుంటారు. చంద్ర‌యాన్ 3 చంద్రుడి ద‌క్షిణ దృవంపై దిగిన‌ ఘనతను సాధించడానికి భారతదేశాన్ని ప్ర‌పంచ‌మంతా మార్గదర్శక దేశంగా గుర్తించిందని. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో చాలా మంది యువకులకు స్ఫూర్తినిస్తుంది  అని సిఎం బిరెన్ పేర్కొన్నారు.

ISRO బృందాన్ని అభినందిస్తూ, లోక్‌తక్ డెవలప్‌మెంట్ అథారిటీ (LDA) చైర్మన్ M అస్నికుమార్ సింగ్ మాట్లాడుతూ, విజయవంతమైన చంద్రయాన్-3లో కీలక సభ్యుడైన ISRO శాస్త్రవేత్త రఘు నింగ్‌థౌజం ఒక నిరాడంబరమైన మత్స్యకార కుటుంబానికి చెందినవారు కావడం స్ఫూర్తిదాయకమని అన్నారు.