Home News దేశ విభ‌జ‌న బాధ‌ల‌ను ఎప్ప‌టికీ మ‌రిచిపోలేము : ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ

దేశ విభ‌జ‌న బాధ‌ల‌ను ఎప్ప‌టికీ మ‌రిచిపోలేము : ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ

0
SHARE

1947 ఆగ‌స్టు 14న జ‌రిగిన దేశ విభ‌జ‌న విషాధాన్ని ఎప్ప‌టికీ మ‌రిచిపోలేమ‌ని ప్ర‌ధాని మోడీ అన్నారు. అప్పుడు జ‌రిగిన ఘోరాన్ని గుర్తు చేసుకుంటూ ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ లో ఒక ట్వీట్ చేశారు.

“దేశ విభజన బాధలను ఎప్పటికీ మర్చిపోలేము. ఆ స‌మ‌యంలో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ద్వేషం, హింస కారణంగా చాలామంది ప్రాణాల‌ను కూడా కోల్పోయారు. మన ప్రజల పోరాటాలు, త్యాగాల జ్ఞాపకార్థం, ఆగస్టు 14ను విషాధ‌క‌ర‌మైన విభజన దినంగా పాటిస్తారు. సామాజిక విభజన, అసమానత అనే విషాన్ని తొలగించి, ఏకత్వం, సామాజిక సామరస్యం, మానవ సాధికారత స్ఫూర్తిని మరింత బలోపేతం చేయవలసిన అవసరాన్ని ఈ రోజు గుర్తు చేస్తూనే ఉంటుంది” అని ప్ర‌ధాని మోడీ ట్వీట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

ఈ విషాధ ఘ‌ట‌న‌ల్లో ల‌క్ష‌లాది మంది ప్రాణాలు కొల్పోయారు. ఎంతో మంది నిరాశ్రయుల‌య్యారు. దిక్కుతోచ‌ని ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నారు. NWFP ప్రాంతం- 5% మాత్రమే హిందూ జనాభా ఉన్న ‘కోహాట్’ అనే చిన్న ఊరులో 150మంది హిందువులను ఊచకోత కోశారు. మిగిలిన వారు కట్టుబట్టలతో 320కి.మీ దూరంలో ఉన్న రావల్పిండి పారిపోయారు.

ఆ త‌ర్వాత జిన్నా హిందువుల మీద జిహాద్ ప్రకటించాడు. సింద్, బెంగాల్ ప్రదేశాల్లో/రాష్ట్రాల్లో, 16ఆగస్ట్ సెలవు ప్రకటించి మరీ, జిహాదీ మూకలు హిందువులను దొరికినవారిని దొరికినట్టే ఊచకోతకి గురిచేసారు. ఈ రాష్ట్రాల్లో, 70%పొలీసులు ముస్లిములైనందువల్ల, వారు ఆ మూకలతో కలిసిపోయారు. బెంగాల్లో ప్రధాని సుహ్రావర్ది పాల్గొన్న సమావేశంలో, వక్తలందరూ హిందువులపై జిహాద్ చేయమని పిలుపునిచ్చారు. హిందువులు ఎదురుతిరగగానే, సైన్యాన్ని రప్పించారు. ఒక్క కలకత్తా మహానగరంలోనే 10000 స్త్రీపురుషులని చంపేశారు, 15000మంది గాయపడ్డారు, 1లక్షకిపైగా ప్రజలు నిర్వాసితులయారు.

తరువాత నౌఖలిలో మారణకాండ మొదలు పెట్టారు. స్త్రీల ముందే త‌మ భ‌ర్త‌లు హత్య చేసి, ఆ స్త్రీలనే బలవంతంగా మతమార్పిడి చేసి, వారి భర్తలను చంపినవారితోనే వారికి పెళ్లిళ్లు చేసారు. ముల్లాలు, మౌల్వీలు జిహాదీలతో పాటు ఉండి, మతమార్పిడిలు చేయించారు.

అల్లర్లు బెంగాల్ నుంచి బిహార్ కు పాకాయి, అయితే వ్యత్యాసం ఏమిటoటే, బెంగాల్ ప్రభుత్వం జిహాదీలకు తోడ్పడగా, బిహార్లో అలా జరగలేదు. లీగ్ `ప్రత్యక్షచర్య’ కాశ్మీరుకి, NWFPకి చేరుకుంది. ఖాల్సా అనే గ్రామంలో, సుదీర్ఘ పోరాటం తరువాత, హిందూ-సిక్ఖు పురుషులందరూ హత్యకు గురికాగా, శ్రీమతి లాజవంతి ముందు నడవగా తమ మానరక్షణకై 74మంది స్త్రీలు బావిలో దూకి ఆత్మాహుతి చేసుకున్నారు. ఇలా ఎన్నో దారుణ‌మైన ఘ‌ట‌న‌లు ఆనాడు చోటు చేసుకున్నాయి.

దేశ విభ‌జ‌నకు ముందు 15 రోజుల పాటు జ‌రిగిన కీల‌క‌ ప‌రిణామాల‌కు సంబంధించిన పుస్త‌కం “ఆ 15 రోజులు” ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో విడుద‌ల అయింది. ఈ పుస్త‌కం సాహినికేత‌న్ లో ల‌భ్య‌మవుతోంది. అలాగే hindueshop వెబ్‌సైట్‌లో https://www.hindueshop.com/product/aa-15-rojulu/ ఈ లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు.