Home News బాలికపై అత్యాచార యత్నం చేసిన పాస్టర్ అరెస్ట్

బాలికపై అత్యాచార యత్నం చేసిన పాస్టర్ అరెస్ట్

0
SHARE
బాలికపై అత్యాచారయత్నం  చేసిన ఓ పాస్టర్ ను వైజాగ్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకెళ్తే  వైజాగ్ లోని గాజువాకకు చెందిన నాని బాబు ఒక చర్చి లో పాస్టర్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే గత సోమవారం ముగ్గురు మైనర్ బాలికల తో కలిసి ఓ గ్రామానికి వెళ్లారు.  మరుసటరోజు ఉదయం అందరూ కలిసి పాస్టర్ ఇంటికి వచ్చారు. అందులో ఇద్దరు అమ్మాయిలు తమ ఇంటికి వెళ్ళగా.. మరో అమ్మాయి తన తండ్రి వచ్చే వరకు అక్కడే ఉండి పోయింది. ఇదే అదునుగా భావించిన పాస్టర్ బాలిక పై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.  బాలిక అతని నుంచి తప్పించుకుని వెళ్లిపోయింది. ఘటన పై బాలిక తల్లిదండ్రుల తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.