Home News రాజ్యాంగం నుండి ‘సోషలిస్ట్’, ‘సెక్యులర్’ పదాలను తొలగించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు

రాజ్యాంగం నుండి ‘సోషలిస్ట్’, ‘సెక్యులర్’ పదాలను తొలగించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు

0
SHARE
రాజ్యాంగ పీఠిక నుంచి ‘సోషలిస్ట్’, ‘సెక్యులర్’ పదాలను తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ రెండు పదాలు 1977 ఎమర్జెన్సీ సమయంలో అప్రజాస్వామికంగా, పార్లమెంటులో ఎలాంటీ చర్చ లేకుండా ప్రతిపక్ష నాయకులందరూ జైల్లో ఉన్నప్పుడు చేర్చారనీ,  వీటిని తొలగించాలని న్యాయవాదులు బలరాం సింగ్,  కరుణేశ్ కుమార్ శుక్ల, విష్ణు శంకర్ జైన్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
భారత రాజ్యాంగంలోని పీఠికలో ‘సోషలిస్ట్’, ‘సెక్యులర్’ అనే భావన గణతంత్ర స్వభావాన్ని విస్తరిస్తోందని, ఇది ప్రభుత్వ సార్వభౌమ అధికారాలకు మాత్రమే పరిమితం చేయాలని, సాధారణ పౌరులకు, రాజకీయ పార్టీలకు, సామాజిక సంస్థలకు ఇది వర్తించదని పిటిషనర్లు సుప్రీంకోర్టుకు విన్నవించారు.
ఈ రెండు పదాలు అసలు రాజ్యాంగంలో లేవని ఎమర్జెన్సీ విధించినప్పుడు 1977 జనవరి 3న 42 రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్ లో ఎలాంటీ చర్చ లేకుండా వీటిని ఆమోదించినట్టు తమ పిటిషన్లో పేర్కొన్నారు.
రాజ్యాంగ పరిషత్ సభ్యులు కె.టి.షా సెక్యులర్ అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చాలని మూడుసార్లు ప్రతిపాదించారు. మొదట 1948 నవంబర్ 15న లౌకిక అనే పదాన్ని చేర్చాలని ఆయన ప్రతిపాదించారు. రెండోసారి 1948 నవంబర్ 25న మూడవసారి డిసెంబర్ 3న ప్రతిపాదించాడు. ఈ మూడు సార్లు రాజ్యాంగ పరిషత్ దీనిని తిరస్కరించింది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కూడా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు.
సోషలిజం, లౌకికవాదం ప్రభుత్వ పనితీరుకు మాత్రమే పరిమితం కావాలి
రాజ్యాంగంలోని  14, 15 మరియు 27 ఆర్టికల్స్ ప్రకారం ప్రభుత్వం మతం, భాష, కులం, స్థలం, వర్ణ ప్రాతిపదిక మీద వివక్ష చూప కూడదని ఈ ఆఅధికారణాలు చెబుతున్నాయి. కానీ అధికరణం 25 పౌరులకు మత స్వేచ్ఛ హక్కును కల్పిస్తోంది. దీని ప్రకారం ఒక వ్యక్తి తన మతాన్ని విశ్వసించే మరియు ప్రోత్సహించే స్వేచ్ఛను కలిగి ఉంటాడు. ప్రభుత్వం లౌకికంగా ఉండగలదని కానీ వ్యక్తులకు ఇది వర్తించదని న్యాయవాదులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. ప్రజా ప్రజా ప్రతినిద్య చట్టం (1951) లోని సెక్షన్ 29 ఏ (5) నుండి సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలను తొలగించాలని పిటిషన్ డిమాండ్ చేసింది.
ప్రజా ప్రాతినిధ్యం చట్టం ప్రకారం రాజకీయ పార్టీలు లౌకికవాద సూత్రాలను అనుసరిస్తారని పార్టీ  రిజిస్ట్రేషన్  సమయంలో ప్రకటించాలి. సెక్షన్ 123 ప్రకారం మతం ప్రాతిపదికన ఓట్లు అభ్యర్థించకూడదని చట్టం చెబుతోంది. అయితే దీని అర్థం మతం ప్రాతిపదికన సంస్థలు ఏర్పాటు చేసుకోలేమని కాదు.
కులం, మతం, భాష మొదలైన వివక్షల కారణంగా గతంలో ఎన్నో అన్యాయాలు జరిగాయని 2017లో సుప్రీంకోర్టులో విచారించిన అభిరామ్ సింగ్ కేసులో జస్టిస్ డి వై చంద్ర చూడ్ ఇచ్చిన తీర్పును పిటిషన్ లో ప్రస్తావించారు.
సామాన్య ప్రజలను సోషలిజం మరియు లౌకికవాద సూత్రాలను అనుసరించాలని బలవంతం చేసే హక్కు ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు ప్రకటించాలని పిటిషర్లు కోరారు.
Source: Organiser