Home News విశ్వహిందూ పరిషత్ పత్రికా ప్రకటన

విశ్వహిందూ పరిషత్ పత్రికా ప్రకటన

0
SHARE

కొత్తఢిల్లీ, జూలై 25,2020

విషయం : అయోధ్య రామమందిర నిర్మాణ ప్రారంభ పూజా కార్యక్రమం రోజున కరోనా నియమాలను పాటిస్తూ ఉత్సవంగా జరుపుకొనుట గురించి.

రామజన్మభూమిలో మందిర పునర్నిర్మాణం కోసం భగవంతుని ఆరాధన ఏరకంగా చెయ్యాలి అనే దాని గురించి విశ్వహిందూ పరిషత్ సమగ్ర కార్యాచరణ రూపొందించింది.

దీని ప్రకారం రానున్న ఆగష్టు 5 వ తేదీన (బుధవారం) గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారు సాధుసంతులు,వేద పండితులు,ట్రష్టు సభ్యులు మరియు ఇతర విశిష్ట అతిధులతో కలిసి జన్మభూమిలో విరాజమానమైవున్న భగవాన్ రామునికి విశేషమైన పూజలు చేస్తారు.ఈ చారిత్రకమైన ఘట్టాన్ని మొత్తం భారతదేశమే కాక యావత్  ప్రపంచం దూరదర్శన్ ప్రత్యక్ఛ ప్రసారం ద్వారా వీక్షించనుంది.

దేశం నలుమూలలలోని పవిత్ర నదులనుంచి సేకరించిన జలాలను, మరియు పుణ్య క్ఛేత్రాలనుంచి సేకరించిన మృత్తికను ఈ పూజా కార్యక్రమంలో వినియోగిస్తారు.

శ్రీరామ జన్మభూమి లోని ఈ దేవాలయము సామాజిక సమరసతను, జాతీయ సమైక్యతను,దేశ సార్వభౌమికతను, మరియు హిందువులలో హిందుత్వభావనను జాగ్రుతం చెయ్యటానికి శాశ్వతము,అమరము,చిరంతనము అయున ప్రతీకగా శోభాయమానంగా విరాజిల్లుతుంది.

శతాబ్దాల అవిశ్రాంత పోరాటం తర్వాత కోటానుకోట్ల రామభక్తుల ఆశయ, ఆకాంక్షలు నెరవేరుతున్న ఈ పవిత్ర సుభ సందర్భంలో విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి శ్రీ మిలింద్ పరాండే రామభక్తులకు ఈ క్రింది పిలుపు నిస్తున్నారు.

2020 ఆగష్టు 5 బుధవారం రోజున ఉ.10.30 ని లకు పూజ్య సాధుసంతులు వారి వారి పీఠాల్లో, ఆశ్రమాల్లో, మరియు దేశ విదేశాలలో నివసిస్తున్న భక్తులందరూ వారి వారి గృహాల్లో లేక వారికి దగ్గరలో ఉండే దేవాలయాల్లో లేక ఆశ్రమాల్లో కలిసి కూర్చుని వారి వారి ఇష్ఠదేవతలకు భజన,కీర్తన, జపము, అర్చనలు చేసి హారతి ఇచ్చి ప్రసాద వితరణ చెయ్యాలి.

అవకాశం ఉంటే అయోధ్యలో జరుగుతున్న పూజాకార్యక్రమం టి వి లో ప్రత్యక్ఛ ప్రసారం వస్తున్న సమయంలో మీ చుట్టుప్రక్కల వారందరూ కలిసి వీక్చించేటట్లు  ఆడిటోరియంలో గాని హాల్ లో గాని పెద్ద తెరను ఏర్పాటు చేసుకుని వీక్షించే ప్రయత్నం చెయ్యండి.

ఈ సందర్భంలో మీ ఇళ్ళను, ఆశ్రమాలను, పీఠాలను వీలైనంత అందంగా ఉండేటట్లు అలంకరణ చేసి అందరికీ ప్రసాద వితరణ చెయ్యండి.మరియ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దీపాలు వెలిగించండి.

భవ్య రామమందిర నిర్మాణంలో మీ భాగస్వామ్యం ఉండేందుకు మీరు ఎంతవరకు విరాళం యివ్వగలరో అంత యివ్వడానికి సంకల్పం చెయ్యండి.

ప్రస్థుత పరిస్థితిలో భక్తులు అయోధ్య రావటం చాలా కష్టసాధ్యమైనందున ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు,ఎవరి ఆశ్రమాల్లో వాళ్ళు ఈ ఉత్సవాన్ని ఘనంగా జరిపించండి.

అందుబాటులో ఉన్న ప్రసార మాధ్యమాలన్నిటినీ అధికంగా ఉపయోగించుకొని ఈ విశేష కార్యక్రమంలో సమాజంలోని వ్యక్తులందరూ భాగస్వామ్యం అయ్యేటట్లు చూడండి.

పైన పేర్కొన్న వివిధ రకాలైన పద్దతులలో కార్యక్రమాలు అమలుచేసేటప్పుడు కొవిడ్-19 మహమ్మారి దృష్ట్యా ప్రభుత్వము, స్థానిక అధికారులు విధించిన నియమాలను తప్పక పాటించండి.

ఇట్లు
వినోద్ బన్సల్,

జాతీయ ప్రతినిధి – విశ్వహిందూ పరిషత్
ఫోన్-9810949109
@vinod_bansal