రాబోయే ఏడాదిన్నరలో 10లక్షల ఉద్యోగాలు భర్తీ చేపట్టాలని అన్ని ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖలను ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించారు. అన్ని శాఖలు, మంత్రిత్వ శాఖలలో ఉద్యోగ స్థితిని సమీక్షించి వచ్చే ఏడాదిన్నరలో 10 లక్షల మందిని “మిషన్ మోడ్”లో నియమించాలని ప్రధాని మంగళవారం తన ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం ట్విట్టర్ ఖాతా మంగళవారం ఒక ట్విట్ చేసింది.
PM @narendramodi reviewed the status of Human Resources in all departments and ministries and instructed that recruitment of 10 lakh people be done by the Government in mission mode in next 1.5 years.
— PMO India (@PMOIndia) June 14, 2022
కోవిడ్ కారణంగా నిరుద్యోగ సమస్య తలెత్తిన కారణంగా ప్రధానమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో డిసెంబర్ 2023 నాటికి 10 లక్షల ఖాళీల భర్తీకి కేంద్రం గడువు విధించింది. ఈ మేరకు అన్ని ఉద్యోగ నియామకాలు వచ్చే 18 నెలల్లోపు పూర్తయే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు.
ఇటీవల నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) విడుదల చేసిన తాజా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) ప్రకారం భారతదేశ పట్టణ నిరుద్యోగిత రేటు జనవరి-మార్చి త్రైమాసికంలో 9.3 శాతంతో పోలిస్తే 2021 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 12.6 శాతానికి పెరిగింది. అయితే కోవిడ్ మహమ్మారి మొదటి వేవ్ సమయంలో కనిపించిన 20.8 శాతం ఉంది.
ఉపాధి కల్పనతో పాటు ఉపాధిని మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాధాన్యత అని ప్రభుత్వ డేటా పేర్కొంది.
దీని ప్రకారం, దేశంలో ఉపాధి కల్పన కోసం భారత ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది.