Home News ప్రపంచం కోసమే భారత్ ప్రగతి

ప్రపంచం కోసమే భారత్ ప్రగతి

0
SHARE

భారత్ ఎప్పుడూ తన కోసం మాత్రమే తాను అభివృద్ది చెందదు.  ప్రపంచంలో ఎన్నో దేశాలు అగ్రరాజ్యాలై ఆ తరువాత పతనమయ్యాయి. ఈనాడు కూడా పెద్ద దేశాలున్నాయి. వాటిని మహాశక్తిమంతమైన అగ్రరాజ్యాలు అంటారు. కానీ మనం చూస్తున్నాము ఈ దేశాలు, అగ్రరాజ్యాలు ఏం చేస్తున్నాయి? మొత్తం ప్రపంచం మీద ఆధిపత్యం సాధిస్తాయి. ప్రపంచం యావత్తును పరిపాలించాలని అనుకుంటాయి. ప్రపంచంలోని వనరులన్నింటినీ తమ కోసం ఉపయోగించుకుంటాయి. ప్రపంచం యావత్తు మీద ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ తమ రాజకీయాధికారమే నడవాలని అనుకుంటాయి. మొత్తం ప్రపంచం తనకు అనుగుణంగా, తాము చెప్పినట్లు నడుచుకోవాలని భావిస్తాయి.  ఇలా గతంలోనూ జరిగింది. ఇప్పుడు కూడా జరుగుతోంది. అందువల్ల ఒక దేశం అతి పెద్దది కావడం అనేది ప్రపంచానికి ప్రమాదకరమైన విషయమని ప్రపంచంలో ఎక్కువమంది నిపుణులు, విశ్లేషకులు అంటుంటారు. 

నేషనలిజం అనే పదానికి ఈనాడు ప్రపంచంలో మంచి అర్థం లేదు. కొన్నేళ్ల క్రితం సంఘ్ పని మీద యూకే వెళ్లడం జరిగింది. అక్కడ చర్చ జరుగుతోంది. 40-50 మంది నగరవాసులతో చర్చ జరుగుతోంది. అప్పుడు అక్కడ కార్యకర్త ఒకరు ఆంగ్ల పదాల అర్థం విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఆంగ్లం మీ భాష కాదు అన్నారు. మీరు మీ పుస్తకాల్లో చదువుకున్న ఆంగ్లం మాట్లాడతారు. కానీ ఇక్కడ సంభాషణలో పదాల అర్థం మారిపోతుంది. అందువల్ల మీరు నేషనలిజం  అనే పదాన్ని ఉపయోగించకండి. మీరు నేషన్ అంటే పర్లేదు. నేషనల్ అనవచ్చు. నేషనాలటీ అని కూడా వాడవచ్చు. కానీ నేషనలిజం అనవద్దు. నేషనలిజం అంటే హిట్లర్. నాజీవాదం. ఇలాంటి అర్థాలు ఉన్నాయి. కానీ మనందరికీ తెలుసు. ఒక జాతిగా భారత్ ఎప్పుడు పెద్దది అయినా, అలాంటి సందర్భాల్లో ప్రపంచానికి మంచే జరిగింది. మీరు ఇప్పుడే పాట విన్నారు.

ప్రపంచంలో ఎప్పుడైతే ప్రతి దేశం భ్రమించి తడబడిందో
సత్యాన్ని గుర్తించేందుకు ఈ భూమి వద్దకే వచ్చింది
ఈ భూమి ప్రతి దళితుడికి అండ ఇచ్చింది
ప్రతి పతితుడి ఉద్ధరణ జరిపింది మన దేశం
అటువంటి గొప్ప ధన్య దేశం మన భారత్
ఇది ఇందులో సత్యం.

ఇప్పుడు ప్రపంచానికి భారత్ అవసరం ఉంది.